డ్రై షాంపూస్, డియోడరెంట్స్‌తో క్యాన్సర్‌ ముప్పు.!

యూనిలీవర్ యునైటెడ్ స్టేట్స్.. ఇటీవలే తన ఏరోసోలైజ్డ్ డ్రై షాంపూ ప్రొడక్ట్స్‌ను రీకాల్ చేసింది.Latest Telugu News

Update: 2022-11-09 05:48 GMT

దిశ, ఫీచర్స్ : యూనిలీవర్ యునైటెడ్ స్టేట్స్.. ఇటీవలే తన ఏరోసోలైజ్డ్ డ్రై షాంపూ ప్రొడక్ట్స్‌ను రీకాల్ చేసింది. ఇందులో క్యాన్సర్‌కు కారణమయ్యే బెంజీన్ కెమికల్ ఉందన్న వార్తలు సదరు ప్రొడక్ట్స్ వినియోగించే వ్యక్తులకు షాక్‌ ఇచ్చాయి. అంతేకాదు సరైన, శాస్త్రీయంగా ఆమోదించిన ఉత్పత్తులు ఎంచుకోవాల్సిన అవసరాన్ని కూడా హైలైట్ చేశాయి. ఈ నేపథ్యంలో డ్రై షాంపూస్ విషయంలో ప్రముఖ డెర్మటాలజిస్ట్, కాస్మోటాలజిస్ట్ & ట్రైకాలజిస్ట్ వైద్యులు.. వినియోగదారులకు కొన్ని సూచనలు చేశారు. అవేంటో తెలుసుకుందాం..

క్యాన్సర్ ప్రమాదం

డ్రై షాంపూస్‌లో బెంజీన్ ఉంటుంది. అత్యంత ప్రమాదకరమైన గాలిలో ఉండే ఈ రసాయనాన్ని పీల్చినపుడు ఊపిరితిత్తుల్లోకి ప్రవేశిస్తుంది. అంతేకాదు క్యాన్సర్ కారక ఏజెంట్‌గా వర్గీకరించబడిన బెంజీన్.. వివిధ రకాల లుకేమియాలు సంభవించడంలో కీలక పాత్ర పోషిస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇక డ్రై షాంపూస్‌లో ఉండే పీచుపదార్థాలు, మెగ్నీషియం సిలికేట్ వంటివి కూడా ఊపిరితిత్తుల్లోకి ప్రవేశిస్తాయి. కొన్ని సందర్భాల్లో వీటి దీర్ఘకాలిక ఉపయోగం శ్వాసకోశ వ్యాధులు, క్యాన్సర్స్‌కు కారణం కావచ్చు. ఇప్పటికే పలు శ్వాసకోశ సమస్యలతో బాధపడేవారిలో ఈ ప్రమాదం ఇంకా ఎక్కువని వైద్యులు వివరించారు.

'సాధారణంగా డ్రై షాంపూస్, డియోడరెంట్స్.. క్యాన్సర్ లేదా దద్దుర్ల ప్రమాదాన్ని పెంచవు. బ్యూటేన్‌తో కలుషితమైనపుడే అవి క్యాన్సర్ కారకాలుగా మారి సమస్యలకు దారితీస్తాయి. ఏరోసోల్ స్ప్రేని తయారు చేయడానికి ఉపయోగించే ప్రొపెల్లెంట్.. బ్యూటేన్ ఆధారిత వ్యవస్థ. ఈ స్ప్రేలు కామన్‌గా చిన్న బాత్‌రూమ్స్‌లో స్ప్రే చేయబడతాయి. ఇక్కడ వెంటిలేషన్ ఉండదు. దీంతో ప్రజలు బెంజీన్‌ను ఎక్కువగా పీల్చి క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుకుంటారు' అని ప్రముఖ డెర్మటాలజిస్ట్, హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్ తెలిపారు. గతంలో ఏరోసోల్ స్ప్రే ప్రొపెల్లెంట్‌ను CFCలతో తయారు చేసేవారు. కానీ అవి ఓజోన్ పొరను ప్రభావితం చేస్తున్నాయని నిషేధించబడ్డాయి. ప్రస్తుత ప్రొపెల్లెంట్లు ఒత్తిడిని సృష్టించే బ్యూటేన్ శక్తితో ఉంటాయి. ఈ ఏరోసోల్ క్యాన్ అనేది మనం నాజిల్‌ను నొక్కినప్పుడు ఉత్పత్తిలోని పొగమంచును పిచికారీ చేయడానికి అనుమతిస్తుంది.

బెంజీన్ ఆరోగ్య ప్రభావాలు :

పలువురు నిపుణులు బెంజీన్‌ను మానవ క్యాన్సర్ కారకంగా నిర్వచించారు. అయినప్పటికీ కార్సినోజెనిసిటీ(క్యాన్సర్ కారకం) ప్రాపర్టీ అనేది శరీరం బహిర్గతమయ్యే మొత్తం, వ్యవధిపై ఆధారపడి ఉంటుంది. అంటే బెంజీన్‌ను పీల్చవచ్చు లేదా ఆహారం ద్వారా తీసుకోవచ్చు. రక్తప్రవాహంలోకి చేరిన తర్వాత, అది మీ శరీరమంతా ప్రయాణించి ఎముక మజ్జ, కొవ్వులో తాత్కాలికంగా నిల్వ చేయబడుతుంది. ఇది కాలేయం, ఎముక మజ్జలో క్రియాశీల జీవక్రియలుగా మార్చబడుతుంది. ఫలితంగా లుకేమియా, బ్లడ్ డిజార్డర్స్, బోన్ మారో డిజార్డర్స్ మొదలైనవి సంభవిస్తాయి.

