పర్యటకులను ఆకర్షిస్తున్న గ్రామం.. అక్కడ ప్రతీ ఇల్లు ఓ అద్భుతమే!
హస్తకళలు అంటే ఎవరు ఇష్టపడరు. చాలా మంది మహిళలు చేతితో తయారు చేసిన వస్తువులు కొనుగోలు చేసేందుకు ఎక్కువగా ఇష్టపడుతుంటారు.ఇక వాలెంటైన్స్ డే వస్తున్న సందర్భంగా చాలా మంది టూర్స్ వేస్తుంటారు. ఈ క్రమంలో హస్తకళ ప్రియులు తప్పనిసరిగా ఓ గ్రామాన్ని సందర్శించాలంట.
దిశ, ఫీచర్స్ : హస్తకళలు అంటే ఎవరు ఇష్టపడరు. చాలా మంది మహిళలు చేతితో తయారు చేసిన వస్తువులు కొనుగోలు చేసేందుకు ఎక్కువగా ఇష్టపడుతుంటారు.ఇక వాలెంటైన్స్ డే వస్తున్న సందర్భంగా చాలా మంది టూర్స్ వేస్తుంటారు. ఈ క్రమంలో హస్తకళ ప్రియులు తప్పనిసరిగా ఓ గ్రామాన్ని సందర్శించాలంట.
ఆ గ్రామమే రఘురాజ్ పూర్. ఇది ఓ సాంప్రదాయ కళారూపానికి నిలువెత్తు సాక్ష్యం. అంతరించిపోతోన్న కళాకృతులకు జీవం పోసేందుకు నిత్యం అక్కడ ఓ యజ్ఞమే జరుగుతోంది. అందుకే జాతీయ, అంతర్జాతీయ గుర్తింపు పొందేలా పట్టా చిత్ర కళ ప్రపంచానికి పరిచయమైంది.ఇక ఆ గ్రామాన్ని సందర్శిచడానికి వెళితే ప్రకృతి మనకు స్వాగం పలుకుతుంది.
అరటి, కొబ్బరి,జాక్ ఫ్రూట్,తాడి చెట్లతో నిండిన రోడ్లు, ఇరువైపులా తమతపాకులు,వరిపోలాలి,ఓడియా ఖాజా వాసనలతో ఆ జర్నీ ఊహించుకోవడానికే ఎంతో అందంగా ఉంటుందంట.సుప్రసిద్ధ పూరీ జగన్నాథ్ ఆలయానికి 10 కి.మీ దూరంలో,దాదాపు180 గృహాలతో రఘురాజ్ పూర్ గ్రామం ఉంది.అక్కడ కళాకారులు దాదాపు తొమ్మిది రకాల చేతిపనులు అభ్యసిస్తున్నారు. పట్టచిత్ర పెయింటింగ్స్, తాటి ఆకు చెక్కడం, చెక్క చెక్కడం, టస్సార్ సిల్క్ పెయింటింగ్స్, పేపియర్-మాచే క్రాఫ్ట్స్, స్టోన్ కార్వింగ్ హస్తకళలు , కొబ్బరి చేతిపనులు, ఆవు పేడ పెయింటింగ్స్ నుండి అల్యూమినియం క్రాఫ్ట్స్ అన్నిరకాల హస్తకళలు ఉంటాయి. అందువల్ల దీనిని హెరిటేజ్ క్రాఫ్ట్ విలేజ్ అని కూడా పిలుస్తారు. అయితే రఘురాజ్‌పూర్‌కు కీర్తి యొక్క నిజమైన కళాకృతి మాత్రం పట్టాచిత్ర.
ఇక ఈ గ్రామంలో ప్రతి ఇంటిని అందమైన వాల్ పెయింటింగ్స్ , కుడ్యచిత్రాలు, జగన్నాథుని చిత్రాలు, రామాయణం, మహాభారతం, దశావతారాలు, కృష్ణ లీల దృశ్యాలు, సంప్రదాయ వివాహ వేడుకలు మొదలైన వాటితో అలంకరించబడతాయి. అవి చూడటానికి ఎంతో అందంగా కనిపిస్తాయి.అంతే కాకుండా ఆ పెయింటింగ్ ద్వారా మనం దాని చరిత్ర తెలుసుకోవచ్చు. అందుకే అక్కడికి వెళ్లిన పర్యటకులు, అక్కడి ప్రతీ ఇళ్లు ఓ అద్భుతమే అని అంటుంటారు. అలాగే హెరిటేజ్ గ్రామంలోని ప్రతి ఇంట్లో చేతి వృత్తి నిపుణులు తాటాకు శిల్పాలు, మృణ్మయ కళలు, చెక్కబొమ్మలు అనేక రకాల వస్తువులూ తయారు చేస్తూ కనిపిస్తారు.ఇక వీటిని వారు వచ్చే పర్యటకులకు అమ్మతుంటారు. వీటి ధర రూ.500 ల నుంచి లక్ష రూపాయల వరకు ఉంటుంది. మరి ఇంకెదుకు ఆలస్యం అద్భుతమైన ఆ గ్రామాన్ని చూడటానికి వెళ్లండి, ఏంజాయ్ చేసి రాండి.