వేగంగా బరువు తగ్గడాన్ని స్లిమ్‌నెస్ అనుకునేరు.. పలు వ్యాధులకు సంకేతం కావచ్చు!

ఒకప్పుడు బొద్దుగా ఉంటే ముద్దుగా ఉన్నావ్ అనేవారు. ఇప్పుడా పరిస్థితి మారిపోయింది. సన్నగా ఉంటేనే అసలైన గ్లామర్‌గా పరిగణిస్తుంటారు చాలామంది.

Update: 2024-06-06 12:53 GMT

దిశ, ఫీచర్స్ : ఒకప్పుడు బొద్దుగా ఉంటే ముద్దుగా ఉన్నావ్ అనేవారు. ఇప్పుడా పరిస్థితి మారిపోయింది. సన్నగా ఉంటేనే అసలైన గ్లామర్‌గా పరిగణిస్తుంటారు చాలామంది. ఎంత స్లిమ్‌గా ఉన్నావంటూ తెగ పొగిడేస్తుంటారు. సాధారణంగా లావుగా ఉండటం ఊబకాయం, అధిక బరువు సమస్యలకు కూడా నిదర్శనం కావచ్చు. అందుకే చాలామంది స్లిమ్‌గా ఉండాలని భావిస్తు్న్నారు. అధిక బరువు సమస్య నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ అతికొద్ది కాలంలోనే స్లిమ్‌గా మారడం లేదా అధిక బరువు తగ్గడం కూడా అనారోగ్యానికి సంకేవతమని మీకు తెలుసా?

శరీరంలో మార్పులు

ప్రపంచ వ్యాప్తంగా అనేక మందిని వేధిస్తున్న సమస్యల్లో అధిక బరువు ఒకటి. దీని కారణంగా డయాబెటిస్, గుండె జబ్బులు వంటి ఇతర అనారోగ్యాలు తలెత్తే చాన్స్ ఉంటుంది. కాబట్టి బరువు లేదా లావు తగ్గాలనుకోవడం సహజం. కానీ ఏ ప్రయత్నం చేయకుండానో లేదా ప్రయత్నం చేసిన నెలరోజుల్లోనే మీరు ఊహించని విధంగా బరువు తగ్గడం, సన్న బడటం జరిగితే గనుక అనుమానించాల్సిందే. ఎందుకంటే ఇది శరీరంలో ప్రతికూల మార్పులకు, వ్యాధులకు కూడా సంకేతం కావచ్చునని నిపుణులు చెప్తున్నారు. కచ్చితమైన లేదా స్పష్టమైన రీజన్ లేకుండా 6 నుంచి 12 నెలల కాలంలోనే 4.5 కిలోలు(10 పౌండ్లు) గానీ, అంతకంటే ఎక్కువగానీ బరువు తగ్గడం శరీరంలో పలు వ్యాధులకు కారణం కావచ్చు.

టైప్-1 డయాబెటిస్

ఊహించని విధంగా వెయిట్ లాస్ అయ్యారంటే అది గ్లామర్‌కు నిదర్శనం అనుకోకండి. టైప్ 61 డయాబెటిస్‌కు ప్రారంభ సంకేతం కూడా కావచ్చు అంటున్నారు వైద్య నిపుణులు. ఈ విషయం తెలియక చాలామంది తాము స్లిమ్‌గా తయారవుతున్నాం అనుకుంటారు. కానీ అసలు విషయం తెలిశాక బాధపడుతుంటారు. వాస్తవానికి టైప్ 1 డయాబెటిస్ బాధితుల ప్యాంక్రియాస్‌లో గల ఇన్సులిన్ మేకింగ్ కణాలు రోగనిరోధక వ్యవస్థ ద్వారా దాడికి గురికావడంవల్ల అతికొద్ది రోజుల్లో బరువు తగ్గుతారు. అట్లనే బాడీ ఇన్సులిన్‌ను ప్రొడ్యూస్ చేయనప్పుడు, అది గ్లూకోజ్‌ను ఇంధనంగా (fuel) యూజ్ చేసుకోవచ్చు. ఇలాంటప్పుడు కూడా కండరాల క్షీణత, ఫాస్ట్‌గా బరువు తగ్గడం స్టార్ కావచ్చు. డైట్ మెయింటెన్ చేయడం, డైలీ ఇన్సులిన్ తీసుకోవడం వంటివి పరిస్థితిని మేనేజ్ చేయడంలో డయాబెటిస్ బాధిుతులకు మేలు చేస్తుంది.