ఆసక్తికరంగా.. ప్లాస్టిక్స్, డిటర్జెంట్లు, రంగులు, పురుగుమందుల తయారీలోనూ బెంజీన్‌ను ఉపయోగిస్తారు. FDA ప్రకారం, పెయింట్ ఫ్యాక్టరీ కార్మికుల వంటి వృత్తిపరమైన ప్రమాదాలపై చేసిన చాలా అధ్యయనాలు, వారిలో బెంజీన్ ఎక్స్‌పోజర్ క్యాన్సర్‌కు కారణమైందని నిరూపించాయి. అయితే, బెంజీన్ పొగాకులో కూడా ఉంటుంది. చురుకైన, నిష్క్రియాత్మక ధూమపానం ద్వారా వ్యాపిస్తుంది. బెంజీన్ కణాలు శరీర పనితీరును ప్రభావితం చేస్తాయి. ఉదాహరణకు: ఎముక మజ్జ తగినంత ఎర్ర రక్త కణాల ఉత్పత్తిని అడ్డుకుని రక్తహీనత కలిగిస్తుంది. అలాగే, యాంటీబాడీస్ యొక్క రక్త స్థాయిలను మార్చడం, తెల్ల రక్త కణాల నష్టాన్ని కలిగించడం ద్వారా రోగనిరోధక వ్యవస్థను దెబ్బతీస్తుంది. అయితే బెంజీన్ వల్ల కలిగే విషప్రయోగం.. బహిర్గతమయ్యే తీవ్రత మొత్తం, ప్రవేశించే మార్గం, సమయంతో పాటు సదరు వ్యక్తి వయసు, వైద్య పరిస్థితిపై ఆధారపడి ఉంటుంది.

డ్రై షాంపూస్, డియోడరెంట్ల సురక్షిత ఉపయోగం ఎలా?

డ్రై షాంపూను చాలా అరుదుగా లేదా ఎప్పుడో ఒకసారి ఉపయోగించాలే తప్ప రెగ్యులర్ వాడకాన్ని అలవాటు చేసుకోకూడదు. ఇక డియోడరెంట్ వంటి స్ప్రే ప్రొడక్ట్స్ ఉపయోగిస్తున్నప్పటికీ, చికాకు కలిగించే కాంటాక్ట్ డెర్మటైటిస్‌కు కారణమయ్యే చర్మ రంధ్రాలపై నేరుగా పూయడం కంటే దాన్ని బట్టలపై స్ప్రే చేయాలి. క్రమం తప్పకుండా ఆడిట్ చేయబడి, తనిఖీ చేయబడితే.. ఈ ఉత్పత్తుల వినియోగానికి ఒక సురక్షితమైన పరిమితి ఉంది.

ఉత్పత్తుల ఎంపికలో గుర్తుంచుకోవాల్సిన విషయాలు :

- ఎల్లప్పుడూ చర్మ వ్యాధి నిపుణులు సూచించిన ఉత్పత్తులనే కొనుగోలు చేయాలి

- నేచురల్ & ఆర్గానిక్ అని ప్రకటనలు గుప్పించే ఉత్పత్తులను చూసి మోసపోద్దు. సహజమైనది ఎప్పుడూ సురక్షితం కాదు

- ఉత్పత్తి విషపూరిత పదార్థాలు లేనిదని ప్రతిసారి నిర్ధారించుకోవాలి.

- కొనుగోలు చేసే ముందు పదార్థాలను పరిశోధించాలి.

- విషపూరిత రసాయన రహిత, సల్ఫేట్ రహిత, సువాసన లేని ఉత్పత్తులే వాడాలి.

- సల్ఫేట్స్, పారాబెన్స్, పాలిథిలిన్ గ్లైకాల్స్(PEG), థాలేట్స్, ఫార్మాల్డిహైడ్, ట్రైక్లోసన్, డైమెథికాన్, రెటినైల్ పాల్మిటేట్ తదితర పదార్థాలు గల షాంపూలను కొనకూడదు.

- సోడియం లారోయిల్ సార్కోసినేట్, సోడియం కోకోయిల్ గ్లైసినేట్, డిసోడియం, ఎసెన్షియల్ ఆయిల్స్, బొటానికల్స్, పండ్ల పదార్థాలు, సీడ్ ఆయిల్స్‌ను షాంపూలో ఉపయోగించడం సురక్షితంగా పరిగణించబడుతుంది. షాంపూ కొనుగోలు చేసే ముందు ఈ పదార్థాలు ఉన్నాయో లేదో తనిఖీ చేసుకోండి.

ఇవి కూడా చదవండి :

రోజుకొక లవంగం తీసుకోండి ! మీ ఆరోగ్య సమస్యలను దూరం చేయండి ! 

ప్రెగ్నెన్సీ టైమ్‌లో స్లీపింగ్ డిజార్డర్స్.. ఎందుకు వస్తాయంటే? 


Similar News