ముద్దు పెట్టడం లాభమా.. నష్టమా? ఎక్కడ పెడితే ఏం జరుగుతుందో తెలుసా?
మానవ జీవితంలో కొన్ని చర్యలు ఎంత మంచివో.. వాటిని ఉపయోగించుకునే సమయం, సందర్భాన్ని బట్టి అంత చెడ్డవిగానూ మారుతుంటాయి. కత్తికి ఇరువైపులా పదును ఉన్నట్లే మన ఆచరణ, ప్రవర్తన కూడా ముడిపడి ఉంటాయి.
దిశ, ఫీచర్స్ : మానవ జీవితంలో కొన్ని చర్యలు ఎంత మంచివో.. వాటిని ఉపయోగించుకునే సమయం, సందర్భాన్ని బట్టి అంత చెడ్డవిగానూ మారుతుంటాయి. కత్తికి ఇరువైపులా పదును ఉన్నట్లే మన ఆచరణ, ప్రవర్తన కూడా ముడిపడి ఉంటాయి. అందుకే తెలిసి మసలుకుంటే అంతా మంచే జరుగుతుంది. ఆనందంగానూ ఉంటుంది. తెలియకుండానో, తెలిసి కూడా కావాలనో చేస్తే మాత్రం ప్రతీ చర్య ప్రమాద సంకేతం కావచ్చు అంటున్నారు నిపుణులు. అలాంటి అవకాశం కలిగిన గ్రేట్ నేచురల్ హ్యూమన్ బిహేవియర్‌లో ముద్దు కూడా ఒకటి. ఒకరిని ముద్దు పెట్టుకోవడం వల్ల మనిషికి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. అదే సందర్భంలో కొన్ని సమస్యలు కూడా ఉంటాయి. అవేంటో చూద్దాం.
ఒత్తిడిని నియంత్రిస్తుంది
జస్ట్ ముద్దే కదా అని కొట్టి పారేయడానికి వీల్లేదు. ఎందుకంటే ఇది మీ స్ట్రెస్ లెవల్స్‌ను నియంత్రించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. మీ మెదడులో ఆనందానికి అవసరం అయ్యే డోపమైన్‌తో సహా అనేక కెమికల్స్ విడుదలను ప్రేరేపిస్తుంది. దీర్ఘకాలిక ఒత్తిడి అనేది నిజానికి డోపమైన్ లెవల్స్‌ను తగ్గిస్తుంది. ఇలాంటి సందర్భంలో ముద్దు నిజంగా సహాయపడుతుంది. సాధారణంగా మరింత ఆప్యాయంగా ఉండటంవల్ల స్ట్రెస్ లెవల్స్ తగ్గుతాయి. అలా ఆప్యాయతను పెంచడంలో ముద్దు చాలా హెల్ప్ చేస్తుంది.
జలుబు ఉన్నప్పుడు..
ముద్దు మంచితోపాటు చెడు చేయడంలోనూ తనదైన పాత్రను పోషిస్తుంది. ఇతరులకు జలుబు, పుండ్లు ఉన్నప్పుడు ముద్దు పెట్టుకుంటే మీకు కూడా అవి రావచ్చు. కాబట్టి ఇలాంటి సమయంలో మీ పిల్లలైనా, భాగస్వాములైనా, రొమాంటిక్ పార్టనర్స్ ఇంకెవరైనా సరే పెదవులపై ముద్దు పెట్టుకోకుండా ఉండటం మంచిది. ముద్దుల ద్వారా వ్యాప్తిస్తాయి కాబట్టి జాగ్రత్త తప్పనిసరి.
ముఖ కండరాలకు బలం
మీరు ఎవరినైనా ముద్దుపెట్టుకున్న ప్రతిసారీ మీ ముఖ కండరాలకు వ్యాయామం కూడా జరుగుతుంది. శరీరంలోని ఇతర కండరాల మాదిరిగానే ఇవి కూడా పని చేస్తాయి. ముఖ్యంగా ఒక ముఖ కండరం-ఆర్బిక్యులారిస్ ఓరిస్- ఆహారాన్ని నమలడంలో, మింగడంలో కీలక పాత్ర పోషిస్తుంది. కాబట్టి ముద్దు ద్వారా ఈ కండరాన్ని బలోపేతం చేయడం ఉపయోగకరంగా ఉంటుంది.
ముడతలు ఉన్నప్పుడు ..
