ఈ అనారోగ్య సమస్యలున్న వారు ఆ కూరగాయను తినకూడదు.. ఎందుకంటే..?

శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి కూరగాయలు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి.

Update: 2024-06-28 08:17 GMT

దిశ, ఫీచర్స్ : శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి కూరగాయలు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. తీవ్రమైన అనారోగ్య సమస్యల నుంచి మనల్ని రక్షించే అనేక పోషకాలను కలిగి ఉంటాయి. వాటిలో సొరకాయ కూడా ఒకటి. దీనిలో విటమిన్ సి, ఐరన్, ఫైబర్, పొటాషియం, కాల్షియం, ఫాస్పరస్ వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఎలాంటి అనారోగ్య సమస్యలు లేని వారికి సొరకాయ ఆరోగ్యకరమైన ఆహారం. అయితే కొందరికి ఇది మంచిది కాదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. సొరకాయను ఏ సమస్యలు ఉన్నవారు తీసుకోకూడదో ఇక్కడ తెలుసుకుందాం..

కిడ్నీలో రాళ్లతో బాధపడేవారు సొరకాయను అస్సలు తినకూడదని అంటున్నారు. అలాంటి వారు పొరపాటున కూడా సొరకాయ జ్యూస్ ని తాగకూడదని పోషకాహార నిపుణులు అంటున్నారు. ఇది కిడ్నీలో రాళ్ల సమస్యను పెంచుతుందని చెబుతారు.

అధిక రక్తపోటు సమస్యలు ఉన్నవారు సొరకాయను దూరం పెట్టాలి. ఇది రక్తపోటును మరింత తగ్గిస్తుంది. అధిక రక్తపోటు కోసం మందులు తీసుకునే ఎవరైనా కూడా ఇది తినకూడదు. గుండె జబ్బులు ఉన్న వారు సొరకాయను మితంగా తీసుకోవాలి. అతిగా తినడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయని వైద్యులు చెబుతున్నారు.

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి తీసుకోబడింది. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే. ‘దిశ’ ఈ విషయాలను దృవీకరించడం లేదు.


Similar News