సెల్ఫ్ కాన్ఫిడెంట్.. సానుకూల దృక్పథంతో పెరుగుతున్న ఏకాగ్రత
మీరు దేన్ని కోల్పోయినా పర్లేదు. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఆత్మవిశ్వాసం
దిశ, ఫీచర్స్ : మీరు దేన్ని కోల్పోయినా పర్లేదు. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఆత్మవిశ్వాసం కోల్పోవద్దు అంటుంటారు నిపుణులు. కాన్ఫిడెంట్‌కు ఉన్నపవర్ అలాంటిది. అదొక్కటి ఉంటే చాలు మీరు కోల్పోయినవన్నీ తిరిగి సాధించడంలో హెల్ప్ అవుతుంది. అన్ని సందర్భాల్లోనూ మీలో ధైర్యాన్ని నింపుతుంది. నిజం చెప్పాలంటే.. ఆత్మ విశ్వాసం లేకుంటే మనం ఏదీ సాధించలేం. అయితే ఇది ప్రయత్నించకపోయినా సహజంగానే ఏర్పడేది మాత్రం కాదు. మీ వంతు కృషి చేయాలి. మీపట్ల మీరు నమ్మకంగా, కాన్ఫిడెంట్‌గా ఉండేందుకు అనుసరించాల్సిన కొన్ని ఈజీ మెథడ్స్ కూడా ఉన్నాయి. అవేంటో చూద్దాం.
పాజిటివ్‌గా మాట్లాడండి
కొందరు మాట్లాడుతుంటే ఇంకాసేపు మాట్లాడితే బాగుండు అనిపిస్తుంది. వారు చెప్పే ప్రతీ విషయం ఆసక్తి కలిగిస్తుంది. ఎందుకంటే.. మాటతీరులో ఎక్కువ భాగం పాజిటివిటీ ఉంటుంది. అది మన హృదయాన్ని తాకుతుంది. మీరు కూడా ఆత్మ విశ్వాసం గల వ్యక్తులుగా మారాలంటే.. అలా ఉండటానికి ట్రై చేయండి. మీరు ఎవరితో మాట్లాడుతున్నా సానుకూల ధోరణి అధికంగా ఉండేలా చూసుకోండి. ఇది ఒక అలవాటుగా మారితే ఎదుటి వ్యక్తులకే కాకుండా మీపై మీకు కూడా సెల్ఫ్ కాన్ఫిడెంట్ పెరుగుతుంది. మీ స్పీచ్‌లో ఇతరులను లేదా మిమ్మల్ని ఉత్తేజ పరిచే అంశాలు తరచూ ఉండటం చాలా మేలు చేస్తుంది.
నీట్‌నెస్ మెయింటెన్ చేయండి
తరచూ శుభ్రత పాటించడం, ఆకట్టుకునే అలంకరణ కూడా ఆత్మ విశ్వాసాన్ని పెంపొందిస్తాయి. నీట్‌గా రెడీ అవడం, క్లీన్‌గా షేవ్ చేసుకోవడం, హుందాతనాన్ని కలిగించే హెయిర్ కటింగ్ కలిగి ఉండటం మీపట్ల ఇతరులకు గౌరవాన్ని పెంచుతాయి. దీంతో మీలో ఆత్మ విశ్వాసం పెరుగుతుంది. అలాగే సువాసలు కలిగిన పర్ఫ్యూమ్స్ మీలో మంచి అనుభూతిని కలిగించడం ద్వారా ఆత్మ విశ్వాసాన్ని పెంచుతాయి. చక్కటి డ్రెస్‌సెన్స్ గుడ్ లుక్స్ అండ్ అప్పియరెన్స్ కలిగి ఉండటంల్ల సెల్ఫ్ కాన్ఫిడెంట్‌కు కారణం అవుతాయి.
దయాగుణం.. సేవాభావం
దయా గుణం, సేవాభావం, ఉదారత్వం నలుగురిలో మీకు మంచి గుర్తింపు తెస్తాయి. మీలో మంచి అనుభూతిని కలిగిస్తాయి. దీంతో మీలో విశ్వాసం పెరుగుతుంది. అలాగే అప్పుడప్పుడైనా మీరు స్వయం సేవకంగా ఉండాలి. ఇతరులకు మీ చేతనైన సహాయం చేయడానికి స్వచ్ఛందంగా ముందుకు రావడంవల్ల సంతృప్తి కలుగుతుంది. అది సెల్ఫ్ కాన్ఫిడెంట్‌ను కూడా పెంచుతుంది. అలాగే సందర్భాన్ని బట్టి మీ మాట తీరు ఉండాలి. ప్రతీ విషయానికి ఆవేశం, ఆందోళన తగదు. ఇతరులకు అర్థమయ్యేలా కాస్త స్లోగా మాట్లాడటాన్నే చాలామంది విలువైనదిగా భావిస్తారు.
