స్మార్ట్‌ఫోన్ అడిక్షన్‌తో తగ్గుతున్న క్రియేటివిటీ.. ఎలా?
సహజంగానే మీలో క్రియేటివిటీ స్కిల్స్ ఎక్కువైతే.. స్మార్ట్‌ఫోన్ వాడకం నిలిపేయడం ఉత్తమం.Latest Telugu News
దిశ, ఫీచర్స్ : సహజంగానే మీలో క్రియేటివిటీ స్కిల్స్ ఎక్కువైతే.. స్మార్ట్‌ఫోన్ వాడకం నిలిపేయడం ఉత్తమం. ఎందుకంటే స్మార్ట్‌ఫోన్ వ్యసనం సృజనాత్మకత సామర్థ్యాన్ని తగ్గిస్తుందని కొత్త న్యూరోఇమేజింగ్ అధ్యయనం సూచిస్తోంది. ఇటీవలే చైనా పరిశోధకులు క్రియేటివిటీపై స్మార్ట్‌ఫోన్ అడిక్షన్ పరిణామాలను అంచనా వేశారు. సృజనాత్మక పనులకు కార్టికల్ ప్రతిస్పందనలను కొలవడానికి బ్రెయిన్ ఇమేజింగ్ సాంకేతికతను ఉపయోగించారు. ఈ అధ్యయన ఫలితాలు సోషల్ కాగ్నిటివ్ & ఎఫెక్టివ్ న్యూరోసైన్స్‌లో ప్రచురితమయ్యాయి.
స్మార్ట్‌ఫోన్ వ్యసనానికి వ్యతిరేకంగా సృజనాత్మకత
7 బిలియన్‌కు పైగా ప్రజలను ఇళ్లకే పరిమితం చేసిన పాండమిక్ టైమ్‌లో స్మార్ట్‌ఫోన్ అడిక్షన్ ఆకాశాన్ని తాకడంలో ఆశ్చర్యం లేదు. ఈ క్రమంలోనే రీసెర్చర్ జినీ లీ, అతని టీమ్.. క్రియేటివ్ కెపాసిటీ తగ్గేందుకు మెదడులోని ఏ భాగాలు కారణమో తెలుసుకోవాలనుకున్నారు. ఇందులో భాగంగానే అధ్యయనంలో పాల్గొన్న 18-25 ఏళ్ల మధ్య వయసు గల 48 మంది సాధారణ విద్యార్థుల స్మార్ట్‌ఫోన్ అడిక్షన్ స్కేల్(SAS)ని ఉపయోగించి గుర్తించారు. వీరిలో 24 మంది SASలో ఎక్కువ స్కోర్ చేసి ప్రయోగాత్మక సమూహంగా మారగా.. మిగిలిన వారు తక్కువ స్కోర్లు సాధించి నియంత్రణ స్థితికి చేరుకున్నారు.
అధ్యయనంలో మొదటి భాగం.. ఆల్టర్నేటివ్ యూజెస్ టాస్క్ పద్ధతిని ఉపయోగించింది. ఇందులో పాల్గొనే ప్రతి ఒక్కరికి రోజువారీగా ఒక వస్తువుతో పాటు దానికి ప్రత్యామ్నాయ అనువర్తనాల పేరు పెట్టడానికి 30 సెకన్ల టైమ్ ఇవ్వబడుతుంది. అలాగే వస్తువులను, వాటి మొదటి రెండు ఉపయోగాలను గుర్తుంచుకోవాలని కోరారు. రెండో దశలో.. ప్రత్యామ్నాయ ఉపయోగాల టాస్క్‌కు వినియోగదారులు ప్రతిస్పందించినప్పుడు మెదడు ఏం చేస్తుందో అధ్యయనం చేయడానికి న్యూరో ఇమేజింగ్ ఉపయోగించబడింది.
స్మార్ట్‌ఫోన్ వ్యసనం ఉన్నవారు పటిష్టత, వశ్యతతో పాటు వాస్తవికతలో తక్కువ స్కోర్స్ కలిగి ఉన్నారని పరిశోధకులు కనుగొన్నారు. వీరి మెదడు ప్రిఫ్రంటల్ కార్టెక్స్, కణతభాగంలో నరాలు ఉండే ప్రాంతాలు అంత చురుగ్గా ఉండవని తేలింది. అయితే, వాస్తవంగా ఈ అధ్యయనానికి దాని సొంత పరిమితులు ఉన్నాయి.
ఇవి కూడా చదవండి :