1996 ఏళ్ల నాటి జామ్‌ తిన్న యువతి.. చివరికి ఏమైందంటే?(వీడియో)

సాధారణంగా పిల్లలు జామ్‌ను ఎంతో ఇష్టంగా తింటారు. ఈ జామ్ ఎక్కువ కాలం పాటు నిల్వ ఉంటుంది

Update: 2024-01-22 06:33 GMT

దిశ, ఫీచర్స్: సాధారణంగా పిల్లలు జామ్‌ను ఎంతో ఇష్టంగా తింటారు. ఈ జామ్ ఎక్కువ కాలం పాటు నిల్వ ఉంటుంది. ఎక్కువ కాలం అంటే ఏడాది, రెండేళ్లు పాడవకుండా ఉంటుంది. ఆ తర్వాత జామ్ పాడైపోతుంది. ఒకవేళ తాజాగా ఉన్నా దాన్ని తినకపోవడమే మంచిది. అయితే తాజాగా జర్మనీకి చెందిన ఓ యువతి.. దాదాపు 30 ఏళ్ల నాటి జామ్ ను తిని జనాలను భయపెడుతుంది. అన్ని సంవత్సరాల క్రితం జామ్ అంటే దాన్ని ట్రై చేయడానికి కూడా జనాలు ఇష్టపడరు. కానీ జార్జియానా అనే జర్మన్ యువతి చాలా పెద్ద సాహసమే చేసిందని చెప్పుకోవచ్చు. 1996 లో జార్జియానా అమ్మమ్మ ఇంట్లోనే జామ్ తయారు చేసిందట.

అప్పటి నుంచి దాన్ని ఎవరు తినలేదట. దీంతో జార్జియానాకు ఎందుకో ఆ జామ్‌ను టేస్ట్ చేయాలనిపించిందట. కాగా ఈ యువతి జామ్ స్టోర్ చేసిన డబ్బా మూతను ఓపెన్ చేయడానికి ప్రయత్నించింది. క్యాప్ తెరవడానికి ఈ యువతి చాలా కష్టపడినట్లు తెలుస్తోంది. చివరకు క్యాప్ తెరిచి తన ఇద్దరు సోదరులతో కలిసి.. 27 ఏళ్ల క్రితం నాటి జామ్ టేస్ట్ చేసింది. టేస్ట్ ఎంతో బాగుందని జార్జియానా సోషల్ మీడియాలో వీడియోను పంచుకుంది. ‘‘ఇది మా కుటుంబ సభ్యులకు విషం కాకూడదని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నా’’ అంటూ వీడియో కింద క్యాప్షన్ రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ వీడియోను వీక్షించిన నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు పెడుతున్నారు.


Similar News