ఫ్రిజ్‌లో ఈ పదార్థాలు నిల్వ చేయడం అతి ప్రమాదకరం..

వంటగదిలో అతి ముఖ్యమైన వస్తువులలో ఫ్రిజ్ కూడా ఒకటి. కాగా ఇందులో ఎక్కువ రోజులు ఆహారం నిల్వ చేసుకోవచ్చు. సాధారణంగా కూరగాయలు, పండ్లు, మిగిలిపోయిన కూరలు అన్నింటినీ ఫ్రిజ్‌లో స్టోర్ చేస్తుంటారు. కానీ ఇందులో

Update: 2023-06-24 14:41 GMT

దిశ, ఫీచర్స్: వంటగదిలో అతి ముఖ్యమైన వస్తువులలో ఫ్రిజ్ కూడా ఒకటి. కాగా ఇందులో ఎక్కువ రోజులు ఆహారం నిల్వ చేసుకోవచ్చు. సాధారణంగా కూరగాయలు, పండ్లు, మిగిలిపోయిన కూరలు అన్నింటినీ ఫ్రిజ్‌లో స్టోర్ చేస్తుంటారు. కానీ ఇందులో నిల్వ చేయకూడని పదార్థాలు కూడా ఉంటాయని, వాటిని అందులో ఉంచటం చాలా డేంజర్ అని నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ ఆ పదార్థాలు ఏవో తెలుసుకుందాం.

1. గుడ్లు

చాలా మంది గుడ్లను ఫ్రిజ్‌లో స్టోర్ చేస్తారు. తయారీదారులు కూడా ఇందుకోసం సెపరేట్‌ ట్రేను ఇస్తారు. అయితే వీటిని ఫ్రిజ్‌లో ఉంచడం కామన్‌గా కనిపిస్తున్నా.. గుడ్డు ఒక నిర్దిష్ట ఉష్ణోగ్రత కంటే తక్కువగా ఉన్నప్పుడు దాని షెల్ లోపల పగిలిపోతుంది. అందుకే గుడ్లు నిల్వ చేయడానికి ఫ్రీజర్ మంచి ప్రదేశం కాదు. మామూలుగా బయట పెట్టుకోవడం ఉత్తమం.

2. చీజ్

చాలా మంది చీజ్ అనగానే ఫ్రిజ్‌లో పెడతారు. ఒక్కసారి కట్ చేయగా మిగిలింది స్టోర్ చేస్తుంటారు. కానీ అలా తినడం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. చీజ్ ఫ్రెష్‌గా ఉన్నప్పుడే ఉపయోగించాలని సూచిస్తున్నారు.

3. బంగాళాదుంపలు

కూరగాయలు తీసుకురాగానే వాటిని శుభ్రంగా ఫ్రిజ్‌లో పెట్టుకుంటారు. అయితే బంగాళదుంప మాత్రం పెట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే చల్లని ఉష్ణోగ్రత వద్ద దుంపలు ఉండటం వల్ల వాటికి మొలకలు వస్తాయి. రుచికరమైన బంగాళాదుంప చేదుగా మారుతుంది. అందుకే ఫ్రిజ్‌లో కాకుండా ఫ్రిజ్ కింద స్టోరేజ్ ప్లేట్ బాక్స్‌లో వేసుకుంటే సరిపోతుంది.

4. పాస్తా

బియ్యం మాదిరి గానే పాస్తా కూడా ఫ్రిజ్‌లో పెట్టకూడని పదార్థం. పాస్తా సాస్ మాత్రమే పెట్టుకోవాలి. పాస్తా మాత్రం విడిగా ఉడికించుకొని, ఆ తర్వాత పాస్తా సాస్ కలుపుకుంటే మంచిది.

5.వెల్లుల్లి

వెల్లుల్లిపాయలు ఫ్రిజ్‌లో కంటే గాలి, వెలుతురు ఉండే చోట పెడితే నెలరోజులైనా ఫ్రెష్‌గా ఉంటాయి. వీటిని ఫ్రిజ్‌లో పెడితే ఫంగస్ వస్తుంది. చాలా మంది అల్లం పేస్ట్‌ను ఫ్రిజ్‌లో పెడుతుంటారు. కానీ అలా పెట్టడం వల్ల అల్లం పేస్ట్ వాసన కోల్పోతుంది.

Read more:

వాస్తు ప్రకారం వంటగదిలో గ్యాస్ స్టవ్ ఆ దిశలోనే ఉండాలి.. లేకపోతే సమస్యలు తప్పవు..  

మీ గుండెను తీవ్ర ప్రమాదంలో పడేసేది ఇదే..  


Similar News