'హ్యాపీ మంత్రం' చెప్పిన అమ్మమ్మ.. అదేంటో మీరే చూడండి! (వీడియో)
తిరిగి తీసుకురాలేని కాలాన్ని సరిదిద్దుకోవడం సాధ్యం కాకపోవచ్చు కానీ.. Elderly woman shares her mantra of 'happiness'.
దిశ, వెబ్‌డెస్క్ః అనుభవించిన వారికే లోటుపాట్లు తెలుస్తాయి. తిరిగి తీసుకురాలేని కాలాన్ని సరిదిద్దుకోవడం సాధ్యం కాకపోవచ్చు కానీ, అనుభవజ్ఞుల మాట వింటే తర్వాతి తరాలవారైనా ఆనందాన్ని అందుకుంటారు. అందుకే, జీవితాన్ని కాచి వడకట్టి వచ్చిన వృద్ధుల మాట సద్ది మూటంత ఆరోగ్యాన్ని ఇస్తుందని అన్నారు పెద్దలు. వారి మాటల్లో కొన్ని విలువైన పాఠాలు నేర్చుకోవచ్చు. సాధారణంగా వృద్ధులు యువ తరాలకు ఉత్తమమైన సలహాలను అందిస్తారు. ఈ వీడియోలో ఉన్న వృద్ధ మహిళ కూడా కొన్ని అద్బుతమైన సలహాలను యువతకు ఇచ్చారు. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఈ వీడియో నెటిజనుల హృదయాలను గెలుచుకుంది.
"'నేను తెలివైన నిర్ణయాలు తీసుకుంటాను' అనే ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసినఈ వీడియోలో ఒక వృద్ధ మహిళను 'తాను తిరిగి పాత జీవితంలోకి వెళ్లి, తన యవ్వన జీవితానికి మంచి సలహా ఇవ్వమంటే ఏమిస్తారు? అని అడిగితే మరింత తెలివైన నిర్ణయాలు తీసుకోమని చెబుతాని అని అంటారు. మీరు స్త్రీలైతే మంచి కెరీర్‌ని నిర్మించుకోమని చెబుతాను. ఎందుకంటే, జీవితంలో ఎప్పుడు ఏమౌతుందో చెప్పలేము స్త్రీకి ఆర్థిక సామర్థ్యం, మానసిక స్థైర్యం చాలా అవసరమని చెబుతుంది. ఇంకా మంచి సలహాలతో కూడిన ఈ వీడియోకు నెటిజనులు థ్యాంక్స్ చెబుతున్నారు. ఈ "Words of Wisdom", వీడియోలో ఉన్న కుక్కకు అంకితం చేశారు.