హైపో థైరాయిడిజం

నిజానికి థైరాయిడ్ అధికం కావడమనేది జీవక్రియను నియంత్రిస్తుంది. కానీ ఓవర్ యాక్టివ్ థైరాయిడ్ ఆ పనిని మరింత స్పీడప్ చేస్తుంది. ఫలితంగా శరీరం ఎక్కువ కేలరీలను బర్న్ చేయడం మూలంగా త్వరగా బరువు తగ్గవచ్చు. శరీరంలో ఊహించని మార్పు, కొద్దిరోజుల్లోనే సన్నబడటం వంటివి గమనిస్తే హైపోథైరాయిడిజంగా అనుమానించాలి. యాంటీ థైరాయిడ్ డ్రగ్స్, బీటా బ్లాకర్స్ అండ్ రేడియోయోడిన్ థెరపీతో ఈ సమస్య నుంచి బయటపడవచ్చు. అలాగే స్వయం ప్రతి రక్షక వ్యాధిగా పేర్కొనే రుమటాయిడ్ ఆర్థరైటిస్ వల్ల కూడా కొన్నిసార్లు వేగంగా బరువు తగ్గవచ్చు. కాబట్టి పరిస్థితిని బట్టి వైద్య నిపుణులను సంప్రదించడం బెటర్.

టీబీ, క్యాన్సర్, డిప్రెషన్

మెంటల్ హెల్త్ ఇష్యూస్ కూడా కొన్నిసార్లు వేగంగా బరువు తగ్గడానికి కారణం అవుతుంటాయి. ఎందుకంటే డిప్రెషన్ వంటి మూడ్ డిజార్డర్స్ ఆకలి మందగించేలా ఎఫెక్ట్ చూపుతాయి. దీనివల్ల సరిగ్గా తినక బరువు తగ్గవచ్చు. సైకో థెరపీ, యాంటీ డిప్రెసెంట్స్ వంటి మందుల ద్వారా నిపుణులు దీనికి చికిత్స అందిస్తారు. దీంతోపాటు ఇన్‌ఫ్లమేటరీ బౌల్ డిసీజ్ (ప్రేగు వ్యాధి)వల్ల కూడా వెయిట్‌లాస్ జరగవచ్చు. క్షయవ్యాధి లేదా ట్యూబర్ కొలోసిస్ కూడా ఆకలి మందగించేలా చేస్తుంది. దీనివల్ల వేగంగా బరువు తగ్గవచ్చు. ఊహించని విధంగా వెయిట్‌లాస్ క్యాన్సర్ ప్రారంభ సంకేవతం కూడా కావచ్చు.

కంజెస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్

గుండెకు, జీర్ణ వ్యవస్థకు తగినంత బ్లడ్ సప్లయ్ కాకపోవడం లేదా ఆటంకం ఏర్పడటం కొన్నిరోజులు సంభవించినా అకస్మాత్తుగా బరువు తగ్గే చాన్సెస్ ఉంటాయి. దీనిని స్లిమ్‌నెస్ అనుకోని ఊరుకుంటే కంజెస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్ సంభవించే ప్రమాదం ఉంటుంది. కొద్దిరోజుల ముందు ఆహారంపై విరక్తి, వికారం, రోజు రోజుకూ సన్నబడటం, శ్వాసలో కొద్దిపాటి ఇబ్బంది కంజెస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్‌కు కారణం కావచ్చు. ఈ పరిస్థితిని తట్టుకోవడానికి శరీరం ఎక్కువ కేలరీలను బర్న్ చేస్తుంది కాబట్టి బాధితులు త్వరగా సన్నబడుతుంటారు. జీవన శైలిలో మార్పులు, హెల్తీ డైట్, వైద్య నిపుణుల సలహాలతో ఈ సమస్య నుంచి బయటపడవచ్చు. ముఖ్యంగా ఎటువంటి వ్యాయామాలు, ఆహార నియమాలు పాటించకుండానే బరువు తగ్గుతున్నారంటే ఏదైనా హెల్త్ ప్రాబ్లం అయి ఉంటుందని గుర్తుంచుకోవడం కూడా ముఖ్యం. 


Similar News