ఫెయిల్యూర్‌ను స్వీకరించండి
వైఫల్యాలను చూసి భయపడినవారు ఓడిపోతారు. కానీ వాటిని గుణపాఠంగా స్వీకరించిన వారిలో మాత్రం సెల్ఫ్ కాన్ఫిడెంట్ పెరుగుతుంది. ఫైనల్‌గా అది సక్సెస్ వైపు నడిపిస్తూనే ఉంటుంది. అందుకే ఫెయిల్యూర్‌ను జీవితంలో ఒక భాగం అని గ్రహించిన వారు ఎప్పుడూ సంతోషంగా ఉండగలుగుతారు. తమను తాము తీర్చిదిద్దుకునే ఆత్మ విశ్వాసాన్ని పొందుతారు.
ఇతరులతో పోల్చుకోవద్దు
కొందరు తమ కోసం తాము ఆలోచించుకోవడం కంటే కూడా ఇతరుల గురించే ఎక్కువ ఆలోచిస్తుంటారు. తమ జీవితాలను మరొకరితో పోల్చుకుంటూ బాధపడుతుంటారు. నిజానికి స్వయం ఎదుగుదలకు ఇది పెద్ద ఆటంకం. లైఫ్‌లో ఏ ఇద్దరి ఆలోచనలు, ఆచరణ ఒకేలా ఉండవు. ఎవరి పద్ధతిలో వారు మెరుగైన దిశగా ముందుకు సాగుతుంటారు. ఇతరుల్లో మీకు ఏదైనా నచ్చితే స్ఫూర్తి పొందాలి తప్ప, అచ్చం అలాగే చేయాలని, అలాగే ఉండాలని అనుకోవద్దు. మీ పద్ధతిలో మీరు ప్రయత్నించండి. పోల్చుకోవడం ఎప్పుడైతే వదిలేస్తారో అప్పుడే మీ అభివృద్ధి కోసం మీరు ప్రయత్నిస్తారు. అది మీలో కొండంత ఆత్మ విశ్వాసాన్ని నింపుతుంది.
నిటారుగా నిలబడండి
శరీర కదలికలకు, మనలో ఆనందానికి కారణం అయ్యే డొపమైన్ హార్మోన్ విడుదలకు లింక్ ఉంటుంది. కాబట్టి మీరు కూర్చున్నప్పుడు, నిలబడినప్పుడు తరచుగా మీ భుజాలు వెనుకకు నిటారుగా ఉండేలా చూసుకోండి. దీనివల్ల మీలో డొపమైన్ చక్కగా రిలీజ్ అయి ఆత్మ విశ్వాసాన్ని పెంచుతుంది. మీలోని అభద్రతాభావాన్ని పారదోలుతుంది. అలాగే మీరు చేస్తు్న్న ప్రతీ పనిలో మెరుగుదల ఉండేలా ట్రై చేయండి. ఎందుకంటే సమర్థత అనేది ఆత్మ విశ్వాసాన్ని పెంచుతుంది. ఉదాహరణకు మీరు రచయిత లేదా శిల్పి కావాలి అనుకుంటే చిన్న చిన్న చిన్నగా ప్రారంభించండి. రోజూ కొంచెం పనిచేస్తూ పోండి. ఎందుకంటే మీరొక విషయంలో క్రమంగా మెరుగు పడుతున్నాం అనే భావన మీలో సెల్ఫ్ కాన్ఫిడెంట్‌ను పెంచుతుంది.
సమయానికి నిద్ర పోవడం
నిద్రలేమి కూడా సెల్ఫ్ కాన్ఫిదెంట్‌ను కోల్పోవడానికి కారణం అవుతుంది. ఎందుకంటే సరైన నిద్రలేకపోతే మీరు మెదడు చురుకుదనాన్ని కోల్పోతుంది. ఆందోళన, ఆత్రుత, టెన్షన్, ఎమోషనల్ వంటి భావోద్వేగాలను మేనేజ్ చేయడలో విఫలం అవుతారు. చేస్తున్న పనిలో క్వాలిటీ లోపిస్తుంది. కొత్త ఐడియాలు, క్రియేటివిటీ మందగిస్తాయి. అందుకే జీవితంలో ఆత్మ విశ్వాసం, నమ్మకం కలిగి ఉండాలంటే సరైన నిద్ర కూడా ముఖ్యం.