వెండి వస్తువులను శుభ్రం చేసే అదిరిపోయే ట్రిక్ మీ కోసం!
చిన్నదో, పెద్దదో ప్రతి ఒక్కరి ఇంట్లో వెండి వస్తువులు ఉంటాయి.
దిశ, ఫీచర్స్: చిన్నదో, పెద్దదో ప్రతి ఒక్కరి ఇంట్లో వెండి వస్తువులు ఉంటాయి. ఎక్కువగా వెండి పట్టీలను స్త్రీలు కాళ్లకు పెట్టుకుంటారు. అంతే కాకుండా.. పూజ కోసం ఎక్కువ మంది వెండి సామాగ్రినే ఉపయోగిస్తారు. అయితే వాటిని క్లీన్ చేయడానికి మాత్రం చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే సిల్వర్ తొందరగా నల్లగా అవుతాయి. మనం ఎంత శుభ్రం చేసినా మొదట్లో ఉన్నట్లుగా ఉండవు. కాగా వెండి వస్తువులు మునపటిలా మిలమిల మెరవాలంటే.. ఈ ఈజీ ట్రిక్స్ ఫాలో అవ్వండి..
అల్యూమినియం ఫాయిల్ గురించి తెలియని వారంటూ ఎవరూ ఉండరు. ప్రస్తుత రోజుల్లో ఫుడ్ పార్శిల్స్‌కు ఈ అల్యూమినియం ఫాయిల్‌నే ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. అయితే దీన్ని కేవలం ఫుడ్ ప్యాకింగ్‌కు మాత్రమే కాకుండా క్లీనింగ్‌కు కూడా వాడొచ్చు. ముఖ్యంగా వెండి వస్తువులను శుభ్రం చేయడానికి బెస్ట్ క్లీనర్ అని చెప్పుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం..
సాధారణంగా వెండి వస్తువులను శుభ్రం చేయడానికి బంగారం, వెండి షాపుల వద్దకు వెళ్తారు కదా? ఇక నుంచి ఎలాంటి ఖర్చు లేకుండా అనవసరపు ఖర్చు చేసే బదులు అల్యూమినియం ఫాయిల్‌ని ఉపయోగించి, మీ ఇంట్లోనే సింపుల్‌గా శుభ్రం చేసుకోండి. ముందుగా ఒక పెద్ద పాన్ తీసుకొని దానిని నీటితో నింపండి. దాంట్లో కొంచెం సాల్ట్ వేసి మిక్స్ చేయండి. మీ వంటిట్లో ఉన్న కత్తిపీట, వెండి సామాన్లను అందులో వేయండి. అనంతరం అల్యూమినియం ఫాయిల్‌తో పాన్‌ను కవర్ చేయండి. ఇప్పుడు మనం తీసుకున్న అన్ని వస్తువులు నీటిలో మునిగే వరకు ఉంచండి. ఈ మిశ్రమంలోని వస్తువులను 10 నిమిషాల పాటు నానబెట్టండి. తర్వాత వాటిని తీసి శుభ్రమైన క్లాత్‌తో వాటర్ పోయేవరకు తుడవండి. అంతే నల్లగా మారిన వెండి వస్తువులను ఇంట్లోనే ఇలా ఈజీగా తెల్లగా తళతళ మెరిసేలా చేయండి.