అరుదైన సముద్రపు గ్రహాంతర జీవి.. అంటార్కిటికాలో కనుగొన్న మెరైన్ బయాలజిస్టులు
సముద్రాలు సహజంగానే జీవ వైవిధ్యానికి నిలయంగా ఉంటాయని మనకు తెలిసిందే. అందుకే జీవ శాస్త్రవేత్తలు నిరంతరం ఇక్కడ తమ పరిశోధనలు కొనసాగిస్తుంటారు. తాజాగా అంటార్కిటికా సముద్రంలో ట్రావెలింగ్ చేస్తున్న
దిశ, ఫీచర్స్ : సముద్రాలు సహజంగానే జీవ వైవిధ్యానికి నిలయంగా ఉంటాయని మనకు తెలిసిందే. అందుకే జీవ శాస్త్రవేత్తలు నిరంతరం ఇక్కడ తమ పరిశోధనలు కొనసాగిస్తుంటారు. తాజాగా అంటార్కిటికా సముద్రంలో ట్రావెలింగ్ చేస్తున్న మెరైన్ బయాలజిస్టులు ఒక అరుదైన జీవిని కనుగొన్నారు. ఇది 20 చేతులతోపాటు రెక్కలను కలిగి, మొత్తం 8 అంగుళాల పొడవు ఉందని కాలిఫోర్నియా యూనివర్సిటీకి చెందిన సముద్ర జీవ శాస్త్రవేత్త ప్రొఫెసర్ గ్రెగ్ రూప్ తెలిపారు. 215 నుంచి 3, 840 అడుగుల లోతు నీటిలో ఇది సంచరిస్తూ ఉంటుందని పేర్కొన్నారు. దాని ప్రత్యేక ఆకృతి రీత్యా పలువురు సైంటిస్టులు సముద్రపు గ్రహాంతర వాసి అని కూడా పిలుస్తున్నారు. అంతేగాక ఇది స్ట్రాబెర్రీ ఫ్రూట్ పరిమాణాన్ని కూడా పోలి ఉన్నందున పలువురు శాస్త్రవేత్తలు అంటార్కిటిక్ స్ట్రాబెర్రి ఫెదరర్ అని పేరు పెట్టారు. కొత్తగా కనుగొన్న ఈ ఓషియన్ ఫెదరర్ ప్రోమాకోక్రినస్ ఫ్రాగారియస్ జాతికి చెందినదై ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
Read More: 40 శాతం మందిని వేధిస్తున్న నిద్రలేమి.. ఏం చేస్తే బెటర్ ?