Coffee and health : కాఫీ త్యాగం చేయగలరా?

గ్లోబల్ కాఫీ వినియోగం మూడు దశాబ్దాలుగా క్రమంగా పెరుగుతూనే ఉంది..

Update: 2023-01-10 04:12 GMT

దిశ, ఫీచర్స్: గ్లోబల్ కాఫీ వినియోగం మూడు దశాబ్దాలుగా క్రమంగా పెరుగుతూనే ఉంది. ప్రపంచ వ్యాప్తంగా ప్రతీ వ్యక్తి రోజు సగటున 2.7 కప్పుల కాఫీని ఉపయోగిస్తున్నారు. అంటే ప్రతిరోజూ దాదాపు రెండు బిలియన్ కప్పుల కాఫీని తాగుతున్నారని అంచనా. ఈ డిమాండ్ కాఫీ క్యాప్సూల్స్‌ మేకింగ్‌తో సహా కాఫీని తయారుచేసే మార్గాలలో గణనీయమైన వైవిధ్యతకు దారితీసింది. కానీ ఈ క్యాప్సూల్స్ పాపులారిటీ పబ్లిక్‌లో భిన్నాభిప్రాయాలకు కారణమైంది. ఎందుకంటే సింగిల్ యూజ్ పర్సనల్ ప్యాకేజింగ్‌ పర్యావరణానికి హానికరం. కాగా ఉత్పత్తులు, సేవల పర్యావరణ ప్రభావాలను అంచనా వేసిన శాస్త్రవేత్తలు.. కాఫీ క్యాప్సూల్స్ కార్బన్ పాదముద్ర నేరస్థులు కావని వెల్లడించారు.

కాఫీ లైఫ్ సైకిల్

నిజానికి మనం ఒక కప్పు కాఫీని ఆస్వాదించాలంటే చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది. కాఫీ గింజల వ్యవసాయ ఉత్పత్తి, రవాణా, బీన్స్ వేయించడం, గ్రైండింగ్, కాఫీ కోసం నీటిని వేడి చేయడం, దాన్ని కప్పులో పోసుకుని తాగడం, కడగడం వరకు అనేక దశలు ఉంటాయి. ఈ దశలు అన్ని కాఫీ ప్రిపరేషన్ మోడ్స్‌లో సాధారణం కాగా వనరులను వినియోగించడం, గ్రీన్ హౌజ్ వాయువులను విడుదల చేయడం అన్నింటిలోనూ ఉంది. అందుకే డిఫరెంట్ కాఫీ తయారీ పద్ధతుల కార్బన్ పాదముద్రను పోల్చేందుకు, వాటి లైఫ్ సైకిల్‌ను పరిగిణలోకి తీసుకోవడం ముఖ్యం. అంటే కాఫీ ఉత్పత్తి నుంచి ప్యాకేజింగ్, మెషినరీ, కాఫీ తయారీ, ఉత్పత్తి చేయబడిన వ్యర్థాలు అన్నింటిని లెక్కించాల్సి ఉంటుంది.

తయారీ పద్ధతుల పోలిక

280 మిల్లీలీటర్ల కాఫీని తయారుచేసే నాలుగు పద్ధతులను పోల్చిన రీసెర్చర్స్.. ఆ ప్రాసెస్‌లో రిలీజ్ అయ్యే కార్బన్ పాదముద్రను కాలిక్యులేట్ చేశారు.

