మకర సంక్రాంతి ఏ రోజు జరుపుకోవాలి.. రాత్రి పగల్లో మార్పులు ఎందుకు వస్తాయి?
హిందువులు జరుపుకునే ముఖ్యమైన పండుగల్లో సంక్రాంతి ఒకటి
దిశ, ఫీచర్స్: హిందువులు జరుపుకునే ముఖ్యమైన పండుగల్లో సంక్రాంతి ఒకటి. ఈ ఫేస్టివల్‌ను నాలుగు రోజుల పాటు ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటారు. ఒక్కో ప్రదేశంలో మూడు రోజుల పాటు జరుపుకుంటారు.
సంక్రాంతి పండుగ సంబురాలు..
సూర్యోదయానికి ముందే ఇంటి ముందు కల్లాపి చల్లి, అమ్మలక్కలు రకరకాల రంగులతో అందంగా ముగ్గులు వేస్తారు. అమ్మాయిలు ముగ్గుల నడుమ గొబ్బెమ్మలను పూలతో అలంకరించి మురిసిపోతుంటారు. ‘మళ్లీ గొబ్బెమ్మా సుఖములియ్యవే తామరపువ్వుంటి తమ్ముణ్ణివ్వవే’, చేమంతి పువ్వంటి చెల్లిల్నిఇవ్వవే మొగలిపువ్వండి మొగుణ్ణియ్యవే’ అంటూ గొబ్బెమ్మల చుట్టూ తిరుగుతూ పాటలు పాడుతారు.
ప్రస్తుత రోజుల్లో ఎక్కువ మంది సంప్రదాయాలు పాటించకపోవచ్చు. కానీ కనుమరుగు మాత్రం కాలేదు. ఇప్పటికి కొన్ని పల్లె ప్రాంతాల్లో హరిహర దాసులు ఇంటింటికీ తిరుగుతూ హరికథలు పాడుతుంటారు. జానపదులకు అయితే సంక్రాంతి పండుగ చాలా ముఖ్యమైనది. సంక్రాంతి పండుగ వేడుకల్లో చెప్పుకోదగిన మరొకటి గంగిరెద్దుల ఆట. ఈ సంప్రదాయం ఇప్పటికీ పట్టణ ప్రాంతాల్లో కనిపిస్తూనే ఉంది.
మకర సంక్రాంతి ఎప్పుడు జరుపుకోవాలి.. రాత్రి పగల్లో ఎందుకు మార్పులు వస్తాయి?
అయితే మకర సంక్రాంతి ఏ రోజు జరుపుకోవాలి? రాత్రి పగల్లో ఎందుకు మార్పులు వస్తాయని చాలా మందిలో ఈ ఆలోచన తలెత్తే ఉంటుంది. అయితే సూర్యుడు తన కక్ష్యను మార్చుకునే రాశిని సంక్రాంతి అంటారు. ఈ కక్ష్యలో మార్పులు రావడం వల్ల పగటి సమయం పెరుగుతుంది. రాత్రి సమయం తగ్గుతుంది.
అలా ఈ ఏడాది మకర సంక్రాంతి పండుగను శతభిషా నక్షత్రం లో వ్యతిపాత యోగం శుక్ల పక్ష చతుర్థి తిథిలో సోమవారం వచ్చింది. అయితే జ్యోతిష్య శాస్త్ర ప్రకారం చూసుకున్నట్లైతే.. ఉత్తరాయణ కాలాన్ని దేవతల పగలని, దక్షిణాయనాన్ని దేవతల రాత్రిగా పరిగణిస్తారు. ఈ సంవత్సరం సంక్రాంతి ఫేస్టివల్‌కు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది.
జ్యోతిష్యుల శాస్త్రం ప్రకారం..
అంతేకాకుండా జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గత ఏడాది కంటే ఈ ఏడాది వచ్చే పండగ సమయంలో తిథుల్లో మార్పులు రావడం వల్ల పండగను ఏయే సమయాల్లో జరుపుకోవాలో తెలియక జనాలు తికమకపడుతున్నారు. ఈ సంవత్సరం కూడా జనవరి 15న మకర సంక్రాంతిని జరుపుకోవడం చాలా శుభప్రదమని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. 2022, 2023లో కూడా మకర సంక్రాంతిని జనవరి 15 వ తేదీన వచ్చింది. సూర్యుడు జనవరి 15 ఉదయం 8:30 గంటలకు ధనుస్సు రాశి నుంచి మకర రాశిలో సంచారం చేస్తాడు. కాబట్టి జనవరి 15 వ తారీకున పండుగను జరుపుకోవడం మంచిదంటున్నారు జ్యోతిష్యులు.
సంక్రాంతి పండుగ రోజు ఏం చేయాలి?
మకర సంక్రాంతి రోజున గంగా స్నానం చేయడం చాలా శుభప్రదం. గంగా స్నానం చేసి దుప్పట్లు, నెయ్యి, నువ్వులు, లడ్డూలు, వస్త్రాలు పేదలకు దానం చేస్తే కుటుంబ సభ్యులందరికీ మోక్షం లభిస్తుంది. దీంతో పూర్వ జన్మలో తెలిసి, తెలియక చేసిన పాపాలన్నీ తొలగిపోతాయి. అయితే ఏడాది 14 బోగి, 15న మకర సంక్రాంతి, 16న కనుమ పండుగను జరుపుకోవాలంటున్నారు ప్రముఖ జ్యోతిష్యులు.