వయసు పెరుగుతుందా.. ఫిట్ గా ఉండాలనుకుంటున్నారా.. ఈ చిట్కాలను పాటించండి..

ప్రస్తుతం మన జీవన విధానం రోజురోజుకు దిగజారుతోంది.

Update: 2024-04-07 08:27 GMT

దిశ, ఫీచర్స్ : ప్రస్తుతం మన జీవన విధానం రోజురోజుకు దిగజారుతోంది. ఎందుకంటే ఈ రోజుల్లో ప్రజలు రోజంతా ఒకే చోట కూర్చుని పని చేస్తున్నారు. పని కారణంగా లేదా ఇతర ఏ కారణంగా అయినా ఎక్కువ ఒత్తిడికి గురవుతున్నారు. ఇది వారి శారీరక, మానసిక ఆరోగ్యం రెండింటి పై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. ఈ అనారోగ్య జీవనశైలి అనేక సమస్యలను కలిగిస్తుంది. దీని కారణంగా ఊబకాయం, షుగర్, అధిక రక్తపోటు, బోలు ఎముకల వ్యాధికి సంబంధించిన సమస్యలతో పాటు ఆందోళన, డిప్రెషన్ వంటి మానసిక అనారోగ్య సమస్యలు కూడా ఏర్పడతాయి. ఇక వయస్సు పైబడుతున్న కొద్దీ అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. మరి వృద్ధాప్యంలో ఆరోగ్యంగా ఉండాలంటే ఇప్పటి నుంచే కొన్ని అలవాట్లను అలవర్చుకోవాలి.

మీ శరీరాన్ని చురుకుగా ఉంచుకోవాలి..

ఈ రోజుల్లో ప్రజలు ఎక్కువ సమయం కూర్చోవడం లేదా పడుకోవడం వల్ల శరీరంలో కొవ్వు పేరుకుపోవడం ప్రారంభమవుతుంది. అలాంటి వారు రోజువారీ వ్యాయామం లేదా జిమ్, యోగా చేయలేకపోతే కాసేపు వాకింగ్ చేసి ఫిట్‌గా ఉండవచ్చు. దీనితో పాటు ఎక్కువసేపు ఒకే భంగిమలో ఉండకుండా భంగిమలు మార్చి కూర్చోవాలి. అలాగే, ఫిట్‌గా ఉండటానికి కొన్ని అవుట్‌డోర్ గేమ్‌లను ఆడవచ్చు. ఎలివేటర్‌కు బదులుగా మెట్లను ఉపయోగించడం మంచిది.

ఆహారపు అలవాట్ల పై శ్రద్ధ..

ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకునే అలవాటు ఉంటే ఫిట్ గా ఉండవచ్చు. అలాగే సమతుల్య ఆహారం తీసుకోవాలి. ఫిట్‌గా ఉన్న వ్యక్తులు తినే ఆహారం పరిమాణాన్ని నిర్ణయించుకుంటారు. ఉదయం అల్పాహారం తీసుకోవడం మర్చిపోవద్దు.

వ్యాయామం..

ఫిట్‌గా ఉండటానికి వ్యాయామం, ఆరోగ్యకరమైన ఆహారంతో పాటు, సరైన స్కిప్ సైకిల్ కూడా చాలా ముఖ్యం. కాబట్టి తప్పనిసరిగా 7 నుంచి 8 గంటలు నిద్రపోవాలి. రాత్రి సమయానికి నిద్రపోవడం, ఉదయం సమయానికి మేల్కొనడానికి ప్రయత్నించండి. మంచి నిద్ర శరీరానికి విశ్రాంతిని అందించడమే కాకుండా మన మానసిక ఆరోగ్యానికి, మొత్తం ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. అంతేకాకుండా మనం సమయానికి నిద్రించినప్పుడు, ఉదయాన్నే కొంచెం త్వరగా మేల్కొనగలుగుతాము. అలాగే కొంచెం ముందుగా లేవడం ద్వారా వ్యాయామం చేయవచ్చు. మీరు సమయానికి ధ్యానం, అల్పాహారం కోసం ఖాళీ సమయాన్ని కూడా పొందగలుగుతారు.

హైడ్రేటెడ్ గా ఉండండి..

మన శరీరంలో చాలా భాగాలలో నీరు ఉంటుంది. అందువల్ల శరీరం ద్రవసమతుల్యతను కాపాడుకోవడానికి, ప్రతిరోజూ తగినంత నీరు త్రాగటం చాలా ముఖ్యం. నీరు తాగడం వల్ల శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచి వ్యాధుల బారిన పడకుండా కాపాడుతుంది. తగినంత నీరు తాగడం వల్ల శరీరంలోని విషపదార్థాలు బయటకు వస్తాయి. తగినంత మొత్తంలో నీటిని తీసుకోవడం ద్వారా, మీరు అతిగా తినే అలవాటును నివారించవచ్చు. దీనిద్వారా మిమ్మల్ని మీరు ఫిట్‌గా చేసుకోవచ్చు.

ఒత్తిడిని తగ్గించాలి..

శారీరక ఆరోగ్యంతో పాటు, మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కూడా ప్రతి ఒక్కరికీ చాలా ముఖ్యం. నేటి జీవనశైలిలో ఒత్తిడి చాలా సహజం. అయితే ఈ ఒత్తిడిని తగ్గించుకునేందుకు సాధన చేయండి. దీని కోసం మీరు మైండ్‌ఫుల్‌నెస్, మెడిటేషన్ చేయడం ముఖ్యం.

శారీరక శ్రమ

చాలా ముఖ్యమైన విషయం ఏమిటంటే ఫిట్‌గా ఉండాలనుకునే వ్యక్తులు శారీరక శ్రమ ఎక్కువగా చేస్తుంటారు. ఉదాహరణకు ప్రతి రోజూ 30 నిమిషాలు నడవడం, యోగా చేయడం, ప్రతిరోజూ సలాడ్ తినడం, మరేదైనా ఆరోగ్యకరమైన అలవాట్లను ఎంచుకుంటే, దానిని మర్చిపోకుండా ప్రతిరోజూ అనుసరించాలి. ఎందుకంటే ఈ అలవాటు మిమ్మల్ని ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది.

Tags:    

Similar News