1. సాంప్రదాయ ఫిల్టర్ కాఫీ (25 గ్రాముల కాఫీ)

2. ఎన్‌క్యాప్సులేటెడ్ ఫిల్టర్ కాఫీ (14 గ్రాముల కాఫీ)

3. బ్రూడ్ కాఫీ (ఫ్రెంచ్ ప్రెస్) (17 గ్రాముల కాఫీ)

4. సోల్యుబుల్ కాఫీ లేదా ఇన్‌స్టాంట్ కాఫీ (12 గ్రాముల కాఫీ)

* కాగా ఈ పద్ధతుల్లో సాంప్రదాయ ఫిల్టర్ కాఫీ అత్యధిక కార్బన్ పాదముద్రను కలిగి ఉందని స్పష్టం చేశారు పరిశోధకులు. ఈ ప్రొసీజర్‌లో ఎక్కువ పరిమాణంలో కాఫీ పౌడర్ ఉపయోగించబడుతుంది. నీటిని వేడి చేయడానికి, వెచ్చగా ఉంచడానికి ఎక్కువ విద్యుత్తు అవసరమవుతుంది.

* వినియోగదారులు సిఫార్సు చేసిన కాఫీ, నీటిని ఉపయోగించినప్పుడు.. ఇన్‌స్టాంట్ కాఫీ అత్యంత పర్యావరణ అనుకూల ఎంపికగా కనిపిస్తుంది. ఈ పద్ధతిలో ఒక కప్పులో తక్కువ మొత్తంలో కరిగే కాఫీని ఉపయోగిస్తాం. అంతేకాదు ఇక్కడ కెటిల్ తక్కువ విద్యుత్‌ను వినియోగిస్తుంది. సేంద్రీయ వ్యర్థాలు కూడా ఉండవు.

*ఇక వినియోగదారులు 20 శాతం మిగులు కాఫీని ఉపయోగించినప్పుడు, అవసరమైన నీటిని రెండింతలు వేడి చేసినప్పుడు.. కాఫీ క్యాప్సూల్స్ ఉత్తమ ఎంపికగా కనిపిస్తాయి. ఎందుకంటే క్యాప్సూల్స్ కాఫీ, నీటి వినియోగాన్ని ఆప్టిమైజ్ చేయడానికి అనుమతిస్తాయి.

సాంప్రదాయ ఫిల్టర్ కాఫీతో పోలిస్తే, కాఫీ క్యాప్సూల్స్ (280 మి.లీ) తీసుకోవడం వల్ల 11 నుంచి 13 గ్రాముల కాఫీ ఆదా అవుతుంది. బ్రెజిల్‌లో 11 గ్రాముల అరబికా కాఫీని ఉత్పత్తి చేయడం వల్ల దాదాపు 59 గ్రాముల కార్బన్ డై యాక్సైడ్ విడుదలవుతుంది. ఇది కాఫీ క్యాప్సూల్స్ తయారీలో వెలువడిన వ్యర్థాలను పల్లపు ప్రాంతానికి పంపడానికి విడుదలయ్యే 27 గ్రాముల కార్బన్ డై యాక్సై్డ్ కంటే చాలా ఎక్కువ. ఈ గణాంకాలు కాఫీని మితిమీరి ఉపయోగించడం, వృధా చేయడం వల్ల పర్యావరణంపై ఎలాంటి ప్రభావం పడుతుందో నొక్కి చెప్తున్నాయి.

కాఫీ ఉత్పత్తి

కాఫీ తయారీ రకంతో సంబంధం లేకుండా.. కాఫీ ఉత్పత్తి మోస్ట్ గ్రీన్ హౌజ్ గ్యాస్ ఎమిటింగ్ ఫేజ్. ఈ దశలో మొత్తం ఉద్గారాలలో దాదాపు 40 శాతం నుంచి 80 శాతం వరకు ఉద్గారాలు విడుదలవుతాయి. నిజానికి కాఫీ అనేది ఒక చిన్న చెట్టు లేదా పొద. దీనిని సాంప్రదాయకంగా అటవీ పందిరి నీడలో పెంచుతారు. అయితే ఈ రంగం ఆధునీకరణ అనేక కాఫీ తోటలు పూర్తిగా సూర్యరశ్మికి గురయ్యే విశాలమైన పొలాలుగా రూపాంతరం చెందడానికి దారితీసింది. ఇది ఇంటెన్సివ్ నీటిపారుదల, ఫలదీకరణ వ్యవస్థలు, పురుగుమందుల వినియోగం అవసరాన్ని జోడించింది. ఈ యాంత్రీకరణ నీటిపారుదల, నైట్రస్ ఆక్సైడ్-ఉద్గార ఎరువుల వాడకం, వీటి ఉత్పత్తికి పెద్ద మొత్తంలో సహజ వాయువు అవసరం.. అధిక కార్బన్ పాదముద్రకు దోహదపడుతుంది.

