ఎక్కువసేపు వేడినీటితో స్నానం చేయడం వల్ల లైంగిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందా?

కొంతమంది 5 నిమిషాల్లో స్నానాన్ని ముగించుకుని వస్తారు.

Update: 2024-02-06 07:15 GMT

దిశ, ఫీచర్స్: కొంతమంది 5 నిమిషాల్లో స్నానాన్ని ముగించుకుని వస్తారు. మరికొంతమంది గంటల తరబడి స్నానం చేస్తూ ఉంటారు. రోజూ తప్పకుండా స్నానం చేయాలి.. అది ఆరోగ్యానికి మంచిదే. కానీ.. ఎక్కువ సేపు స్నానం చేయడం హెల్త్‌కు మంచిది కాదంటున్నారు నిపుణులు. ముఖ్యంగా వేడినీటితో చాలా సేపు బాతింగ్ చేస్తే పలు అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని చెబుతున్నారు.

చాలా మంది బయటకు వెళ్లినా, బయటికెళ్లొచ్చాక, పడుకునే ముందు ఏదైనా వర్క్ చేశాక ఇలా ఎక్కువ సార్లు హాట్ వాటర్‌తో స్నానం చేస్తారు. ఇలా తరచూ వేడి నీళ్లతో స్నానం చేయడం వల్ల శరీర ఆరోగ్యానికి చాలా ప్రమాదకరమని, చర్మంపై ఎన్నో చెడు ప్రభావాలను చూపుతుందని తాజాగా నిపుణులు వెల్లడించారు. హాట్ వాటర్‌తో బాతింగ్ వల్ల ఏఏ సమస్యలు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం..

వేడి వాటర్‌తో స్నానం చేయడం వల్ల తలెత్తే సమస్యలు..

* అమెరికా డాక్టర్లు వెల్లడించిన ప్రకారం.. వేడి వాటర్‌ను తల స్నానానికి ఎక్కువగా వాడే వ్యక్తులు ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. తలపై హాట్ వాటర్ పడితే తలపై బ్లడ్ సర్కులేషన్ వేగం తగ్గడమే కాకుండా.. హెయిర్ గ్రోథింగ్ ఆగిపోతుంది.

* వేడి వాటర్‌తో బాతింగ్ వల్ల మన చర్మం నుంచి సహజంగా ఉత్పత్తి అయ్యే ఆయిల్ ఉత్పత్తి ఆగిపోతుంది. తద్వారా చర్మం పొడిబారి పలు స్కిన్ ప్రాబ్లమ్స్ తలెత్తుతుంటాయి.

* హాట్ వాటర్ వల్ల ఆయిల్ ఉత్పత్తి తగ్గిపోవడంతో చర్మంలోని కణాలు నశిస్తాయి. దీంతో ఫేస్‌పై పింపుల్స్ వస్తాయి.

* వేడి నీటితో స్నానం చేయడం వల్ల చర్మానికి మేలు చేసే బ్యాక్టీరియా చనిపోతుంది.

* రక్తప్రసరణ పై ప్రతికూల ప్రభావం చూపుతుంది. బ్లడ్ సర్కిలేషన్ వేగం పెంచి హైపర్ టెన్షన్‌కు కారణమవుతుంది.

* ఎక్కువసేపు టబ్‌లో కూర్చోని వేడినీటితో స్నానం చేయడం వల్ల లైంగిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది.

* ఎక్కువమంది చలికాలంలో వేడి నీళ్లతో స్నానం చేయడానికి ఇష్టపడుతారు. కానీ చలికాలంలో ఎక్కువ మందికి చర్మం పొడిబారిపోతుంటుంది. ఈ సమయంలో మీరు తరచూ హాట్ వాటర్ తో స్నానం చేస్తే స్కిన్ దెబ్బతినడంతో పాటు చర్మం మరింత పొడిబారి.. స్కిన్ అలర్జీలు వచ్చే చాన్స్ ఉంటుందని తాజాగా అమెరికా వైద్య నిపుణులు చెబుతున్నారు.


Similar News