షాంపూలో ఆ మూడింటిని కలిపి వాడారంటే.. జుట్టు తళ తళ మెరిసిపోవాల్సిందే..

సాధారణంగా ప్రతి ఒక్కరూ తమ జుట్టు అందంగా ఉండాలని అనుకుంటారు. అమ్మాయిలైతే పొడుగ్గా, ఒత్తుగా, పెరగాలని భావిస్తే.. అబ్బాయిలేమో చిన్నగా ఉన్నప్పటికీ తమ హెయిర్‌ స్టైలిష్‌గా, షైనింగ్ ఫుల్‌గా ఉండాలని కోరుకుంటారు.

Update: 2024-07-10 08:09 GMT

దిశ, ఫీచర్స్: సాధారణంగా ప్రతి ఒక్కరూ తమ జుట్టు అందంగా ఉండాలని అనుకుంటారు. అమ్మాయిలైతే పొడుగ్గా, ఒత్తుగా, పెరగాలని భావిస్తే.. అబ్బాయిలేమో చిన్నగా ఉన్నప్పటికీ తమ హెయిర్‌ స్టైలిష్‌గా, షైనింగ్ ఫుల్‌గా ఉండాలని కోరుకుంటారు. ఇక అమ్మాయిలైతే అందమైన హెయిర్ కోసం రకరకాల షాంపూలు, సబ్బులు వాడుతుంటారు. కొందరైతే నెలకో బ్రాండ్ మారుస్తుంటారు. అయినా కొన్నిసార్లు ఫలితం లేకపోతే బాధపడుతుంటారు. కానీ షాంపూతోపాటు ఈ మూడు పదార్థాలు కలిపి వాడితే మాత్రం అలాంటి ఫికర్ అవసరం లేదంటున్నారు చిట్కా వైద్యులు. అవేంటో చూద్దాం.

మీరు జుట్టుకోసం వాడే ఓ అర స్పూన్ షాంపూలో జస్ట్ 2 టేబుల్ స్పూన్ల కాఫీ పౌడర్, ఒక టేబుల్ స్పూన్ దాల్చిన చెక్క పొడి, మరో 2 టేబుల్ స్పూన్ల తేనెను కలపండి. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని మీ జుట్టుకు అప్లై చేయండి. అరగంటో, గంటో ఆగి వాష్ చేసుకోండి. వారానికి రెండుసార్లు ఇలా చేస్తూ ఉంటే మీ జుట్టు తళ తళ మెరిసిపోవడమే కాదు, ఒత్తుగా, పొడవుగా పెరుగుతుందని ఆయుర్వేదిక్ చిట్కా వైద్య నిపుణులు చెప్తున్నారు. కాఫీ పొడిలో ఉండే కెఫిన్ కూడా జుట్టు ఆరోగ్యానికి మంచిదని పలు అధ్యయనాలు పేర్కొంటున్నాయి. ఇక దాల్చిన చెక్క, తేనె విషయానికి వస్తే వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ మైక్రోబయల్ లక్షణాలు ఉంటాయి కాబట్టి జుట్టు ఆరోగ్యానికి అద్భుతంగా పనిచేస్తాయి.

*గమనిక: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ఇందులోని విషయాలను ‘దిశ’ ధృవీకరించడం లేదు. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.


Similar News