వరలక్ష్మి వ్రతం ఎఫెక్ట్: ఆకాశాన్నంటుతున్నపూల ధరలు.. కేవలం మల్లెకే రూ. 550 నుంచి 1500 అంటే మిగతా వాటికి?

తెలుగు రాష్ట్రాల్లో పండుగ వాతావరణం నెలకొంది.

Update: 2024-08-16 02:21 GMT

దిశ, ఫీచర్స్: తెలుగు రాష్ట్రాల్లో పండుగ వాతావరణం నెలకొంది. ప్రతి ఇంట్లో మహిళలంతా ఉదయాన్నే లేచి వరలక్ష్మి వ్రతానికి సంబంధించిన పనులు ప్రారంభించారు. అమ్మవారి అనుగ్రహం పొందేందుకు స్త్రీలంతా రంగు రంగుల చీరలు ధరించి.. పూజలు మొదలుపెట్టారు. కుటుంబ సభ్యులందరికీ ఏడాది పొడవునా మంచి జరగాలని భక్తి శ్రద్ధలతో వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తున్నారు. శ్రావణ శుక్లపక్షంలో పౌర్ణమికి ముందు వచ్చే ఈ శుక్రవారం మహిళలకు ఎంతో ప్రత్యేకమని చెప్పుకోవచ్చు. నేడు ఆడవాళ్లంతా తమ భర్తల మేలు కోరుతూ ఉపవాసాలు చేస్తారు. పెళ్లి కాని స్త్రీలంతా మంచి భర్త రావాలని, మంచి ఉద్యోగం సంపాదించాలని అమ్మవారికి మొక్కుకుని రోజు మొత్తం ఫాస్టింగ్ ఉంటారు. అయితే అడగ్గానే వరాలిచ్చే ఈ లక్ష్మిదేవి కోసం ప్రజలంతా ఎంత ఖర్చైనా భరిస్తారు.

కాగా వరలక్ష్మి వ్రతం కాబట్టి నేడు పూల ధరలు భారీగా పెరిగాయి. వాతావరణ మార్పులతో ఇటీవల దిగుబడి తగ్గడం ప్రభావం చూపుతుంది. గత నెలలో మల్లె పువ్వుల రేటు చూసినట్లైతే.. కేజీ 550 రూపాయలు ఉంది. ప్రస్తుతం మల్లెపువ్వుల ధర 1500 రూపాయలుగా ఉంది. పసుపు చామంతి ధర రూ. 150 ఉండగా.. నేడు 400 రూపాయలకు పెరుగుతూ వచ్చింది. తెల్ల చామంతి ధర రూ. రూ. 200 కాగా నేటి ధర రూ. 350 గా ఉంది. కనకాంబరం పూల ధర చూసినట్లైతే నిన్నటివరకు రూ. 100 ఉంది. ప్రస్తుతం 300 రూపాయలు పెరిగింది. జాజిపూల రేటు 300 రూపాయలు ఉండగా.. నేటి ధర 1200 రూపాయలకు పెరగడం గమనార్హం. లిల్లీ పూల ధర 150 రూపాయలు నుంచి 500 రూపాయలకు పెరిగింది. పూల ధరలు మూడింతలు పెరగడంతో ఏపీ ప్రజలంతా ఇబ్బందులు పడుతున్నారు. కానీ వరలక్ష్మి వ్రతం కోసం కొనడం తప్పడం లేదు. అయితే ఈ ధరలు ఆంధ్రప్రదేశ్ ‌లో కొనసాగుతున్నట్లు సమాచారం.

Tags:    

Similar News