ఒకరిని ముద్దు పెట్టుకోవడం వల్ల మీరు యవ్వనంగా కనిపించవచ్చు! అసిస్టెంట్ రీసెర్చ్ ప్రొఫెసర్ ఎమిలీ పూన్ ప్రకారం.. మజిల్స్ గ్రోత్ ముఖ పరిమాణాన్ని పెంచుతుంది. ఏజ్ రిలేటెడ్ ఫ్యాట్ థిన్‌గా మారడం, చర్మం వదులుగా మారడం వంటి ప్రభావాలను ఎదుర్కొంటుంది. ముద్దు పెట్టడం అనేది ముఖంపై, శరీరంపై చర్మం ముడతలు పడే అవకాశాన్ని తనదైన స్థాయిలో తగ్గిస్తుంది.
ఒకరి నుంచి మరొకరికి..
ముద్దు పెట్టుకునే సమయంలో ఒకరి లాలాజలాన్ని మరొకరు పంచుకోవడం వల్ల క్రిములకు బహిర్గతం అయ్యే చాన్స్ ఉంటుంది. అయితే ఇది అన్ని వేళలా చెడ్డ విషయం కాదు. కొన్ని సందర్భాల్లో తప్ప మిగతా సమయాల్లో ముద్దు పెట్టుకోవడం మంచిదే. మోనోన్యూక్లియోసిస్, కోవిడ్-19, ఎబోలా, జికా వంటి కొన్ని ప్రమాదకర వైరస్‌లతో సహా అనేక వైరస్‌లు లాలాజలం ద్వారా సంక్రమించవచ్చు.
నోటి ఆరోగ్యానికి మంచిదేనా?
లాలాజలం ముఖ్యపాత్రలలో ఒకటి మీ నోటిని శుభ్రం చేయడం. ఏదైనా ఆహార కణాలను ఇది సహజంగా కడగడం వంటి విధిని నిర్వహిస్తుంది. జెర్మ్స్‌తో పోరాడటానికి సహాయపడుతుంది. మీ దంతాలను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడే పోషకాలను కలిగి ఉంటుంది. నోటిపై ఎవరైనా ముద్దు పెట్టుకోవడం వల్ల లాలాజల ఉత్పత్తి పెరుగుతుంది. ఓవరాల్‌గా మీ నోటి ఆరోగ్యానికి సహాయపడుతుంది. అయితే ముద్దులు గుడ్ ఓరల్ హెల్త్‌కు ప్రత్యామ్నాయం మాత్రం కాదు!
చిగుళ్లు, దంతాలకు..
మరోవైపు, ఉద్వేగభరితమైన ముద్దు మీ చిగుళ్లు, దంతాలకు కూడా హానికరం. ఎందుకంటే లాలాజలం ద్వారా మీరు పంచుకునే జెర్మ్స్ హానికరంగా మారవచ్చు. వీటిలో కొన్ని మీ దంతాల ఎనామెల్‌ను ప్రభావితం చేసే యాసిడ్స్‌గా చక్కెరను మార్చవచ్చు. మీరు కావిటీస్ ఉన్న వారిని ముద్దుపెట్టుకుంటే గనుక, లాలాజలం ద్వారా బ్యాక్టీరియా మీ నోటికి వ్యాపిస్తుంది. అయితే మీ నోటిని యాంటీసెప్టిక్ మౌత్‌తో శుభ్రపరచడం వల్ల సన్నిహిత సంబంధంలో ఇటువంటి ఇబ్బందులను నివారించవచ్చునని డెంటిస్టులు చెప్తున్నారు.
నిద్రను మెరుగు పరుస్తుంది
రాత్రిపూట కంటి నిండా నిద్రపోవడం అనేది మీకు చాలా అద్భుతాలు చేస్తుంది. ఇక సాన్నిహిత్యం యొక్క ఈ ప్రదర్శన ఆక్సిటోసిన్ హార్మోనల్ ఉత్పత్తిని కూడా పెంచుతుంది. వాస్తవానికి ఇది లవ్ హార్మోన్. ఇది మిమ్మల్ని ఒత్తిడికి గురిచేసే కార్టిసాల్ హార్మోన్ లెవల్స్‌ను తగ్గిస్తుంది. మీరు రిలాక్స్ అవడానికి, రాత్రి పూట ప్రశాంతంగా నిద్రపోవడానికి సహాయపడుతుంది. బ్రిటీష్ బెడ్ కంపెనీ నిర్వహించిన సర్వేలో 70% మంది నిద్రపోయే ముందు తమ భాగస్వాములను ముద్దుపెట్టుకున్నప్పుడు బాగా నిద్రపోతున్నారని తేలింది.
