రాగి, జొన్న, గోధుమ.. మూడింటిలో ఏ రొట్టె బెస్ట్? నిపుణులు ఏం చెబుతున్నారంటే?
ప్రస్తుత జీవన శైలిలో మార్పుల కారణంగా ఎంతో మంది అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు.
దిశ, ఫీచర్స్: ప్రస్తుత జీవన శైలిలో మార్పుల కారణంగా ఎంతో మంది అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. ఈ మార్పుల కారణంగా చాలా మంది ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య బరువు. ప్రతి మనిషికి సమయానికి నిద్రతో పాటు ఆహారం కూడా ఎంతో ముఖ్యం. నీరు, గాలి ఎంత ముఖ్యమో సమయానికి మంచి నాణ్యత గల ఫుడ్ తీసుకోవడం అంతే ముఖ్యం. మనం తీసుకునే ఫుడ్ విషయంలో పలు జాగ్రత్తలు తీసుకుంటే ఎలాంటి అనారోగ్య సమస్యలు రావు. ముఖ్యంగా జీర్ణ సమస్యలు దరిచేరవు.
కాగా మనిషి పూర్తి ఆరోగ్యం కోసం.. డైలీ తప్పకుండా 6 నుంచి 8 గంటలు నిద్రించాలి. మూడు పూటల సరిపడా ఆహారం తీసుకోవాలి. లేకపోతే అనేక రకాల వ్యాధుల బారిన పడాల్సి వస్తుంది. ఆహారం సరైన సమయానికి తీసుకోకపోవడం వల్లే గ్యాస్ ఫామ్ అయి బరువు పెరుగుతున్నారని తాజాగా నిపుణులు చెబుతున్నారు. అయితే చాలా మంది బరువు తగ్గడానికి లేదా బరువును కంట్రోల్ చేయడానికి రాత్రి పూట రాగి, జొన్న, గోధుమ రొట్టెలు తింటారు.
ఈ మూడింటిలో ఆరోగ్యానికి అండ్ వెయిట్ లాస్ అవ్వడానికి ఏ రొట్టె మంచిదని చాలా మందిలో ఓ ప్రశ్న తలెత్తే ఉంటుంది. మీ ప్రశ్నకు నిపుణులు ఏం చెబుతున్నారో ఇప్పడు తెలుసుకుందాం..
ప్రోటీన్లు, ఫైబర్, ఐరన్, ఫాస్పరస్, కాల్షియం, విటమిన్ బి, సి పుష్కలంగా ఉండే.. గోధుమలు, జొన్నలు, రాగులు ఆరోగ్యానికి ఎంతో మంచివి. ఈ రొట్టెలు తినడం వల్ల షుగర్ లెవల్స్ అదుపులో ఉంటాయి. ఆకలిని నియంత్రించి.. వెయిట్ లాస్ అవ్వడానికి మేలు చేస్తాయి. రోజూ రాత్రి ఈ రొట్టెలను తీసుకోవడం వల్ల శరీరానికి సరిపడా ఎనర్జీ చేకూరుతుంది. అయితే జొన్న, గోధుమ, రాగి.. ఈ మూడు రొట్టెలు కూడా ఆరోగ్యానికి అండ్ బరువు కంట్రోల్‌లో ఉంచుతాయి. ఇవి మూడు రొట్టెలు హెల్త్‌కు మేలు చేస్తాయని తాజాగా నిపుణులు చెబుతున్నారు. ఈ మూడు రొట్టెల ఆరోగ్య ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
ఒక రాగి రొట్టెలో 3.1 గ్రాముల ఫైబర్ ఉంటుంది. జొన్న రొట్టెలో 1.4గ్రాముల ఫైబర్ ఉంటుంది. ఈ రొట్టెలు జీర్ణాశయ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ఎంతో సహాయపడతాయి. జొన్న, గోధుమల్లో పోషకాలు, ఫైబర్ ఎక్కువగా ఉంటాయి. ఒక గోధుమ రొట్టెలో ఉండే 1.9 గ్రాముల ఫైబర్.. శరీరంలో పేగుల కదలికను హెల్తీగా ఉంచడంలో మేలు చేస్తుంది. బరువు తగ్గించడానికి ఈ రొట్టె చాలా బాగా సహాయపడుతుంది.
ఇక రాగుల ప్రయోజనాలు చూసినట్లైతే.. రాగుల్లో గ్లూటెన్ ఉండదు. దీంతో ఇవి గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో ఎంతో సహాయపడుతాయి. జీర్ణ సమస్యలు, బరువు సమస్యలను దూరం చేస్తాయి. నిపుణులు చెప్పిన ఈ మూడు రొట్టెలను తీసుకుంటే బరువు తగ్గడంతో పాటు ఆరోగ్యంగా ఉండొచ్చు. కాగా ఎలాంటి సందేహం లేకుండా రాగి, జొన్న, గోధుమ రొట్టెలను తినండి. ఆరోగ్యాన్ని మీ సొంతం చేసుకోండి.