Gold mines in india : భారత్‌లో బంగారు గనులు.. ఎక్కడెక్కడ ఉన్నాయంటే..

Gold mines in india : భారత్‌లో బంగారు గనులు.. ఎక్కడెక్కడ ఉన్నాయంటే..

Update: 2024-10-14 13:33 GMT

దిశ, ఫీచర్స్ : బంగారం అంటేనే అందరికీ ఆసక్తి. ద్రవ్య వినిమయ విలువతోపాటు ఆభరణాల తయారీలో ఇది చాలా ముఖ్యమైన లోహం. కాబట్టి గోల్డ్ కొనాలని, దాని గురించి తెలుసుకోవాలనే ఇంట్రెస్ట్ సహజంగానే ఉంటుంది. అయితే వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (WGC) రిపోర్ట్ ప్రకారం.. మన దేశం ఏటా 800 మెట్రికల్ టన్నుల బంగారాన్ని దిగుమతి చేసుకుంటోంది. అలాగే మన దేశంలోని ఆయా బంగారు గనుల్లో కూడా2,191.53 మెట్రిక్ టన్నుల గోల్డ్ నిల్వలు ఉన్నాయి. అయితే ఆ గనులు వివరాలేమిటో ఇప్పుడు చూద్దాం.

* కోలార్ గోల్డ్ మైన్ : ఇండియాలోనే అతి పురాతన, లోతైన బంగారు గని ఇది. కర్ణాటక రాష్ట్రంలో ఉంది. 1880లో బ్రిటీష్ వారు దీనిని నిర్మించినట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. 2001 వరకు కొనసాగిన ఈ బంగారు గనిలో మొత్తం 800 టన్నుల గోల్డ్ ఉత్పత్తి అయింది.

* హట్టి గోల్డ్ మైన్ : భారత దేశంలో ఇప్పటికీ వర్క్ చేస్తున్న బంగారు గనుల్లో హట్టి ఒకటి. రెండువేల సంవత్సరాల నాటి పురాతన గనిగా పేర్కొంటారు. కర్ణాటక రాష్ట్రంలోని రాయిచూర్ జిల్లాలో ఉంది. దీంతోపాటు ఊటీ అనే మరో గని కూడా ఇక్కడ ఉంది. అయితే హట్టి మాత్రమే ప్రాసెస్‌లో యాక్టివ్‌గా ఉంది. ఇక్కడ ప్రతీ సంవత్సరం 1.8 టన్నుల బంగారం ఉత్పత్తి అవుతుంది.

*గంజుర్ గోల్డ్ మైన్ : ఈ బంగారు గని కర్ణాటక రాష్ట్రంలో ఉంది. ఇది 2021 వరకు డెక్కన్ గోల్డ్ మైన్స్ అనే ప్రైవేట్ కంపెనీ ఆధ్వర్యంలో నడిచింది. ఆ తర్వాత మైనింగ్ లీజును ప్రభుత్వం రద్దు చేసింది. ఇక ఏపీ తెలంగాణ సరిహద్దులోనూ ఓ ప్రైవేటు సంస్థకు చెందిన జొన్నగిరి బంగారు గని ఉంది. దీంతోపాటు ఏపీలో ప్రస్తుతం రామగిరి గోల్డ్ మైన్ కూడా ఎంఈసీఎల్ ఆధీనంలో ఉంది. ఇందులో నాలుగు టన్నుల గోల్డ్ నిల్వలతోపాటు రాగి, సీసం, జింక్ ఉన్నాయి. వీటితోపాటు మన దేశంలో చాలా చోట్ల బంగారు గనులు ఉన్నాయి. కాకపోతే అవన్నీ యాక్టివ్‌గా లేవని చెప్తారు. అందుబాటులోకి వస్తే గనుక దేశంలో ఉత్పత్తి పెరుగుతుంది కాబట్టి గోల్డ్ రేట్ తగ్గే అవకాశాలు కూడా ఉంటాయి అంటున్నారు నిపుణులు.

*గమనిక : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. ‘దిశ’ ధృవీకరించలేదు. మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. 


Similar News