వేణు స్వామి భార్య నాగ చైతన్యను గిఫ్ట్‌గా ఇమ్మన్న బ్యాగ్‌కు విమానాన్ని ఆపే సత్తా ఉందా?.. ఈ కథ తెలుసుకోవాల్సిందే...

నాగ చైతన్య - శోభిత ధూళిపాళ ఎంగేజ్మెంట్ అయ్యాక .. వారి ఫ్యూచర్ గురించి చెప్పి షాక్ ఇచ్చాడు వేణు స్వామి. ఆ తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీ జర్నలిస్టులు ఆయనపై ఉమెన్ కమిషన్, పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వేణు స్వామి భార్య ఫీల్ అయింది. ఓ సెటైరికల్ వీడియో రిలీజ్ చేసింది. నాగ చైతన్యను బహుమతి కావాలని అడిగింది.

Update: 2024-08-17 06:48 GMT

దిశ, ఫీచర్స్ : నాగ చైతన్య - శోభిత ధూళిపాళ ఎంగేజ్మెంట్ అయ్యాక .. వారి ఫ్యూచర్ గురించి చెప్పి షాక్ ఇచ్చాడు వేణు స్వామి. ఆ తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీ జర్నలిస్టులు ఆయనపై ఉమెన్ కమిషన్, పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వేణు స్వామి భార్య ఫీల్ అయింది. ఓ సెటైరికల్ వీడియో రిలీజ్ చేసింది. నాగ చైతన్యను బహుమతి కావాలని అడిగింది. అది కూడా LV బ్యాగ్ ఒక్కటి చాలని చెప్పింది. ఇంతకీ ఈ బ్యాగ్ ఖరీదు ఎంతో తెలుసా? ఈ ఇంటర్నేషనల్ బ్రాండ్ బ్యాగ్ స్టార్టింగ్ ప్రైస్ లక్షా యాభై వేలు కాగా ఖరీదైనవి పది లక్షల వరకు కూడా ఉన్నాయి.

ఇక ఈ కథ ఇలా ఉంటే ఈ బ్యాగ్ కు సంబంధించిన మరో స్టోరీ గురించి చూద్దాం. చైనీస్ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ డౌయిన్ లో షేర్ చేసిన వీడియో ప్రకారం.. ఖరీదైన తన లూయిస్ విట్టన్ బ్యాగ్‌ని ఎదుటి సీటు కింద భద్రపరచాలని సూచించింది విమాన బృందం. కానీ ఆమె ఇందుకు నిరాకరించింది. బ్యాగ్ తన పక్కనే పెట్టుకుంటానని సతాయించింది. దీనివల్ల ఫ్లైట్ దాదాపు రెండు గంటలు ఆలస్యంగా బయలుదేరాల్సి వచ్చింది. రెండు గంటలు అయినా సరే ఆమె బ్యాగ్ ను తన పక్కనే పెట్టుకుంటానని వాదించడంతో చివరకు ఆమెను దింపేయాల్సి వచ్చింది. ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. ఖరీదైన బ్యాగ్ కింద పెట్టడానికి మనసు రాలేదేమో అని కొందరు ఆమెకు మద్దతిచ్చారు. కానీ ఇంకొందరు మాత్రం కనీసం తోటి ప్రయాణికుల సమయానికి విలువనిచ్చి అయినా వెంటనే ఒప్పుకోవాల్సింది అంటున్నారు. ఆమెను ఫ్లైట్ నుంచి దింపేయడం బెస్ట్ చాయిస్ అని  చెప్తున్నారు.మొత్తానికి ఆమెను దింపాకే.. ఫ్లైట్ స్టార్ట్ కావడం విశేషం. కాగా ఆగస్టు 10న ఈ ఘటన జరగ్గా ఇందుకు సంబంధించిన వీడియోకు నాలుగు మిలియన్లకు పైగా వ్యూస్ రావడం విశేషం.

Tags:    

Similar News