Viral video: స్టేజ్ డ్యాన్సర్‌కు డబ్బులిచ్చిన కొడుకు.. తండ్రి ఎంట్రీతో సీన్ మారిపోయింది!
కొడుకు సక్రమంగా క్రమశిక్షణగా లేకపోతే ఆ తండ్రి రియాక్షన్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

దిశ, వెబ్ డెస్క్: కొడుకులు అమ్మ ముందు పిచ్చి వేషాలు వేసినా నడుస్తుందేమో కానీ, నాన్నతో పెట్టుకుంటే మామూలుగా ఉండదు. కొడుకు సక్రమంగా క్రమశిక్షణగా లేకపోతే ఆ తండ్రి రియాక్షన్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బెల్టు తీసి బాదేస్తాడు. తాజాగా ఇందుకు సంబంధించిన ఓ వీడియో (Video) ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా (Viral) మారింది.
ఓ వీధిలో ఏదో కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో స్టేజ్ డ్యాన్సర్ డ్యాన్స్ చేస్తూ ఉండగా, ముందు ప్రేక్షకులు కూర్చొని ఉన్నారు. ఓ అబ్బాయి అక్కడి వచ్చి, ఆ డ్యాన్సర్‌కు డబ్బులిచ్చి స్టేజ్ ముందు చిందులేయబోయాడు. ఇంతలో ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు కానీ, ఆ అబ్బాయి తండ్రి ఎంట్రీ ఇచ్చాడు. లావుపాటి కర్రతో కొడుకును కొట్టడం ప్రారంభించాడు. ఈ పరిణామంతో ఆ అబ్బాయి అక్కడి నుంచి పారిపోయాడు. అక్కడున్న వారు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్‌గా మారింది. ఇక ఈ వీడియో చూసిన నెటిజన్లు భిన్న అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది దీనిపై జోక్స్ వేస్తూ మీమ్స్ చేస్తుండగా, మరికొందరు డబ్బు అనవసరంగా దుబారా చేస్తున్న కొడుకును క్రమశిక్షణలో పెడుతున్నడని తండ్రి పక్షాన నిలిచారు. అలాగే, క్రమశిక్షణ నేర్పడానికి బహిరంగంగా కొట్టడం సరికాదని ఇంకొంత మంది తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.
Kalesh over Father Caught his Son giving money to Stage Dancer:
— Ghar Ke Kalesh (@gharkekalesh) March 26, 2025
pic.twitter.com/7c5roCUpdf