Sleep rule: నిద్రలేమికి కొత్త పరిష్కారం..10-3-2-1 రూల్‌‌తో బెస్ట్ రిజల్ట్

హెవీ వర్క్, మెంటల్ స్ట్రెస్ అండ్ టెన్షన్స్, హెల్త్ అండ్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్.. ఇలా కారణాలేమైనా అవి నిద్రలేమి సమస్యకు దారితీసే అవకాశం ఉందని నిపుణులు చెప్తుంటారు.

Update: 2024-08-15 10:22 GMT

దిశ, ఫీచర్స్ : హెవీ వర్క్, మెంటల్ స్ట్రెస్ అండ్ టెన్షన్స్, హెల్త్ అండ్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్.. ఇలా కారణాలేమైనా అవి నిద్రలేమి సమస్యకు దారితీసే అవకాశం ఉందని నిపుణులు చెప్తుంటారు. ఎంత ప్రయత్నించినా నిద్రరావడం లేదని కొందరు బాధపడుతుంటారు. రాత్రిపూట మేల్కోవడం వల్ల డే టైమ్‌లో యాక్టివ్‌గా ఉండలేక, పనులు చేసుకోలేక ఇబ్బందులు పడుతుంటారు. అలాంటి వారికి 10-3-2-1 రూల్ చక్కటి పరిష్కారమని పోషకాహార నిపుణులు దీప్మిఖా జైన్ అంటున్నారు. క్వాలిటీ స్లీప్ కోసం ఏం చేయాలో ఇన్‌స్టాగ్రామ్ వేదికగా కొన్ని టిప్స్ పంచుకున్నారు. అవేంటో చూద్దాం.

నిద్రకు 10 గంటల ముందు..

టీ, కాఫీ తాగే అలవాటు చాలా మందికి ఉంటుంది. రోజుకు మూడు నాలుగు సార్లు తాగితే పర్లేదు కానీ అంతకంటే ఎక్కువ తాగినా, ముఖ్యంగా సాయంత్రం, రాత్రివేళ్లల్లో తాగినా నిద్రలేమి సమస్యలు వస్తాయి. అలా రాకుండా ఉండాలంటే నిద్రవేళకు 10 గంటల ముందు నుంచే టీ, కాఫీ వంటి కెఫిన్ రిలేటెడ్ పానీయాలు, పదార్థాలు తీసుకోవద్దని దీప్మిఖా జైన్ పేర్కొన్నారు.

3 గంటల ముందు..

బిజీ లైఫ్ షెడ్యూల్ కారణంగా కొందరు, అలవాటు కొద్దీ కొందరు ప్రస్తుత రోజుల్లో రాత్రి 10 గంటల తర్వాత భోజనం చేస్తుంటారు. కానీ ఇది మంచిది కాదు. దీనివల్ల ఆహారం జీర్ణం కాకపోవడం, శరీరంలో కార్టిసాల్ వంటి స్ట్రెస్ హార్మోన్లు రిలీజ్ కావడం వంటివి జరుగుతాయి. క్రమంగా క్వాలిటీ స్లీప్ దెబ్బతింటుంది. కాబట్టి ఈ సమస్యను ఎదుర్కోవాలంటే రాత్రి నిద్రవేళకు 3 గంటల ముందు నుంచే ఎటువంటి ఆహారం తీసుకోవద్దు.

2 గంటల ముందు..

కొందరు రాత్రివేళల్లో మేల్కొని పనులు చక్కబెడుతుంటారు. ఉదయంపూట పెండింగ్ వర్క్ అంతా కంప్లీట్ చేసి పడుకోవాలని భావిస్తుంటారు. కానీ క్రమంగా ఇది నిద్రలేమి సమస్యకు దారితీస్తుంది. రాత్రివేళ నిద్రకు ఆటంకం కలిగేలా పనులు పెట్టుకోకపోవడం బెటర్. ఒకవేళ ఏదైనా పని ఉంటే నిద్రకు 2 గంటల ముందే పూర్తి చేసుకుంటే మంచిది.

1 గంట ముందు..

ఈరోజుల్లో ప్రతి ఒక్కరూ అర్ధరాత్రి వరకు స్మార్ట్ ఫోన్లలో మునిగిపోతున్నారు. టీవీ చూస్తూనో, సోషల్ మీడియా స్రోల్ చేస్తూనే ఉండటంవల్ల నిద్ర పట్టదు. కాబట్టి క్వాలిటీ స్లీప్ కోసం ఒక గంట ముందే మీ మొబైల్ ఫోన్ పక్కన పెట్టడం, స్ర్కీన్‌కు దూరంగా ఉండటం మంచిది. 

video Credits to fries.to.fit-Deepikha jain Insta id

Tags:    

Similar News