న‌వ‌రాత్రి ప్ర‌యాణికుల‌కు ఐఆర్‌సీటీసీ ప్ర‌త్యేక వ్ర‌త థాలీ..! ఇందులో ఏముంటాయ్‌..?!

ఏప్రిల్ 2, శనివారం నుంచి ప్రారంభమయ్యే నవరాత్రి పండుగ సందర్భంగా... IRCTC’s Navratri-2022 special Vrat thali.

Update: 2022-04-01 14:15 GMT

దిశ‌, వెబ్‌డెస్క్ః ఏప్రిల్ 2, శనివారం నుంచి ప్రారంభమయ్యే నవరాత్రి పండుగ సందర్భంగా వ్ర‌త‌మాచ‌రిస్తూ ప్ర‌యాణించే రైల్వే ప్రయాణికుల కోసం ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) ప్రత్యేక మెనూను ప్రవేశపెట్టింది. ఈ నవరాత్రి ప్రత్యేక ఆహారాన్ని ఉల్లిపాయలు, వెల్లుల్లి లేకుండా వండుతున్నారు. అలాగే క‌ల్లు ఉప్పుతో తయారు చేస్తున్న‌ట్లు చెప్పారు. ఇక‌, ఈ మెనులో అందుబాటులో ఉన్న‌ ఆహార పదార్థాల ప్రారంభ ధర రూ. 99.గా ఉంది. అయితే, IRCTC క్యాటరింగ్ సౌకర్యాన్ని అందిస్తున్న రైళ్లలో మాత్రమే ఈ ప్రత్యేక నవరాత్రి ఆహారం అందుబాటులో ఉంటుందని IRCTC ప్ర‌క‌టించింది. ఈ ఫాస్ట్ ఫుడ్ 500 రైళ్లలో మాత్రమే అందుబాటులో ఉంటుందని తెలిపింది.

మెనులో ఏముంది?

స్టార్టర్స్, ఆలూ చాప్, సాబుదానా టిక్కా ఉంటాయి.

మెయిన్‌ కోర్స్ః పనీర్ మఖ్మాలి, సబుదానా ఖిచ్డీ ఉండ‌గా ఈ స్పెష‌ల్ న‌వరాత్రి థాలీలో సబుదానా ఖిచ్డీ, సింఘాధా ఆలూ పరాఠా, పనీర్ మఖ్మాలి, అర్బీ మసాలా, ఆలూ చాప్, సీతాఫల్ (సీతాఫలం) ఖీర్ ఉంటాయి.

కోఫ్తా కర్రీ, సబుదానా ఖిచ్డీ నవరాత్రి థాలీ

ఈ థాలీలో సబుదానా ఖిచ్డీ, సింఘధా ఆలూ పరాఠా, కోఫ్తా కర్రీ, అర్బీ మసాలా, ఆలూ చాప్, సీతాఫల్ (సీతాఫలం) ఖీర్ ఉన్నాయి.

పరాఠాలు, అర్బీ మసాలాతో పనీర్ మఖ్మాలి

ఇందులో పనీర్ మఖ్మాలి, అర్బీ మసాలా, సింఘాధా ఆలూ పరాటా, పెరుగుతో సబుదానా ఖిచ్డీ ఉంటాయి.

నవరాత్రి ప్రత్యేక మెనూని ఎలా బుక్ చేసుకోవాలి?

ప్రయాణీకులు IRCTC యాప్ ద్వారా లేదా www.ecatering.irctc.co.in వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు లేదా 1323కి కాల్ చేయడం ద్వారా బుకింగ్‌లను చేయవచ్చు.

ఈ థాలీల ధర రూ. 125 నుండి రూ. 200 మధ్య ఉంటుంది. ప్రత్యేక ఫాస్ట్ ఫుడ్ థాలీని టిక్కెట్లను బుక్ చేసుకునే సమయంలో కూడా ఆర్డర్ చేయవచ్చు.

Tags:    

Similar News