Crows: భూమిపై కాకులు లేకపోతే మానవాళికి ప్రమాదమా.. దీనిలో వాస్తవమెంత?

మొబైల్ రేడియేషన్ వల్ల కాకుల సంతానోత్పత్తి చాలా తగ్గిపోయింది.

Update: 2024-09-26 05:15 GMT

దిశ, వెబ్ డెస్క్ : కాకులు ఒకప్పుడూ అన్ని చోట్లా ఉండేవి కానీ, ఇప్పుడు ఎక్కువ కనించడమే లేదు. పూర్వకాలంలో ఎక్కడా పితృపక్షం చేస్తే అక్కడకి కాకులు వచ్చేవని చెబుతుండేవారు. కానీ, ఇప్పుడు పరిస్థితులు మొత్తం మారిపోయాయి. పల్లెల్లో తప్ప పట్టణాల్లో కాకులు ఎక్కువగా కనిపించడం లేదు. ఇప్పుడు కావ్ కావ్ అని వాటి గొంతు కూడా వినిపించడం లేదు. దీనిపై నిపుణులు పరిశోధనలు షాకింగ్ విషయాలు తెలిపారు. భూమిపై కాకులు లేకపోతే మానవాళికి ప్రమాదమాని కొందరి వాదన .. దీనిలో ఎంత నిజముందో ఇక్కడ చూద్దాం..

మొబైల్ రేడియేషన్ వల్ల కాకుల సంతానోత్పత్తి చాలా తగ్గిపోయింది. అందుకే, కాకులు మనకి తక్కువగా కనిపిస్తున్నాయి. మనుషులైనా, పక్షులైనా ప్రతి వారి పిల్లల గురించి టెన్షన్ పడుతూ ఉంటారు. ప్రస్తుతం పల్లెల్లో తప్ప ఎక్కడా వీటి జాడ కూడా లేదు. పోనీ అక్కడైనా చెట్లమీద మంచిగా బతుకుతున్నాయి అంటే.. చెట్లను కూడా నరికివేస్తున్నారు. వాటి వలన కాకుల ఆవాసాలు నాశనమవుతున్నాయి.

భూమిపై కాకులు అనేవి లేకపోతే రైతు చాలా నష్టపోతాడు, పంటలకు చీడ పీడలు పట్టి.. తినడానికి కూడా ఆహారం దొరకదని అంచనా వేస్తున్నారు. ఇంకో వైపు మత విశ్వాసాల ప్రకారం కాకులు పితృపక్షంలో పూర్వీకుల రూపంలో భూమిపైకి వస్తారని జ్యోతిష్యులు చెబుతున్నారు. మనం సంతోషంగా పిలుస్తాము.. అవి వచ్చినప్పుడు పూర్వీకులు మనలని చేరుకుంటారని నమ్ముతారు. అయితే, కాకుల సంఖ్య తగ్గితే మానవాళికి ముప్పు తప్పదని నిపుణులు అంటున్నారు.

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి తీసుకోబడింది. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే. ‘దిశ’ ఈ విషయాలను దృవీకరించడం లేదు.

Tags:    

Similar News