Health: పెరట్లో ఈ మొక్కలు నాటితే చాలు.. ఎలాంటి మెడిసిన్స్ అవసరం లేదు

కరోనా వచ్చిన తర్వాత నుంచి మన జీవన విధానం పూర్తిగా మారిపోయింది.

Update: 2024-12-21 07:47 GMT

దిశ, వెబ్ డెస్క్ : కరోనా వచ్చిన తర్వాత  నుంచి మన జీవన విధానం పూర్తిగా మారిపోయింది. కంటికి కూడా కనిపించని చిన్న జీవి ఎందరో ప్రాణాలను బలి తీసుకుంది. అయితే, అప్పటి నుంచి చాలా మంది జాగ్రత్తగా ఉంటున్నారు. ఆరోగ్యం మీద ఎంత కేర్ తీసుకున్నా వచ్చే అనారోగ్య సమస్యలు వస్తూనే ఉన్నాయి. దీని కోసం చాలా మంది హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతుంటారు. మన ఇంటి పెరట్లో ఈ మొక్కలను నాటితే ఆ అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టొచ్చు.

మన పెరట్లో ఈ మొక్కలను నాటితే జలుబు, దగ్గు, చర్మ సమస్యలను తగ్గించుకోవచ్చు. ఆయుర్వేద లక్షణాలు ఉన్న మొక్కలను పెంచాలి. పెరట్లో కలబంద, మునగ, మారేడు, జిల్లేడు, రణపాల, కాంచనర, మందార, తులసి, పసుపు, కరివేపాకు, ఉసిరి, ఆముదం వంటి మొక్కలను పెంచాలి.

కరివేపాకులను ఎక్కువగా మసాలా వంటకాల్లో ఎక్కువగా వాడుతుంటారు. మనం చేసుకునే వంటకాలకు ప్రత్యేక రుచిని జోడిస్తాయి. కరివేపాకు జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరగడానికి సహాయపడుతుంది. దీనిలో ఐరన్, ఫోలిక్ యాసిడ్ ఉన్నాయి. ఇది మీ శరీరంలో హిమోగ్లోబిన్ పెంచి, రక్తహీనతను కూడా పోగొడుతుంది. కలబంద జీర్ణక్రియ, చర్మ సమస్యలకు చెక్ పెడుతుంది. ఉసిరిలో విటమిన్ సి ఉంటుంది. ఇది తెల్ల రక్త కణాల ఉత్పత్తిని పెంచి, ఇన్ఫెక్షన్ మీద పోరాడుతుంది. తెల్ల రక్తకణాలు దెబ్బతినకుండా కాపాడుతుంది.

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి తీసుకోబడింది. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే. ‘దిశ’ ఈ విషయాలను దృవీకరించడం లేదు.

Tags:    

Similar News