వేసవిలో దొరికే బీరకాయ తినడం వలన మనకి కలిగే ఆరోగ్య ప్రయోజనాలివే!
పచ్చి కూరగాయలను తినడం వల్ల మన ఆరోగ్యానికి మేలు చేస్తాయి.
దిశ, వెబ్ డెస్క్: పచ్చి కూరగాయలను తినడం వల్ల మన ఆరోగ్యానికి మేలు చేస్తాయి. వేసవిలో దొరికే కూరగాయలో బీరకాయ కూడా ఒకటి. గుమ్మడికాయ కుటుంబానికి చెందినది బీరకాయ. దీనిలో ఫైబర్ అధికంగా ఉంటుంది. అంతే కాకుండా ఐరన్, మెగ్నీషియం, పొటాషియం దీనిలో ఉంది. వేసవిలో బీరకాయను తీసుకుంటే మనకి కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.
డీహైడ్రేషన్
బీరకాయలో జింక్, కాపర్,సెలీనియం వంటి ఖనిజాలు అధికంగా ఉంటాయి. ఇవి ఎసిడిటీని తొలగించడంలో కీలక పాత్ర పోషిస్తాయి.
స్కిన్, హెయిర్
బీరకాయలో విటమిన్ ఎ, సి ఎక్కువగా ఉంటాయి . అంతే కాకుండా దీనిలో యాంటీఆక్సిడెంట్లు కూడా ఉంటాయి. ఇవి జట్టు ఊడకుండా చేస్తుంది.
గుండె ఆరోగ్యం
బీరకాయలో కొలెస్ట్రాల్ చాలా తక్కువుగా ఉంటుంది. దీన్ని మన ఆహారంలో చేర్చుకుంటే మన ఆరోగ్యం మంచిగా ఉంచడమే కాకుండా గుండె పని తీరును కూడా మెరుగుపరుస్తుంది.
Read More: ప్రపంచంలోనే అతిపెద్ద నాగలి