బంధాన్ని బలపరుస్తుంది
ముద్దు పెట్టుకున్నప్పుడు రిలీజ్ అయ్యే ఆక్సిటోసిన్ ఒక శక్తివంతమైన రసాయనం. తత్ఫలితంగా మీరు మీ భాగస్వామితో మరింత కనెక్ట్ అయినట్లు భావిస్తారు. కపుల్స్ కలిసి ఉండటంలో ముద్దులు కీలకపాత్ర పోషిస్తాయి. ఎంతలా అంటే..‘ తరచుగా కనీసం ఒక బిడ్డను పెంచడానికి తగినంత కాలం సరిపోతాయి’’ అంటారు పరిశోధకులు వెండీ హిల్. అంతేకాకుండా ఒత్తిడి స్థాయిలను తగ్గించడంతో పాటు, రక్తపోటును, కొలెస్ట్రాల్ లెవల్స్‌ను తగ్గించడంలో ముద్దు సహాయపడడుతుంది.
అలెర్జెటిక్ రియాక్షన్స్ ఉండవచ్చు
మీరు ఒక నిర్దిష్ట ఆహారానికి అలెర్జీని కలిగి ఉంటే, అంతకుముందే అటువంటి ఆహారాన్ని తిన్న వ్యక్తిని ముద్దుపెట్టుకుంటే ఇబ్బంది పడవచ్చు. ఆ అలర్జీలలో కొన్ని లాలాజలం ద్వారా మీకు వ్యాపించే అవకాశం ఉంటుంది. ఆశ్చర్యకరంగా ఆహారం తీసుకున్న కొన్ని గంటల తర్వాత, పళ్ళు తోముకున్న తర్వాత కూడా ఇది జరగవచ్చు. మీ భాగస్వామికి అలెర్జీ అని తెలిసి కూడా మీరు ఆ ఆహారాన్ని మీరు తింటే, మళ్లీ ముద్దు పెట్టుకోవడానికి ముందు 16 నుండి 24 గంటలు వేచి ఉండటం మంచిది.
ఎక్కువ కేలరీలు బర్న్ చేస్తారు
ముద్దు వ్యాయామానికి ప్రత్యామ్నాయం కానప్పటికీ, మీరు నిమిషానికి రెండు కేలరీలు బర్న్ చేయవచ్చు అంటున్నారు నిపుణులు. భాగస్వాముల మధ్య శృంగారం, ఉద్రేకం వంటి సందర్భాల్లో ఈ సంఖ్య 26 కేలరీలు బర్న్ చేసే స్థాయికి పెరగవచ్చు. మొత్తానికి ముద్దు పెట్టుకునేటప్పుడు మీరు ఎంత కదులుతారు. మీ శారీరక శ్రమ ఎంత ఉంటుంది అనేదానిపై ఇక్కడ ఆధారపడి ఉంటుంది. అలాగే వయస్సు, బరువు, జీవసంబంధమైన ఇతర కార్యకలాపాలపై కూడా డిపెండ్ అయి ఉంటుంది.
రోగనిరోధక వ్యవస్థకు మేలు
కొన్ని సూక్ష్మక్రిములను పంచుకోవడం మీకు గొప్పగా ఉండకపోవచ్చు. వివిధ బ్యాక్టీరియాలకు గురికావడం మీ రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేయడంలో సహాయపడుతుంది. అయితే ముద్దు పెట్టుకోవడం ఆ పనిచేయవచ్చు. ఒక ముద్దులో (కనీసం 10 సెకన్ల పాటు) సగటున 80 మిలియన్ బాక్టీరియా వ్యాప్తి చెందుతుందని అంచనా వేయబడింది.
శిశువుకు ప్రమాదకరం
శిశువులు వాస్తవానికి ఇంకా పూర్తిగా అభివృద్ధి చెందని రోగనిరోధక వ్యవస్థలను కలిగి ఉంటారు. కాబట్టి సూక్ష్మక్రిములకు గురయ్యే ఛాన్స్ ఎక్కువ. పైగా చాలా వరకు సూక్ష్మక్రిములు వ్యాప్తి చెందుతాయి. పిల్లలకు పెద్దల నుంచి వైరస్‌లు, ఇతర హానికరమైన సూక్ష్మక్రిములు వ్యాపించకుండా ఉండాలంటే ముద్దు పెట్టుకునే విషయంలో చాలా కేర్‌గా ఉండాలి. ఎటువంటి అనారోగ్యం లేనప్పుడు మాత్రమే పిల్లలకు సురక్షితమైన ప్రదేశాల్లో ముద్దు పెట్టుకోవడం మంచిదది. పెదవులపై, నోరు, ముక్కు వంటి భాగాల్లో ముద్దు పెట్టవద్దు. అలాగే చేతి, కాలి వేళ్లపై కూడా పెట్టకూడదు. ఎందుకంటే పిల్లలు తమ వేళ్లను నోటిలో పెట్టుకునే ఛాన్స్ ఉంటుంది.
Read More..
ఏకంగా బస్సులోనే అలాంటి పని చేసిన యువతి.. తిట్టిపోస్తున్న జనాలు