Health: ఉదయాన్నే ఈ ఆకులు తింటే.. ఆ అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టొచ్చు
ఆ అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టొచ్చు
దిశ, ఫీచర్స్ : తులసి మొక్క మనకి అన్ని విధాలుగా ఉపయోగపడుతుంది. చాలా మంది ఉదయాన్నే తులసి ఆకులను తింటుంటారు. దీని వలన వారు రోజంతా ఉత్సాహంగా ఉంటారు. దీని వలన ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే, దీనిలో విటమిన్ ఎ, విటమిన్ సి ఉంటాయి. ఇవి ఇమ్మ్యూనిటీ పవర్ ని పెంచుతాయి. ఇవే కాకుండా ఐరన్, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం కూడా ఉన్నాయి. కండరాల నొప్పితో బాధ పడే వారికి ఇవి చాలా మంచిదని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. వీటిని తినడం వల్ల మన శరీరానికి కలిగే ప్రయోజనాలేంటో ఇక్కడ చూద్దాం..
తులసిలో యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. వీటిని పరగడుపున తీసుకోవడం వలన రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే ఇతర సమస్యలు కూడా రాకుండా చేస్తుంది. ఈ మధ్య కొత్త కొత్త వ్యాధులన్ని వస్తున్నాయి. వాటన్నింటికి నయం చేయడానికి తులసి బాగా ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతుంటారు.
వర్షాకాలంలో ఈ ఆకులను తీసుకోవడం వలన వల్ల శ్వాసకోశ సమస్యలు తగ్గుతాయి. జలుబు, కఫం, రొమ్ము నొప్పి వంటి సమస్యలను తగ్గిస్తుంది. వీటిలోఉండే పోషకాలను జీర్ణక్రియ పని తీరును మెరుగుపరుస్తుంది. అలాగే మలబద్ధకం వంటి సమస్యలను చెక్ పెడుతుంది.
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి తీసుకోబడింది. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే. ‘దిశ’ ఈ విషయాలను దృవీకరించడం లేదు.