Single Child: తల్లిదండ్రులకు ఒక్కరే సంతానం.. సమస్యలకు దారితీస్తుందా?

Single Child: తల్లిదండ్రులకు ఒక్కరే సంతానం సమస్యలకు దారితీస్తుందా?

Update: 2024-10-01 12:53 GMT

దిశ, ఫీచర్స్ : కాలం మారింది. ఒకప్పటిలా ఇప్పుడు నలుగురైదుగురు పిల్లల్ని కనాలని దాదాపు ఎవరూ అనుకోవడం లేదు. పైగా ఎక్కువమంది ఉంటే భవిష్యత్‌లో వారి చదువులు, ఖర్చులు, ఫీజులు వంటివన్నీ భరించడం కష్టమవుతుందని, సరిపడా ఆస్తులు సంపాదించి పెట్టలేమని భావిస్తున్న మిడిల్ క్లాస్ పేరెంట్స్ చాలా మంది ఒకరు లేదా ఇద్దరు సంతానానికే ప్రయారిటీ ఇస్తున్నారు. అయితే ఒక్కరే ఉంటే గారాబం ఎక్కువై సరిగ్గా ఎదగలేరని, పలు సమస్యలకు దారితీస్తుందని, సమాజంలో కూడా ఇబ్బందులు ఎదుర్కొంటారని కొందరు చెప్తుంటారు. కాగా ఇందులో ఏమాత్రం నిజం లేదని ఓ తాజా అధ్యయనంలో వెల్లడైంది. తల్లిదండ్రులకు ఒక్కరే సంతానంగా ఉంటున్న పిల్లలే ఎక్కువ సంతోషంగా ఉంటారని నిపుణులు చెప్తున్నారు.

అధ్యయనంలో భాగంగా చైనాలోని మాకావూ యూనివర్సిటీకి చెందిన నిపుణులు కుటుంబంలో ఒకరు, అలాగే ఒకరికంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్నప్పుడు వారిలో ఎవరు ఎక్కువ సంతోషంగా ఉంటున్నారనే విషయాన్ని తెలుసుకునేందుకు 2.4 లక్షల మంది తల్లిదండ్రులను, వారి పిల్లలను స్టడీ చేశారు. ఒక్కరే ఉన్న పిల్లలు, అలాగే తోబుట్టువులు ఉన్న పిల్లల మానసిక ఆరోగ్యాలను పోల్చుతూ మొత్తం 113 అధ్యయనాల డేటాను విశ్లేషించారు. ఈ సందర్భంగా వారు తెలుసుకున్నదేమిటంటే.. తోబుట్టువులు ఉన్న పిల్లలకంటే కూడా, ఒక్కరే సంతానంగా ఉండే పిల్లలు ఎక్కువ సంతోషంగా, ఆరోగ్యంగా ఉంటున్నారు. ఒత్తిడి, ఆందోళన, ఓసీడీ, ఇతర రుగ్మతలు వీరిలో ఉండటం లేదు. అలాగే ఐక్యూ టెస్టుల్లో, స్కూల్ సబ్జెక్టుల్లో కూడా ఒక్కరే సంతానమైన పిల్లలు మెరుగ్గా ఉంటున్నారని తేలింది. ఒకే సంతానం కావడంతో తల్లిదండ్రులు పిల్లలకు ఎక్కువ సమయం, ఇతర వనరులు కేటాయించడం, వారి భవిష్యత్ కోసం కేర్ తీసుకోవడం వంటివి ఇందుకు కారణం అవుతున్నట్లు నిపుణులు చెప్తున్నారు. 


Similar News