తగ్గించడమెలా?

*వినియోగదారుడు కాఫీ వినియోగాన్ని తగ్గించడం కంటే.. కాఫీ మరియు నీటిని వృధా చేయడం నివారించడం అనేది సాంప్రదాయ, బ్రూ, ఇన్‌స్టాంట్ కాఫీల కార్బన్ పాదముద్రను తగ్గించడానికి అత్యంత ప్రభావవంతమైన మార్గం.

*కాఫీ క్యాప్సూల్స్.. కాఫీ మరియు నీటి మితిమీరిన వినియోగాన్ని నివారిస్తాయి. అయినప్పటికీ, క్యాప్సూల్ మెషీన్‌ల సౌలభ్యం వినియోగదారులు తమ కాఫీ వినియోగాన్ని రెట్టింపు చేయడానికి దారి తీస్తుంది. తద్వారా ఈ పర్యావరణ ప్రయోజనాన్ని అనవసరమైనదిగా మారుస్తుంది. కాగా కాఫీ క్యాప్సూల్స్‌ను రీసైక్లింగ్ సదుపాయానికి బదులుగా ల్యాండ్‌ఫిల్‌కు పంపబడకుండా ఉండటానికి వినియోగదారులు వారు నివసించే నగరంలో క్యాప్సూల్ రీసైక్లింగ్ ఎంపికల గురించి కూడా తెలుసుకోవాలి. లేదంటే రీయూజబుల్ క్యాప్సూల్స్‌కు మారడం మరింత మంచిది.

*ఇక కాఫీ మేకర్ హాట్ ప్లేట్‌ని ఉపయోగించకుండా.. కప్పును చల్లటి నీటితో శుభ్రం చేయడం కార్బన్ పాదముద్రను తగ్గించడంలో హెల్ప్ అవుతుంది. ఎందుకంటే ఒక కప్పు కాఫీని కడగడానికి ఉపయోగించే విద్యుత్, కాఫీ క్యాప్సూల్‌ను ఉత్పత్తి చేసి ల్యాండ్‌ఫిల్ (27 గ్రాముల CO2e)కి పంపడం కంటే ఎక్కువ కార్బన్ (29 గ్రాముల CO2e)ని విడుదల చేస్తుంది.

బాధ్యతలను పంచుకుందాం..

వాతావరణ మార్పులకు మీ సహకారాన్ని పరిమితం చేయడానికి అనుకూలమైన ఆహారం అవసరం. ఇందులో కాఫీ మినహాయింపు కాదు. తక్కువ గ్రీన్‌హౌజ్ వాయు ఉద్గారాలను విడుదల చేసే కాఫీ తయారీ విధానాన్ని ఎంచుకోవడం, మీ వినియోగాన్ని నియంత్రించడం అనేది పరిష్కారంలో భాగం. అయినప్పటికీ కాఫీ ఉత్పత్తిదారులు, సరఫరాదారుల కారణంగా కాఫీ కార్బన్ పాదముద్రలో సగానికి పైగా వస్తుంది. కాబట్టి కాఫీ ఉత్పత్తి పర్యావరణ, సామాజిక ప్రభావాలను తగ్గించడానికి వారు చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఉంది.

Read more:

పరగడుపున ఒక స్పూన్ తేనె తింటే ఆరోగ్యానికి చాలా మేలు..

Tags:    

Similar News