ప్రకృతి అందాలను చూడాలనుకుంటున్నారా.. ఈ ప్రదేశాలను సందర్శించండి..
నగరాలలో నివసించే వారు ఎప్పుడూ ఎత్తైన భవనాలు, పొల్యూషన్, పెద్ద పారిశ్రామిక సంస్థలు, వ్యాపార సముదాయాలను చూస్తూ ఉంటారు.
దిశ, ఫీచర్స్ : నగరాలలో నివసించే వారు ఎప్పుడూ ఎత్తైన భవనాలు, పొల్యూషన్, పెద్ద పారిశ్రామిక సంస్థలు, వ్యాపార సముదాయాలను చూస్తూ ఉంటారు. పొద్దున్నే ఆఫీసుకు వెళ్లే హడావిడి, ఆ తర్వాత రోజంతా పనిచేసి ఇంటికి తిరిగి వస్తుంటారు. ఇలాంటి వారు అప్పుడప్పుడూ వీటన్నింటికి దూరంగా ప్రశాంతమైన వాతావరణంలో, ప్రకృతి అందాలను చూస్తూ గడపాలనుకుంటారు. అందుకోసం వారికి సమీపంలో ఉన్న కొన్ని పర్యాటక ప్రదేశాల గురించి తెలుసుకుంటారు. బిజీ లైఫ్‌లో రిలాక్స్‌గా సమయాన్ని గడపాలనుకుని ఒక ట్రిప్ ప్లాన్ చేసుకుంటుంటారు. అలాంటి ఓ పర్యాటక ప్రదేశం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
హర్యానాలోని గుర్గావ్‌లోని ఘమ్‌డోజ్ గ్రామంలో ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదించవచ్చు. ఈ ప్రదేశంలో చాలా ప్రశాంతమైన వాతావరణం, చుట్టూ పచ్చదనం ఉంది. ఇక్కడ మరో విశేషమేమిటంటే కొండ పై నుండి జలపాతం ప్రవహిస్తుంది. ఈ ప్రదేశం ప్రజలలో సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా ఉంటుంది. అయితే ఇక్కడ ఉన్న జలపాతం కొంత కాలంగా ప్రవహించడం ఆగిపోయింది. అయితే జలపాతాన్ని చూడాలనుకునే వారు వర్షాకాలంలో మాత్రమే ఇక్కడికి వెళ్లాల్సి ఉంటుంది.
ఘమ్‌డోజ్ చేరుకోవడం ఎలా..
ఆరావళి కొండల దిగువన ఉన్న ఘమ్‌డోజ్ గ్రామం పర్వత ప్రాంతం కావడంతో చాలా ప్రశాంతంగా ఉంటుంది. జలపాతంతో పాటు ఇక్కడి పచ్చిక బయళ్లలో ప్రజలు ఫుట్‌బాల్, క్రికెట్ వంటి ఆటలు ఆడుతుంటారు. ప్రస్తుతానికి, ఈ ప్రదేశం గుర్గావ్‌లోని సోహ్నా రోడ్ వైపు వస్తుంది.
జాగ్రత్తలు పాటించాలి..
ఘమ్‌డోచాజ్ అందం వర్షాకాలంలో గణనీయంగా పెరుగుతుంది. చాలామంది కుటుంబం సమేతంగా, స్నేహితులతో ఇక్కడికి వస్తుంటారు. అయితే ఇక్కడ ఒంటరిగా వెళ్లకపోవడమే మంచిదంటున్నారు అక్కడి ప్రజలు. ఇక్కడ కాలు జారే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని, చుట్టూ చెట్ల కారణంగా, అడవి జంతువుల భయం ఉంటుందంటున్నారు స్థానికులు. కాబట్టి ఈ ప్రదేశంలో ఒంటరిగా వెళ్లడం చాలా ప్రమాదకరమైనదిగా పరిగణిస్తారు.