పాపం కుక్క! ఆకలి తీర్చుకొనేందుకు హైవేపై కిలో మీటరు పరుగు.. చివరికి ఏమైందంటే?

విశ్వాసానికి మారుపేరు కుక్క. కుక్కను చాలామంది ఇంట్లోనే పెంచుకుంటారు. వాటికి కడుపు నిండా భోజనం పెట్టి అల్లారు ముద్దుగా చూసుకుంటారు.

Update: 2024-05-21 06:28 GMT

దిశ, ఫీచర్స్: విశ్వాసానికి మారుపేరు కుక్క. కుక్కను చాలామంది ఇంట్లోనే పెంచుకుంటారు. వాటికి కడుపు నిండా భోజనం పెట్టి అల్లారు ముద్దుగా చూసుకుంటారు. కానీ వీధి కుక్కల పరిస్థితి వర్ణనాతీతం. అవి కూటి కోసం చేసే విద్యలు అంతా ఇంతా కాదు.

ఇదిలా ఉండగా ఓ కుక్క వేసవి కాలంలో ఆకలికి అల్లాడిపోయింది. తన ఆకలి తీర్చుకొనేందుకు హైవేపై ఏకంగా ఒక కిలోమీటరు పరుగు తీసింది. ఆ కుక్క తన ఆకలి తీర్చుకొనేందుకు పడ్డ పాట్లు చూస్తే అయ్యో అనకుండా ఉండలేరు. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలోని పాత సెంటర్‌లోని రెడ్ బకెట్ బిర్యాని పాయింట్ వద్ద ఒక వ్యక్తి బిర్యాని తిని మిగిలిన బిర్యాని ఒక కవర్ లో పెట్టి పక్కనే పడవేశాడు. ఆ బిర్యాని రుచికి ఆ వీధి కుక్క అలవాటు పడింది. ఆ బిర్యాని పాయింట్ నుంచి బస్ స్టేషన్ వరకు కిలోమీటర్ దూరం నేషనల్ హైవే పై పరుగు తీస్తూ.. నోటితో బిర్యాని కవర్ పట్టుకుని ట్రాఫిక్ కు ఎక్కడ అంతరాయం కలగకుండా క్రమశిక్షణగా పరుగు తీసింది. ఇది కేవలం ఒక్క రోజు జరిగిన విన్యాసం కాదు. రెగ్యులర్ గా తనకు నచ్చిన బిర్యానిలో చికెన్ ముక్కలు తినేందుకు రోజు పరుగులు తీస్తూనే ఉంటుంది. ఇది చూసి పట్టణ వాసులు ఔరా అంటున్నారు. కుక్క కు విశ్వాసం తో పాటు.. బిర్యాని అంటే కూడా పిచ్చే అని అంటున్నారు.


Similar News