ఇంట్లో అందరూ ఓకే సబ్బును వాడుతున్నారా? సోప్‌కు బదులుగా ఇవి వాడటం బెటర్ అంటున్నారు నిపుణులు
సాధారణంగా ఇంట్లో ఉన్న సభ్యులంతా ఓకే సబ్బును వాడుతారు.
దిశ, ఫీచర్స్: సాధారణంగా ఇంట్లో ఉన్న సభ్యులంతా ఓకే సబ్బును వాడుతారు. కొంతమంది రిచ్ ఫ్యామిలీ వారు సెపరేట్ సోప్స్ వాడినప్పటికీ.. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వారు మాత్రం ఒకే సబ్బును ఉపయోగిస్తారు. అయితే ఇలా యూజ్ చేయడం ద్వారా ఎన్నో రకాల ఇన్ఫెక్షన్లు వస్తాయని.. ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చేందే అవకాశముందని, పలు అనారోగ్య సమస్యల బారిన పడతారని తరచూ నిపుణులు చెబుతూనే ఉంటారు. ప్రస్తుత రోజుల్లో పలు రోగాలకు.. ఫ్యామిలీ అంతా ఓకే సోప్ వాడటం కూడా ఓ కారణమని చెబుతున్నారు.
వీటితో పాటు డేంజరస్ బ్యాక్టీరియాలైన.. షిగెల్లా, సాల్మోనెల్లా, ఈ కొలి.. అలాగే రోటా, నోరో, స్టాఫ్ వంటి వైరస్‌లు కూడా ఉన్నాయని నిపుణులు వెల్లడించారు. కాబట్టి ఒకరు వాడిన సోప్ ను మరొకరు వాడటం మంచిది కాదు. ఏదైనా గాయాలైనప్పుడు ఆ సబ్బును వాడిన వ్యక్తి.. మరో పర్సన్ యూజ్ చేస్తాడు. అప్పుడు బ్యాక్టీరియా ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది.
కాగా కుటుంబంలోని సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగించే వారికి తాజాగా వైద్య నిపుణులు పలు సూచనలు చేశారు. ‘‘సబ్బు పెట్టెలో నీరు నిల్వ ఉంచకుండా చూసుకోవాలి. అలాగే సోప్‌కు బదులుగా లిక్విడ్ బాడీ వాష్, లిక్విడ్ హ్యాండ్ సోప్ యూజ్ చేయడం బెటర్ అని చెబుతున్నారు. అలాగే టవల్స్ కూడా ఒకరు వాడేవి మరొకరు వాడకూడదని నిపుణులు సూచిస్తున్నారు.