Drumstick Seeds: మునగ గింజలు వల్ల ఎన్ని లాభాలో తెలుసా?

వేసవి కాలంలో ఎక్కువగా మునగ గింజలు దొరుకుతాయి.

Update: 2023-04-07 06:08 GMT

దిశ, వెబ్ డెస్క్ : వేసవి కాలంలో ఎక్కువగా మునగ గింజలు దొరుకుతాయి. మనలో చాలా మంది మునగ కాయ సాంబార్ ఎక్కువ ఇష్ట పడుతుంటారు. అలాగే మునగ ఆకులు, మునగ గింజలు కూడా మన ఆరోగ్యానికి ఉపయోగకరంగా ఉంటాయి. మునగకాయ గింజలను తీసుకోవడం వల్ల మీ మెదడు, చర్మం ,జుట్టును మెరుగుపరుస్తుంది. అంతే కాకుండా వాపు వల్ల వచ్చే వ్యాధులను కూడా తగ్గిస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మునగకాడ గింజలు అంటు వ్యాధులను కూడా నివారిస్తాయి. రోజూ ఒక టేబుల్ స్పూన్ ఈ గింజలను తీసుకుంటే మనకి ఏ రోగాలు కూడా దరి చేరవు. అంతే కాకుండా ఈ గింజలను పొడి రూపంలో తీసుకుంటే చాలా మంచిదట. ఒక గ్లాస్ వాటర్లో 1 టేబుల్ స్పూన్ గింజల పొడిని కలిపి తీసుకుంటే మనల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.

Also read: వేసవిలో కచ్చితంగా తీసుకోవాల్సిన కూరగాయాలు ఏవో తెలుసా?

ఇవి కూడా చదవండి: సెల్ఫ్ కాన్ఫిడెన్స్‌ను దెబ్బతీస్తున్న పోషకాహార లోపం

Tags:    

Similar News