బిగ్ అలర్ట్: సిటీలో మరో కొత్త వైరస్ కలకలం.. తాగే నీరే కారణమంటున్న వైద్యులు.. లక్షణాలు, నివారణ చర్యలు!

గత మూడేళ కిందట కరోనా విజృంభించి ప్రపంచాన్నే గడగడలాడించింది.

Update: 2024-07-25 09:47 GMT

దిశ, ఫీచర్స్: గత మూడేళ కిందట కరోనా విజృంభించి ప్రపంచాన్నే గడగడలాడించింది. వైరస్ ఎక్కువగా స్ప్రెడ్ కాకుండా ఉండటానికి ప్రభుత్వం మూడుసార్లు లాక్ డౌన్ కూడా నిర్వహించింది. కరోనా కారణంగా కొంతమంది మరణించగా.. మిగతా వారు వాక్సిన్‌లు తీసుకుని పలు జాగ్రత్తలు పాటించారు. దీంతో కరోనా ప్రభావం తగ్గముఖం పట్టింది. అయితే ఈ వైరస్ కథ కంచికి చేరినట్లేనని అంతా ఊపిరిపీల్చుకునే సమయానికి హైదరాబాదులో మరో కొత్త వైరస్ కలకలం రేపుతోంది. నోరో వైరస్ ఇన్ఫెక్షన్ కేసులు రాష్ట్రంలో ఎక్కువ మొత్తంలో నమోదవుతున్నాయి. నోరో వైరస్ అనేది ఒక అంటువ్యాధి.

ప్రస్తుతం ఇది యాకుత్‌పురా, మలక్‌పేట్, డబీర్‌పురా, పురానీ హవేలీ, మొఘల్‌పురాతో పాటు పలు ప్రాంతాల్లో ఈ కేసులు నమోదవుతున్నాయి. నోరో వైరస్ ఇన్ఫెక్షన్‌తో చాలా మంది హాస్పిటల్స్‌లో చికిత్స పొందుతున్నారు. దీంతో స్థానిక ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. కాగా వెంటనే ఈ వైరస్‌కు నివారణ చర్యలు చేపట్టకపోతే హైదరాబాదు సిటీ మొత్తం వ్యాపించే అవకాశం ఉందని వైద్యులు సూచిస్తున్నారు. నోరో వైరస్‌కు కారణం.. కలుషితమైన నీరు తాగడం వల్లే వస్తుందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సోకిన 48 గంటల్లోనే ఈ వైరస్ లక్షణాలు కనిపిస్తున్నాయని వైద్యులు అంటున్నారు. ముఖ్యంగా కౌమారదశలో ఉన్న బాలికలు, సీనియర్ సిటిజన్లు, ప్రెగ్నెన్సీ మహిళలు జాగ్రతగా ఉండాలని సూచిస్తున్నారు. లేకపోతే కిడ్నీ ఇన్ఫెక్షన్ బారిన పడే చాన్స్ ఉందని చెబుతున్నారు.

నోరో వైరస్ లక్షణాలు చూసినట్లైతే..

* అతిగా జ్వరం రావడం

* విరోచనాలు

* బాడీ పెయిన్స్

* తలనొప్పి

*డయేరియా

*పొట్టలో పుండ్లు ఉన్నట్లు అనిపించడం

*తీవ్రమైన హైపోటెన్షన్

* శరీరం డీహైడ్రేషన్ అవ్వడం

* కిడ్నీ ఇన్ఫెక్షన్

తీసుకోవాల్సిన జాగ్రత్తలు..

గోరువెచ్చని నీటితో స్నానం చేయడం మంచిదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. తరచూ హ్యాండ్స్ క్లీన్‌గా కడుక్కోవాలి. ప్రతిరోజూ స్నానం చేయాలి. చుట్టూ ఉన్న పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. నోరో వైరస్ సోకిన వ్యక్తులు ఇతరులకు కాస్త దూరంగా ఉండేలా చూసుకోవాలి. వీరు వాడిన వస్తువులు కుటుంబ సభ్యులు వాడకూడదు. ఈ వైరస్ బారి నుంచి బయటపడేంతవరకు ఈ జాగ్రత్తలు తీసుకోవడం ఉత్తమమని డాక్టర్లు సూచిస్తున్నారు.

Tags:    

Similar News