తలమీద వెంట్రుకలు వద్దట.. గుండు గీయించి పట్టీలు ట్రాన్స్‌ప్లాంట్ చేయించాడు..

సాధారణంగా అందంగా కనబడేందుకు జుట్టుకు రంగులు వేయించుకుంటారు. స్ట్రెయిట్, కర్లీ.. ఇలా రకరకాలుగా హెయిర్ స్టైల్ సెట్ చేసుకుంటారు. కానీ మెక్సికన్ రాపర్ డాన్ సుర్ ఇలా కాకుండా

Update: 2024-07-17 11:27 GMT

దిశ, ఫీచర్స్: సాధారణంగా అందంగా కనబడేందుకు జుట్టుకు రంగులు వేయించుకుంటారు. స్ట్రెయిట్, కర్లీ.. ఇలా రకరకాలుగా హెయిర్ స్టైల్ సెట్ చేసుకుంటారు. కానీ మెక్సికన్ రాపర్ డాన్ సుర్ ఇలా కాకుండా నెక్స్ట్ లెవల్ ట్రై చేసాడు. ఒకరిని నేను ఫాలో కావడం కాదు మరొకరు నన్ను ఫాలో కావాలనే థీమ్ తో తల మీద పూర్తిగా జుట్టు గీయించేసి.. బంగారు, వెండి, వజ్రాలు పొదిగిన పట్టీలను శాశ్వతంగా ట్రాన్స్ ప్లాంట్ చేయించాడు. ఇతరుల కన్నా డిఫరెంట్ గా కనిపించాలనే లక్ష్యంతోనే ఇలా చేసినట్లు చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఇతని వీడియోలు నెట్టింట వైరల్ అవుతుండగా.. మెడ నిండా బంగారు నగలు, దంతాలకు గోల్డ్ ప్లేట్ కూడా వేయించాడు.

మొత్తానికి ఈ ప్రయోగంతో సోషల్ మీడియాలో సూపర్ సక్సెస్ అయ్యాడు డాన్ సుర్. ఒకప్పుడు పదివేల మంది ఉన్న టిక్ టాక్ ఫాలోవర్స్ ప్రస్తుతం రెండు మిలియన్లకు పెరిగింది. కాగా ఈ మేకోవర్ కోసం ఇతను కోట్లు ఖర్చుపెట్టినట్లు సమాచారం. కానీ ఇంత డబ్బు ఆయనకు ఎలా వచ్చిందనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి.


Similar News