పండగ వేళ మాంసం తిన్నారో అంతే సంగతి.. కోళ్లకు స్టెరాయిడ్స్‌తో పాటు..?
రెండు తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగ సందడి మొదలైంది.
దిశ, ఫీచర్స్: రెండు తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగ సందడి మొదలైంది. ఇక విద్యార్థులు పండుగను సెలబ్రేట్ చేసుకునేందుకు ప్రభుత్వం స్కూళ్లకు కూడా సెలవులు ప్రకటించింది. ఉద్యోగస్థులు సొంత గ్రామాల్లోకి వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు.
ఇక సంక్రాంతి పండుగ అంటేనే రంగు రంగుల ముత్యాల ముగ్గులు, ఘుమఘుమలాడే పిండివంటలు, హరిదాసుల సందడి. వీటితో పాటు సంక్రాంతికి సంప్రదాయంగా వచ్చే కోడి పందాల పోటీ. ఈ కోడి పందాలు ఎక్కువగా ఏపీలో జరుపుకుంటారు. పండుగ సందర్భంగా ఏదో సరదాగా మొదలైన ఈ పందాలు ఆ తర్వాత కోట్లకు కోట్లు చేతుల మారే రేంజ్‌కు వచ్చింది. ఈ కోడి పందాల కోసం 6 నెలల ముందు నుంచే కోడి పుంజులకు బాగా దానా పెడుతారు. బాదం, పిస్తా ఇలా ఎన్నో రకరకాల బలమైన ఫుడ్‌ను కోళ్లకు పెట్టి వాటిని బలంగా తయారు చేస్తారు. అయితే ఇప్పుడు కోళ్లు పందాల్లో బాగా పోటీ చేసేందుకు.. కోళ్లకు స్టెరాయిడ్స్ అండ్ ఆల్కహాల్ డోస్‌లు ఇస్తున్నట్లు సోషల్ మీడియాలో జనాలు చర్చించుకుంటున్నారు.