2025లో అంతరిక్షయానం.. అక్కడ మరణం సంభవిస్తే ఏం జరుగుతుందో తెలుసా?
మారుతున్న కాలంతోపాటు అంతరిక్ష పరిశోధనలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి.
దిశ, ఫీచర్స్: మారుతున్న కాలంతోపాటు అంతరిక్ష పరిశోధనలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. ఇప్పటికే అనేక విశ్వ రహస్యాలను ఛేదించిన సైంటిస్టులు ఇంకా అంతుచిక్కని అనేక అంశాలపై దృష్టి కేంద్రీకరించారు. ఇటీవల చంద్రయాన్ -3 ప్రయోగం తర్వాత స్పేస్ రీసెర్చింగ్‌పై ప్రపంచమంతా ఆసక్తి నెలకొంది. మరిన్ని పరిశోధనలకోసం నాసా 2025లో చంద్రుడిపైకి, అంగారకుడిపైకి వ్యోమగాములను పంపాలని ఆలోచిస్తోంది. నిజానికి ఇది చాలా కష్టమైన, ప్రమాదకరమైన ప్రతిపాదన అనే విషయంలో ఎవరికీ సందేహం లేదు.
అయినప్పటికీ సైన్స్ పురోగతిలో మరో అడుగు ముందుకు పడాలంటే ఇటువంటి నిర్ణయాలు తీసుకోక తప్పదని నాసా సైంటిస్టులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో కొన్నిసందేహాలు ప్రజలను, నిపుణులను కూడా వెంటాడుతున్నాయి. అవేంటంటే.. అంతరిక్షంలోకి వెళ్లాక వ్యోమగాములు చనిపోతారా? వారి శరీరం అక్కడి వాతావరణంలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటుంది? అక్కడ మృతి చెందిన వ్యక్తి డెడ్ బాడీని భూమికి తీసుకురావచ్చా? అనే సందేహాలు పలువురు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో స్పేస్ మెడిసిన్ అండ్ ఎమర్జెన్సీ మెడిసిసన్ ప్రొఫెసర్ ఇమ్మాన్యుయేల్ ఉర్కియోటా కొన్ని అంశాలను వెల్లడించారు.
చంద్రుడిపై మరణిస్తే ?
వ్యోమగాములు చంద్రుడు లేదా అంగాకర గ్రహంపైకి వెళ్లాక మరణిస్తే ఎలా హాండిల్ చేయాలనే విషయంలో స్పేస్ సైంటిస్టులకు ఒక క్లారిటీ ఉంది. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌లో తక్కువ భూ కక్ష్యలో ఒక వ్యోమగామి చనిపోతే అతని శరీరాన్ని, ప్రత్యేక క్యాప్సూల్‌లో భద్రపరిచి, కొన్ని గంటల వ్యవధిలో భూమికి తిరిగి తీసుకురావచ్చునట. అయితే చంద్రునిపై మరణం సంభవించినప్పుడు మాత్రమే మిగతా వ్యోమగాములు ఇలా తీసుకువచ్చే అవకాశం ఉంటుంది. డెడ్ బాడీని కచ్చితంగా తిరిగి తీసుకురావాలనేది నాసా ప్రధాన ఉద్దేశం కాదు, కానీ అంతరిక్షయానంలో ఉన్న మిగతా బతికి ఉన్న వ్యోమగాములకు కూడా ప్రాణహాని జరగకుండా ఈ విధమైన నిర్ణయం తీసుకుంటారు.
అంగారకుడిపై ఏం చేయవచ్చు?
అంగారక గ్రహానికి 300 మిలియన్ మైళ్ల ప్రయాణంలో వ్యోమగామి చనిపోతే మిగతా వ్యోమగాములు ఆ వ్యక్తి డెడ్ బాడీని సపరేట్ ఛాంబర్‌లో లేదా స్పెషలైజ్డ్ బాడీ బ్యాగ్‌లో భద్రపరుస్తారు. తిరిగి భూమికి చేరే వరకు స్పేస్ వెహికల్ లోపల స్థిరమైన ఉష్ణోగ్రత, తేమ శరీరాన్ని సంరక్షించడంలో సహాయపడతాయి. దాదాపు భవిష్యత్తు అంతరిక్షయానంలో వ్యోమగాములు మరణించే అవకాశాలు ఉండకపోవచ్చు. ఎందుకంటే ఆధునిక టెక్నాలజీ, అభివృద్ధి చెందిన సైన్స్ పరిజ్ఞానం ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. చంద్రుడు, అంగాకరక గ్రహం మీద వాతావరణాన్ని తట్టుకునేలా అక్కడికి వెళ్లే సైంటిస్టులు, వ్యోమగాములు స్పేస్ ప్రొటక్షన్ సూట్ ధరిస్తారు. ఒకవేళ అనుకోని పరిస్థితుల్లో ఇది పనిచేయకపోతే మాత్రమే మరణం సంభవించే అవకాశం ఉంటుంది.
Read More: చేతులతోనే ఎన్నో అద్భుతాలు సృష్టించే నేతన్నకు.. చేనేత దినోత్సవం శుభాకాంక్షలు..
ఈ సారి రెండు రోజులు రాఖీ పండుగ.. ఏ రోజు రాఖీ కట్టడం మంచిదంటే?