పండగ వేళ పిండివంటలు చేస్తున్నారా? ఎన్ని ఐటమ్స్ చేసిన నూనె లాగొద్దంటే ఈ టిప్స్ పాటించండి!

రెండు తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు మొదలయ్యాయి.

Update: 2024-01-11 08:55 GMT

దిశ, ఫీచర్స్: రెండు తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు మొదలయ్యాయి. సంక్రాంతి అంటేనే రంగురంగుల ముత్యాల ముగ్గులు, కోడి పందాలు, చుట్టాల హడావిడి. వీటితో పాటు ముఖ్యంగా పిండి వంటలు. సంక్రాంతి వచ్చిందంటే చాలు వారం రోజుల ముందు నుంచే పిండి వంటలు చేయడం స్టార్ట్ చేస్తారు. ‘సకినాలు, అరిసెలు, మురుకులు, లడ్డులు’ ఇలా రకరకాల నోరూరించే పిండి వంటలు చేస్తుంటారు.

సాధారణంగా ఒక ఐటెమ్ చేశాక మళ్లీ ఆ ఆయిల్‌ను ఉపయోగిస్తే ఫుడ్ టెస్టీగా ఉండకపోవడమే కాకుండా అనేక అనారోగ్య సమస్యల బారిన పడాల్సి ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. కానీ ఒకసారి వేయించిన నూనెలో కాస్త నెయ్యి, ఒక టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసి వాడుకున్నట్లైతే ఎలాంటి ప్రమాదం లేదంటున్నారు నిపుణులు. అలాగే ఆ నూనెతో 15-20 వంటకాలు చేసుకోవచ్చు. పైగా నూనె అస్సలు పీల్చదు. రుచిలో తేడా కూడా ఉండదు. ఈ సింపుల్ టిప్‌ను ఫాలో అయితే హార్ట్ ప్రబ్లమ్స్ కూడా రాకుండా ఉంటాయి. శీతాకాలంలో అలర్జీలను కూడా దరిచేరవు.


Similar News