డిప్రెషన్, యాంగ్జైటీలను తగ్గిస్తున్న ఏఐ వాయిస్ కోచ్.. అధ్యయనంలో వెల్లడి

తాజాగా ఏఐ ఆధారిత వాయిస్ అసిస్టెంట్ యాప్ మైల్డ్ డిప్రెషన్, యాంగ్జైటీలతో బాధపడుతున్న వ్యక్తులకు సహాయపడే మానసిక చికిత్సను అందించగలదని పరిశోధకులు కనుగొన్నారు.

Update: 2023-05-20 06:20 GMT

దిశ, ఫీచర్స్: సైకాలజిస్టులు డిప్రెషన్, యాంగ్జైటీలకు తగిన ట్రీట్‌మెంట్ అందిస్తారని మనకు తెలిసిందే, కానీ అధునాతన ఏఐ (AI) వాయిస్ ఆధారిత వర్చువల్ కోచ్ (లుమెన్ యాప్) కూడా మానసిక ఆరోగ్య సంరక్షణ సేవలను సమర్థ అందించగలదని ఒక కొత్త అధ్యయనం పేర్కొన్నది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI)‌ను వివిధ రంగాల్లో దాని అప్లయ్ చేయడంపై ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే ఆసక్తి నెలకొన్న సంగతి తెలిసిందే. ఒక వైపు అది ఏ విధంగా పనిచేస్తుందనే విషయంలో అనేక సందేహాలు ఉన్నప్పటికీ, మరోవైపు దాని వినియోగంపై ప్రయోగాలు, అధ్యయనాలు కొనసాగుతున్నాయి. తాజాగా ఏఐ ఆధారిత వాయిస్ అసిస్టెంట్ యాప్ మైల్డ్ డిప్రెషన్, యాంగ్జైటీలతో బాధపడుతున్న వ్యక్తులకు సహాయపడే మానసిక చికిత్సను అందించగలదని పరిశోధకులు కనుగొన్నారు.

అధ్యయనంలో భాగంగా ప్రాబ్లం సాల్వింగ్ థెరపీకి సంబంధించిన 8 ఎనిమిది సెషన్ల కోసం AI వాయిస్ అసిస్టెంట్ లుమెన్‌ని(I voice assistant Lumen) పరిశోధకులు ఉపయోగించారు. దీనివల్ల బ్రెయిన్ యాక్టివిటీస్‌లో మార్పులు కనిపించాయని, యాంగ్జైటీ, డిప్రెషన్ లక్షణాలు తగ్గాయని చికాగోలోని యూనివర్సిటీ ఆఫ్ ఇల్లినాయిస్ పరిశోధకుల బృదం పేర్కొన్నది. బిహేవియరల్ థెరపీ విషయంలో AI వాయిస్ బేస్డ్ వర్చువల్ కోచ్‌ను పరీక్షించడం, మానసిక ఆరోగ్య సంరక్షణలో అది సమర్థవంతంగా పనిచేయడం తాము మొదటిసారిగా తెలుసుకున్నామని పరిశోధకుడు డాక్టర్ ఒలుసోలా A. అజిలోర్ ( Dr Olusola A. Ajilore)తెలిపారు. ‘‘మాకు దాని అవసరం ఒక అద్భుతాన్ని చూపించింది. ముఖ్యంగా ఇటీవల యాంగ్జైటీ, డిప్రెషన్ సమస్యలు పెరుగుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా తగినంత మంది ప్రాక్టీషనర్స్ కూడా లేరు’’ అని యుఐసిలోని సైకియాట్రి ప్రొఫెసర్ అజిలోర్ పేర్కొన్నాడు. ఇటువంటి పరిస్థితుల్లో మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్ విషయంలో ట్రీట్‌మెంట్ అందించడానికి ఏఐ వాయిస్ కోచ్ టెక్నాలజీ తమకు ఒక బ్రిడ్జ్‌గా ఉపయోగపడుతుందని పరిశోధకులు అంటున్నారు. అయితే ఇది సాంప్రదాయ చికిత్సకు ప్రత్యామ్నాయంగా మాత్రం తాము భావించడం లేదని, మానవ వనరులకు సహాయకారిగా మాత్రమే ఉపయోగించుకోవాలని అభిప్రాయపడుతున్నారు.

లుమెన్‌ను అభివృద్ధి చేసిన తర్వాత పరిశోధకులు 63 మంది పేషెంట్లను స్టడీకోసం రిక్రూట్ చేసుకున్నారు. వీరిలో మూడింట రెండు వంతుల మందికి దీనిని ఉపయోగించారు. మిగిలిన వారికి ఉపయోగించలేదు. అయితే ల్యూమెన్ యాప్(ఏఐ ఆధారిత వాయిస్ కోచ్)ను ఉపయోగించి ట్రీట్‌మెంట్ అందించిన సమూహంలో డిప్రెషన్, యాంగ్జైటీ, మానసిక క్షోభ తగ్గాయని పరిశోధకులు గుర్తించారు. పైగా ఇది మహిళలు, తక్కువస్థాయి మానసిక ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి అద్భుతంగా పనిచేసిందని వారి అధ్యయనం స్పష్టం చేసింది. ఏఐ వాయిస్ కోచ్ కేవలం యాక్సెస్ చేయడానికి మాత్రమే కాకుండా భవిష్యత్తులో డిప్రెషన్, యాంగ్జైటీ వంటి మానసిక ఆరోగ్య సమస్యలకు మరింత మెరుగైన సేవలు అందించే అవకాశం ఉంటుందని మరో పరిశోధకుడు డాక్టర్ జున్ మా పేర్కొన్నాడు.

Also Read..

ఈ బియ్యం తీసుకుంటే ఏ రోగాలు కూడా రావట? 

Tags:    

Similar News