వడగళ్లు ఎలా ఏర్పడతాయి.. అవి అంత ప్రమాదమా..?
ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో వడగళ్ల వర్షాలు కురుస్తున్నాయి.
దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో వడగళ్ల వర్షాలు కురుస్తున్నాయి. ఈ అకాల వడగళ్ల వానతో ప్రజలు ఎంతో ఇబ్బందులకు గురవుతున్నారు. అయితే.. అసలు వడగళ్లు ఎందుకు వస్తాయి, అవి ఎలా ఏర్పడతాయి అనే దాని గురించి తెలుసుకుందాం.
వడగళ్లు ఎలా ఏర్పడతాయంటే..!
వడగళ్ల వచ్చే ముందు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం గమనించే ఉంటారు. వడగళ్లు ఏర్పడటానికి ముఖ్య కారణం ఉరుములు, మెరుపులు. మేఘాలు దట్టంగా ఉన్న చోట వడగళ్లు ఏర్పడతాయి. దట్టంగా ఉన్న మేఘం రెండు భాగాలుగా విడిపోతుంది. దీంతో పై భాగంలో నీరు ప్రత్యేకమైన స్థితికి చేరుతుంది. దీన్నే కూల్డ్ వాటర్ అంటారు. ఈ స్థితిలో నీరు 0 డిగ్రీ సెల్సియస్ వద్ద ద్రవ రూపంలో ఉంటుంది. వీటికి మంచు గడ్డలు, వర్షపు బిందువులతో కలిసినప్పుడు వడగళ్లు ఏర్పడతాయి.
వడగళ్లతో ప్రమాదమే..
వడగళ్లు చాలా ప్రమాదకరం. వడగళ్ల వర్షం పడినప్పుడు ఇళ్లు, భవనాలు, కార్లు, విమానాలకు చాలా నష్టం కలుగుతుంది. వర్షం సమయంలో బయట ఉంటే మనుషులు, జంతువులు కూడా గాయపడే ప్రమాదం ఉంటుంది.
ఇవి కూడా చదవండి: