Health Tips : చలికాలంలో పిల్లలకు జలుబు.. త్వరగా తగ్గాలంటే?

Health Tips : చలికాలంలో పిల్లలకు జలుబు.. త్వరగా తగ్గాలంటే?

Update: 2024-11-03 07:23 GMT
Health Tips : చలికాలంలో పిల్లలకు జలుబు.. త్వరగా తగ్గాలంటే?
  • whatsapp icon

దిశ, ఫీచర్స్ : దీపావళి తర్వాత వాతావరణం పూర్తిగా మారిపోయింది. మధ్యాహ్నం పూట కాస్త ఎండగా, ఉబ్బరంగా అనిపిస్తున్నప్పటికీ ఉదయం, సాయంత్రం వేళల్లో మాత్రం చలి ఎక్కువగా ఉంటోంది. ఇక తెల్లవారు జాము నుంచి దాదాపు 7 గంటల వరకు వరకు మంచు కూడా కురుస్తోంది. ఇలాంటి వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో సహజంగానే సీజనల్ వ్యాధులు, జలుబు వంటి సమస్యలు తలెత్తుతాయి. ప్రస్తుతం చాలామంది పిల్లలు జలుబు బారిన పడుతున్నారు. అయితే చలికాలంలో ఇది త్వరగా తగ్గాలంటే ఆయుర్వేదం ప్రకారం పాటించాల్సిన కొన్ని ఇంటి చిట్కాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

సెలెరీతో ఆవిరి

జలుబును తగ్గించడంలో సెలెరీ (Celery) కషాయం అద్భుతంగా పనిచేస్తుంది. జలుబు వల్ల ముక్కు కారడం, ముక్కు రంధ్రాలు మూసుకుపోవడం, శ్వాసలో ఇబ్బంది వంటివి తలెత్తుతాయి. అయితే దీని నివారణకు సెలెరీ కాషాయం చక్కగా పనిచేస్తుందంటున్నారు నిపుణులు. అందుకోసం ఒక గ్లాస్ నీటిలో ఒక టీ స్పూన్ సెలెరీని వేసి మరిగించాలి. వెంటనే కిందకు దించి జలుబు చేసిన పిల్లలకు దాని వాసన లేదా ఆవిరిని పీల్చమని చెప్పాలి. దీంతో ముక్కు దిబ్బడ నుంచి ఉపశమనం కలుగుతుంది. పిల్లలకు, పెద్దలకు అందరికీ ఇది వర్తిస్తుంది.

పుదీనా ఆకులతో..

చలికాలంలో తలెత్తే సాధారణ సమస్యల్లో జలుబుతో పాటు అప్పటికే ఉన్న సైనస్, ఆస్తమా వంటివి మరింత అధికం అవుతాయి. దీంతో ఊపిరితిత్తులు బలహీన పడతాయి. కాబట్టి నివారణ కోసం కొన్ని పుదీనా ఆకులను, ఒక టీ స్పూన్ సెలెరీ, కొన్ని నల్ల మిరియాలు, కొద్దిగా అల్లం తీసుకొని నీళ్లలో వేసి మరిగించాలి. దాని ఆవిరిని పీల్చడంవల్ల ఉపశమనం కలుగుతుంది.

*గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ‘దిశ’ ధృవీకరించలేదు. అనుమానాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించగలరు. 


Read More..

Diabetes : మీకు డయాబెటిస్ ఉందా..? వింటర్‌లో ఈ జాగ్రత్తలు తప్పనిసరి! 


Tags:    

Similar News