Alert: సిమ్ కార్డ్ స్కామ్... మీ ఆధార్ మీద ఎన్ని సిమ్స్ ఉన్నాయో ఇలా చెక్ చేయండి..

సైబర్ క్రైమ్స్ రోజురోజుకు పెరిగిపోతున్నాయి. మరింత కొత్త ప్లాన్స్ తో వచ్చేస్తున్నారు మోసగాళ్లు. తాజాగా చండీగఢ్‌కు చెందిన ఓ మహిళ సిమ్ కార్డు స్కామ్ తో రూ. 80 లక్షలు పోగొట్టుకుంది.

Update: 2024-07-16 04:30 GMT

దిశ, ఫీచర్స్: సైబర్ క్రైమ్స్ రోజురోజుకు పెరిగిపోతున్నాయి. మరింత కొత్త ప్లాన్స్ తో వచ్చేస్తున్నారు మోసగాళ్లు. తాజాగా చండీగఢ్‌కు చెందిన ఓ మహిళ సిమ్ కార్డు స్కామ్ తో రూ. 80 లక్షలు పోగొట్టుకుంది. తన ఆధార్ కార్డు మీద సిమ్ తీసుకున్న మోసగాడు.. దీనిపై చట్టవిరుద్ధ కార్యకలాపాలు జరిగాయని, మనీ ట్రాన్స్ ఫర్ చేయకపోతే జైలుకు వెళ్లాల్సి వస్తుందని పోలీసు ఆఫీసర్ మాదిరిగా కాల్ చేశాడు. దీనికి భయపడిపోయిన ఆమె.. వెంటనే డబ్బులు పంపించేసింది. ఆ తర్వాత రియలైజ్ అయి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్... ఆన్ లైన్ పోర్టల్ - టెలికాం అనలిటిక్స్ ఫర్ ఫ్రాడ్ మేనేజ్మెంట్ అండ్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ ను ప్రారంభించింది. ఇలాంటి నేరాలను అరికట్టేందుకు చర్యలు తీసుకుంటుంది. మీ ఆధార్ కార్డు మీద ఎన్ని సిమ్ కార్డులు ఉన్నాయో ఈ విధంగా చెక్ చేసుకోవాలని సూచిస్తుంది.

డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (DoT) మార్గదర్శకాల ప్రకారం.. వినియోగదారు ఒక ID మీద తొమ్మిది మొబైల్ నంబర్లను తీసుకోవచ్చు. అయితే కొత్త సిమ్ కార్డ్ జారీ చేసేందుకు టెలికాం ఆపరేటర్లు అడిగే డాక్యుమెంట్స్ లో ఆధార్ కార్డు ఒకటి. కాగా మీ ఆధార్ మీద ఎన్ని సిమ్ లు ఉన్నాయో తెలుసుకునేందుకు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఏంటో చూద్దాం.

  • ముందుగా TAFCOP వెబ్ సైట్ ను సందర్శించండి.
  • తర్వాత ఓపెన్ అయిన బాక్స్ లో మీ మొబైల్ నంబర్ టైప్ చేయండి.
  • కాప్చా ఇచ్చాక OTP సెండ్ చేయడంపై క్లిక్ చేయండి.
  • తర్వాత మీ మొబైల్ కు వచ్చిన OTP నెంబర్ టైప్ చేసి లాగిన్ అయిపోండి.
  • ఇప్పుడు మీ ID మీద నమోదు చేయబడిన మొబైల్ నెంబర్స్ లిస్ట్ కనిపిస్తుంది.
  • అవి మీకు లేదా మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీకి సంబంధించినవి అవునో కాదో చెక్ చేయండి.
  • అనుమానం ఉంటే ఈ వెబ్ సైట్... "నా నంబర్ కాదు”, “అవసరం లేదు”, “అవసరం" అనే మూడు ఆప్షన్స్ ఇస్తుంది.
  • TAF -COP పోర్టల్ మీది కాని నంబర్‌లను రిపోర్ట్ చేయడానికి, బ్లాక్ చేయడానికి అనుమతిస్తుంది. మీరు "నా నంబర్ కాదు" ఆప్షన్ క్లిక్ చేయడం ద్వారా ఈ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత బ్లాక్ అయిపోతుంది.

Similar News