Physical Health : ఆ వయసులో జిమ్‌కు వెళ్లొచ్చా?

Physical Health : ఆ వయసులో జిమ్‌కు వెళ్లొచ్చా?

Update: 2025-02-12 14:54 GMT
Physical Health : ఆ వయసులో జిమ్‌కు వెళ్లొచ్చా?
  • whatsapp icon

దిశ, ఫీచర్స్ : ఫలానా సినిమాలో ఆ హీరోయిన్ ఎలా ఉంటుంది? వెరీ స్లిమ్.. జీరో సైజ్.. అచ్చం అట్లనే తయారు కావాలని కలలు గనే అమ్మాయిలు లేకపోలేదు. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ లెక్క తాము కూడా సిక్స్‌ప్యాక్ తెచ్చుకోవాలని ఆరాటపడే అబ్బాయిలకేం కొదువ లేదు. ముఖ్యంగా పిల్లల నుంచి పెద్దల వరకు అందం, అట్రాక్షన్ వంటి విషయాలపట్ల ఆసక్తి చూపుతున్నారు. ఆరోగ్యం కోసం, గ్లామర్ కోసం ఫిట్‌నెస్ ముఖ్యమని భావిస్తున్నారు. అందుకేనేమో ప్రతీ చోటా ఇప్పుడు జిమ్‌ సెంటర్లు వెలుస్తు్న్నాయి. అక్కడికిపోయే వారి సంఖ్య కూడా పెరుగుతోందని నిపుణులు చెబుతున్నారు. కాగా ఫిట్‌నెస్‌పై ఇంట్రెస్ట్ ఓకే కానీ ఏ వయసు వరకు జిమ్‌కు వెళ్లొచ్చు? పిల్లలు కూడా వెళ్లొచ్చా? అనే సందేహాలు కూడా పలువురిలో వ్యక్తం అవుతుంటాయి. నిపుణులు ఏం చెబుతున్నారో చూద్దాం.

*ఒకప్పటితో పోలిస్తే ప్రస్తుతం ఫిట్‌నెస్‌పై యువతలో మరింత ఆసక్తి పెరుగుతోంది. మంచి శరీర ఆకృతికోసం ప్రతి ఒక్కరూ ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా జిమ్‌కు వెళ్లి గంటల తరబడి వ్యాయామాలు చేసే వాళ్ల సంఖ్య పెరిగిపోతోంది. అయితే ఈ మధ్య పిల్లలు, టీనేజర్లు కూడా జిమ్‌కు వెళ్లడంపై ఆసక్తి చూపుతున్నారు. కానీ ఈ వర్కవుట్లు అన్ని వయస్సుల వారికి సరిపోవు. వయస్సును బట్టి కొన్ని చేయాల్సినవి, చేయకూడనివి కూడా ఉంటాయి. అందుకే పేరెంట్స్ తమ టీనేజర్స్ విషయం కేర్ తీసుకోవాలి. ఏ వయసులో జిమ్‌కు వెళ్లడం మంచిదో తెలుసుకుందాం.

*జిమ్‌కి వెళ్లి వ్యాయామం చేయడం ఆరోగ్యానికి మంచిదే.. కానీ 13 నుంచి 14 సంవత్సరాల వయస్సుగల వారు వెళ్లడం మంచిది కాదంటున్నారు నిపుణులు. ఈ ఏజ్‌లో వర్కవుట్స్ వల్ల కండరాలపై ఒత్తిడి పెరిగి బలహీనంగా మారవచ్చు. కార్డియో లేదా పవర్ లిఫ్టింగ్ చేస్తే గుండె ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది. కాబట్టి జిమ్‌కు వెళ్లడం పిల్లలకు మంచిది కాదు. ఒక వేళ మీ పిల్లలు ఊబకాయంతో ఉన్నట్లయితే వారిని ప్లేగ్రౌండ్‌లో వదిలివేయండి. రన్నింగ్, జంపింగ్ వంటి శరీరానికి వ్యాయామాన్ని అందిస్తాయి. బరువు కూడా తగ్గుతుంది. అంతే తప్ప జిమ్‌కు వెళ్లడం పిల్లలకు మంచిది కాదు. అవసరం అనుకుంటే 17 నుంచి 18 ఏండ్ల వయస్సులో జిమ్‌కి వెళ్లవచ్చు. కానీ తేలికపాటి వ్యాయామాలు ఎంచుకోవాలి. ఇక 20 నుంచి 50 ఏండ్ల వయస్సుగలవారు ఎవరైనా జిమ్‌కు వెళ్లి నచ్చిన వర్కవుట్స్ చేయవచ్చు. 

Tags:    

Similar News