మీ పిల్లల్లో ఈ 4 లక్షణాలు కనిపిస్తున్నాయా? అయితే దానికి సంకేతం!

విటమిన్ డి అనేది మొత్తం ఆరోగ్య స్థితి మెరుగుపరచడానికి.. బోలు ఎముకల వ్యాధికి సంబంధించిన ఎముకలకు సంబంధించిన వ్యాధుల చికిత్సకు అవసరమైన మూలకం.

Update: 2024-02-29 09:28 GMT

దిశ, సినిమా: విటమిన్ డి అనేది మొత్తం ఆరోగ్య స్థితి మెరుగుపరచడానికి.. బోలు ఎముకల వ్యాధికి సంబంధించిన ఎముకలకు సంబంధించిన వ్యాధుల చికిత్సకు అవసరమైన మూలకం. విటమిన్ డి లోపిస్తే శరీరంపై చాలా ప్రభావాన్ని చూపిస్తుంది. ఎముకల కండరాలను వీక్ చేస్తుంది. ఎముకలు స్ట్రాంగ్‌గా ఉండాలన్నా, కండరాలు శక్తివంతంగా ఉండాలన్నా బాడీలో విటమిన్ డి అధికంగా ఉండాలి. కాగా చేపలు ఎక్కువగా తినాలి. ఫిష్‌లో విటమిన్ డి సహజంగానే ఉంటుంది. అలాగే ప్రతిరోజూ సన్‌లైన్ తాకాలి. అయితే పిల్లల్లో విటమిన్ డి లోపిస్తే ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయో తాజాగా వైద్య నిపుణులు వెల్లడించారు. అవేంటో ఇప్పుడు చూద్దాం..

చర్మం పాలిపోవడం: ఎప్పుడైతే విటమిన్ లోపించడం స్టార్ట్ అవుతుందో చర్మం ప్రకాశవంతంగా ఉండదు. విటమిన్ డి లోపం వల్ల శరీరంలో ఎర్ర రక్త కణాల కొరత ఏర్పడుతుంది. దీనివల్ల కూడా చర్మం పాలిపోతుంది. మన చర్మంలోని కొలెస్ట్రాల్ సూర్య కిరణాల్లోని వేడిని గ్రహించి విటమిన్ డి గా మారుతుంది. చర్మ కణాలను హెల్తీగా ఉంచుతుంది. కాబట్టి ప్రతిరోజూ పిల్లలపై సూర్యకాంతి పడేలా చూసుకోవాలి.

ఎముకల నొప్పి: విటమిన్ డి లోపిస్తే పిల్లలు కండరాలు, ఎముకల నొప్పితో బాధపడుతుంటారు. నిత్యం అలసిపోయినట్లుగా ఉంటారు. ఏ పని మీద శ్రద్ధ పెట్టరు. తరచూ పడుకోవాలనిపిస్తుంది.

నిద్ర సమస్యలు: విటమిన్ డి లోపంలో బాధపడుతోన్న పిల్లలు రాత్రిపూట నిద్రపోకుండా ఎక్కువ సేపు మేలకువతోనే ఉంటారు. అర్థరాత్రి దాటాక నిద్రపోతారు. ఆ టైమ్ లో కూడా వారు అలసిపోయినట్లుగానే కనిపిస్తారు.

వెయిట్ లాస్: ఈ లోపంలో బాధపడుతోన్న పిల్లలు ఎంత టేస్టీ ఫుడ్ అయినా తినడానికి అస్సలు ఇష్టపడరు. ఆకలి వేయదు. వారి ఇమ్యూనిటీ పవర్ పూర్తిగా తగ్గిపోతుంది. దీంతో పిల్లలు బరువు తగ్గుతారు. కాగా మీ పిల్లలకు విటమిన్ డి అందేలా చూడాలంటే.. చేపలు, గుడ్డలోని పచ్చసోన ఎక్కువగా పెట్టడం ద్వారా విటమిన్ డి అందుతాయని నిపుణులు చెబుతున్నారు.


Similar News