Heating milk : ప్యాకెట్ పాలను అతిగా వేడిచేస్తున్నారా..? తర్వాత జరిగే నష్టం ఇదే..!

Heating milk : ప్యాకెట్ పాలను అతిగా వేడిచేస్తున్నారా..? తర్వాత జరిగే నష్టం ఇదే..!

Update: 2024-10-15 06:07 GMT

దిశ, ఫీచర్స్ : మీరు ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ ఒక గ్లాస్ పాలు తాగాలని డైటీషియన్లు సూచిస్తుంటారు. ఎందుకంటే వీటిలో పోషకాలు ఫుల్లుంగా ఉంటాయి. ముఖ్యంగా క్యాల్షియం కలిగి ఉన్నందున ఎముకలు దృఢంగా తయారవుతాయి. అందుకే చిన్న పిల్లలు మొదలుకొని పెద్దల వరకు పాలను, వాటి ఉత్పత్తులను ఆహారంలో భాగంగా ఉపయోగించుకోవాలని పోషకాహార నిపుణులు చెప్తుంటారు. ఇకపోతే యూజ్ చేయడానికి ముందు పాలను కాసేపు వేడిచేయడం సహజమే. అయితే ప్యాకెట్ పాలను మాత్రం ఎక్కువసేపు వేడిచేయడం మంచిది కాదంటున్నారు డైటీషియన్లు. అలా చేస్తే ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

* ఆవులు, గేదెల నుంచి పితికిన పాలను నేరుగా తీసుకొచ్చినప్పుడు వాటిని తప్పకుండా వేడిచేశాకే వాడాలి. అలా చేయకుంటే అందులోని హానికారక బ్యాక్టీరియా చావదు. అయితే బయట మార్కెట్లో కొనే ప్యాకెట్ పాలను మాత్రం ఎక్కువ సేపు మరిగించకూడదు అంటున్నారు పోషకాహార నిపుణులు. ఎందుకంటే వీటిని ఆల్రెడీ పాశ్చరైజేషన్ చేశాకే ప్యాకింగ్ చేస్తారు. ముఖ్యంగా పచ్చి పాలలోని హానికారక బ్యాక్టీరియా నాశనం అయ్యేలా 71 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలవద్ద మరిగించి తిరిగి 0 డిగ్రీలవద్ద చల్లబరుస్తారు. ఆ తర్వాత ప్రాసెస్ చేసి ప్యాకింగ్ చేస్తారు.

* ముందుగానే వేడిచేసి ప్యాక్ చేస్తారు కాబట్టి ప్యాకెట్ పాలలో అనారోగ్యాలకు కారణమయ్యే బ్యాక్టీరియా ఆల్రెడీ నాశనం అయి ఉంటుంది. కాబట్టి వాటిని ఉపయోగించే ముందు జస్ట్ గోరు వెచ్చగా వేడిచేసుకుంటే సరిపోతుందని నిపుణులు చెప్తున్నారు. అలా కాకుండా అధికంగా వేడిచేస్తే చేస్తే మాత్రం వాటిలోని విటమిన్ సి, విటమిన్ బి, ప్రోటీన్లు వంటి పోషకాలు నశిస్తాయని పోషకాహార నిపుణులు చెప్తున్నారు.

*నోట్ : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు. 


Similar News