తరచూ తలనొప్పి వేధిస్తోందా? .. బ్రెయిన్ ట్యూమర్ కావచ్చు..

మీకు తరచూ తలనొప్పి వస్తోందా? కొన్నిసార్లు మరీ ఎక్కువగా అనిపిస్తోందా? వాంతులవుతున్నాయా? అయితే అది బ్రెయిన్ ట్యూమర్ వల్ల కూడా కావచ్చు.

Update: 2023-04-13 11:33 GMT

దిశ, ఫీచర్స్: మీకు తరచూ తలనొప్పి వస్తోందా? కొన్నిసార్లు మరీ ఎక్కువగా అనిపిస్తోందా? వాంతులవుతున్నాయా? అయితే అది బ్రెయిన్ ట్యూమర్ వల్ల కూడా కావచ్చు. ఇటువంటి తీవ్రమైన పరిస్థితులు మెదడులో కణితులు ఉన్నవారికి తలెత్తే అవకాశం ఉందని వైద్య నిపుణులు చెప్తున్నారు. టెన్షన్ లేదా మైగ్రేన్ వంటివి కూడా సాధారణంగా తలనొప్పిని కలిగిస్తుంటాయి. కానీ బ్రెయిన్ ట్యూమర్ ఉన్న తలనొప్పిని దాని సింప్టమ్స్‌ను బట్టి అనుమానించవచ్చు. అందుకే తరచుగా హెవీ హెడేక్ వస్తుంటే ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా న్యూరాలజిస్టును సంప్రదించాలి.

ప్రతీ ఒక్కరు ఏదో ఒక సందర్భంగా తలనొప్పి సమస్యను ఎదుర్కొంటుంటారు. అయితే అది ఆస్పత్రికి వెళ్లేంత సమస్యగా ఉండదు. అలాంటి పరిస్థితులు చాలా అరుదుగా ఉంటాయి. ఇంట్లో లేదా పనిలో ఎక్కువ ఒత్తిడిని అనుభవించినప్పుడు కూడా తలనొప్పి రావచ్చు. కొన్నిసార్లు పిల్లలు బిగ్గరగా అల్లరి చేయడం కారణంగా కూడా మైగ్రేన్ ఉన్న స్త్రీలలో తలపోటు వస్తుంది. ఇంకొందరికి గర్భధారణ సమయంలోనూ తలనొప్పి వస్తున్నట్లు చెప్తుంటారు. అయితే ఇవన్నీ సాధారణమే కానీ బ్రెయిన్ ట్యూమర్‌ సమస్య ఉంటే లైఫ్ రిస్క్‌లో పడుతుంది.

బ్రెయిన్ ట్యూమర్ అంటే?

బ్రెయిన్ ట్యూమర్ మెదడు చుట్టుపక్కల లేదా కణజాలాలలో అసాధారణ కణాల పెరుగుదల. వీటిలో రెండు ప్రధాన రకాలు ఉన్నాయి. ఒకటి ప్రైమరీ బ్రెయిన్ ట్యూమర్.. ఇది మెదడులో ఉద్భవిస్తుంది. మరొకటి మెటాస్టాటిక్ బ్రెయిన్ ట్యూమర్ (metastatic brain tumour), ఇది శరీరంలోని మరొక భాగంలో క్యాన్సర్‌గా ప్రారంభమై మెదడుకు వ్యాపిస్తుందని నిపుణులు చెప్తున్నారు.



లక్షణాలు

తలనొప్పి అనేది బ్రెయిన్ ట్యూమర్‌కి సంకేతమని వైద్య నిపుణులు చెప్తున్నారు. అయితే ఇది అన్ని వేళలా మెడికల్ ఎమర్జెన్సీ కాదు. మీరు లేదా మీ కుటుంబ సభ్యుల్లో ఎవరైనా తీవ్రమైన తలనొప్పి ఎదుర్కొంటూ ఉంటే.. దానివల్ల మూర్ఛలు, దృష్టిలో మార్పులు, లేదా మాట్లాడడంలో ఇబ్బంది, అవయవాలలో బలహీనత లేదా తిమ్మిరి, శరీరంలో ఒకవైపు తరచూ తిమ్మిరిగా అనిపించడం, మానసిక పరిస్థితి అదుపు తప్పడం, పనులు చేసుకోవడంలో ఇబ్బంది, వాంతులు వంటి లక్షణాలు కనిపిస్తే అది బ్రెయిన్ ట్యూమర్ వల్ల కావచ్చు. కొందరికి వామిట్ తర్వాత తలనొప్పి నుంచి ఉపశమనం కలుగవచ్చు. కాబట్టి ఇటువంటి పరిస్థితిని గమనించిన వెంటనే న్యూరాలజిస్ట్‌ను సంప్రదించడం మంచిది. అయితే తలనొప్పి అనేది బ్రెయిన్ ట్యూమర్ సాధారణ లక్షణం. ముఖ్యంగా మెదడుకు సంబంధించిన ఫ్రంటల్ లేదా టెంపోరల్ లోబ్స్‌లో ట్యూమర్స్ వల్ల తలనొప్పి నిరంతరంగా, తీవ్రంగా వస్తూ ఉంటుంది.

ట్రీట్మెంట్

ట్యూమర్ రకం, పరిమాణం, అది ఉన్న స్థానాన్ని బట్టి వైద్య నిపుణులు ట్రీట్మెంట్ అందిస్తారు. ప్రమాదకరమైన స్థానంలో ఉంటే డాక్టర్లు సర్జరీ రిఫర్ చేస్తారు. ట్యూమర్ చుట్టుపక్కల మెదడు కణజాలానికి ఎటువంటి నష్టం జరగకుండా సాధ్యమైనంత ఎక్కువ కణితిని తొలగించడం ట్రీట్‌మెంట్ ప్రాథమిక లక్ష్యం. అలాగే రేడియేషన్ థెరపీ కూడా ఇందులో ఒక భాగం. క్యాన్సర్ కణాలను చంపేయడానికి, కణితులను కుదించడానికి హై ఎనర్జీ రేడియషన్ బీమ్స్ (high-energy beams of radiation)ను ఉపయోగిస్తారు.

ఆ తర్వాత ఇది మిగిలిన క్యాన్సర్ కణాలను తొలగించాడానికి లేదా సర్జరీ ద్వారా పూర్తిగా తొలగిపోని ట్యూమర్స్‌ను నిర్మూలించడానికి ఈ ట్రీట్‌మెంట్ దోహదం చేస్తుంది. మరో ట్రీట్మెంట్ రకం కీమో థెరపీ.. ఈ విధమైన చికిత్సలో క్యాన్సర్ కణాలను చంపడానికి మెడికేషన్ యూజ్ చేస్తారు. పెయిన్ మేనేజ్మెంట్, యాంటీ-సీజర్ మెడికేషన్స్, ఫిజికల్ థెరపీ లక్షణాలను మేనేజ్ చేయడానికి, బాధితుల జీవన నాణ్యతను మెరుగుపరచడానికి కూడా ఈ ట్రీట్‌మెంట్ దోహదం చేస్తుంది.

ఇవి కూడా చదవండి: శృంగారం పట్ల ఆసక్తి ఉంటే వందేళ్లు బతకొచ్చు.. లేదంటే..

Tags:    

Similar News