మధ్యవయస్సువారికి గాఢ నిద్ర లేకపోతే జ్ఞాపకశక్తి సమస్యలు తలెత్తడం ఖాయం!

మనం ఆరోగ్యంగా ఉండటానికి ఆహారం ఎంత ముఖ్యమో.. నిద్ర కూడా అంతే ముఖ్యం.

Update: 2024-01-05 08:10 GMT

దిశ, ఫీచర్స్: మనం ఆరోగ్యంగా ఉండటానికి ఆహారం ఎంత ముఖ్యమో.. నిద్ర కూడా అంతే ముఖ్యం. కంటినిండా నిద్ర లేకపోవడం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. కానీ ఇటీవల సమాజంలో చాలామంది నిద్రకు ఇంపార్టెన్స్ ఇవ్వడం లేదు. ఆరోగ్యంగా ఉండాలంటే తప్పకుండా 8 గంటలు నిద్ర పోవాల్సిందేనని తరచూ నిపుణులు చెబుతుంటారు. ప్రపంచవ్యాప్తంగా అన్ని వయస్సుల వారికి రోగాలు రావడానికి నిద్ర కూడా ఓ కారణం అంటున్నారు నిపుణులు. నిద్రలేమికి కారణం అనారోగ్యమని చెప్పడం కష్టమని, కానీ నిద్రలేమి, అనారోగ్యం ఒకదానికొకటి ముడిపడి ఉన్నాయని లండన్‌లో ట్రినిటీ కాలేజ్ ప్రొఫెసర్ షేన్ ఓమారా వెల్లడించారు.

ఎక్కువ నిద్ర, తక్కువ నిద్ర రెండూ ఆరోగ్యానికి మంచివి కావని పలు అధ్యయనాల్లో తేలింది. 6 గంటల కంటే తక్కువగా నిద్రపోవడాన్ని తక్కువ నిద్ర అంటారు. 10 గంటల కన్నా ఎక్కువ నిద్రపోవడాన్ని ఎక్కువ నిద్ర అంటారు. ఈ రెండూ ఆరోగ్యానికి అస్సలు మంచివి కావు. అప్పుడే పుట్టిన పిల్లలు 18 గంటలు నిద్రపోవాలి. చిన్న పిల్లలు 11 గంటలు నిద్ర పోవాలి, టీనేజ్ వయసు వారు 10 గంటలు నిద్రపోవాలి. ముఖ్యంగా 30 నుంచి 40 ఏండ్ల మధ్య వయసు వ్యక్తులు కనీసం 7 నుంచి 8 గంటలు నిద్రపోవాలి. ఈ వయసు వారికి నిద్రలో పదే పదే అంతరాయాలు ఉంటే, అలాంటి వారు 10 ఏండ్లలో ఆలోచనా శక్తి, జ్ఞాపక శక్తి సమస్యలు ఎక్కువగా వచ్చే అవకాశాలున్నాయని శాస్త్రవేత్తలు తేల్చారు.

సరైన నిద్ర లేకపోవడం కారణంగా మానసిక ఆరోగ్య సమస్యలు, ఇమ్యూనిటీ తగ్గడం, బరువు పెరగడం, హార్మోన్లలో మార్పులు, చర్మ సమస్యలు వస్తుంటాయని వైద్యులు చెబుతున్నారు. యూనివర్సిటీ ఆఫ్‌ కాలిఫోర్నియా, శాన్‌ ఫ్రాన్సిస్కో సైంటిస్టుల అధ్యయనంపై 'జర్నల్‌ న్యూరాలజీ' నివేదిక విడుదల చేసింది. కాగా అల్జీమర్స్‌ వ్యాధి లక్షణాలు బయటపడటానికి ఎన్నో సంతవ్సరాలు ముందే మెదడులో వ్యాధి పేరుకుపోతుంది. నిద్రకు- జ్ఞాపకశక్తికి మధ్య ఉన్న సంబంధాన్ని తెలుసుకున్నాక, నిద్ర సమస్యలు, వ్యాధుల బారిన పడటాన్ని పెంచుతున్నదని అర్థమైందని పరిశోధకుడు యా లెంగ్‌ చెప్పారు. కాగా ముఖ్యంగా మధ్య వయస్సు వారికి నిద్ర చాలా అవసరమని మా అధ్యయనం వెల్లడించిందని ఆయన తెలిపారు. రాత్రిపూట సరైన తక్కువ నిద్ర లేకపోతే దాని ప్రభావం ఉద్యోగంపై, చదువులపై కూడా తీవ్రంగా పడుతోంది.


Similar News