Naga Panchami : నాగ పంచమి రోజు చేయకూడని పనులు ఏవో తెలుసా?

నాగపంచమి వచ్చేస్తుంది. ఈరోజు మహిళలు అందరూ పామును దేవతగా పూజించి పుట్టలో పాలు పోసి పూజలు చేస్తుంటారు. అయితే ఈ సారి ఆగస్టు 9న శుక్రవారం రోజు నాగ పంచమి వస్తుంది. కాబట్టి ఈ రోజు

Update: 2024-07-28 13:14 GMT

దిశ, ఫీచర్స్ : నాగపంచమి వచ్చేస్తుంది. ఈరోజు మహిళలు అందరూ పామును దేవతగా పూజించి పుట్టలో పాలు పోసి పూజలు చేస్తుంటారు. అయితే ఈ సారి ఆగస్టు 9న శుక్రవారం రోజు నాగ పంచమి వస్తుంది. కాబట్టి ఈ రోజు కొన్ని పనులు అస్సలు చేయకూడదంట. దీని వలన అనేక సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంటుందంట. కాగా, నాగ పంచమి రోజు చేయకూడని పనులు ఏవో ఇప్పుడు చూద్దాం.

1.నాగ పంచమి రోజున పాములకు హాని చేయకూడదు. ఇంటి వద్దకు లేదా మన చుట్టుపక్కల పాము కనిపిస్తే దానిని చంపడం లాంటిది చేయకూడదంట.

2.పాన్ పై ఏదైనా వంటకం చేయడం లాంటివి చేయకూడదంట. ఆరోజు ఉడికించిన ఫుడ్ మాత్రమే తీసుకోవాలంట.

3.నాగపంచమి రోజు ఇంటిని శుభ్రపరుచుకొని, మహిళ నిష్టగా పూజలు చేయాలంట.

4.నాగపంచమి రోజు ప్రతి ఒక్కరూ పుట్టలో పాలు పోస్తుంటారు. కానీ అలా చేయకూడదు అంటున్నారు పండితులు ఎందుకంటే పాలు, పాములకు విషంతో సమానం అంట. దానికి బదులు విగ్రహానికి పాలాభిషేకం చేయడం మంచిదంట.

5.నాగ పంచమి రోజు ఆకుకూరలు కోయడం చేయకూడదంట.

6.నాగపంచమి రోజు భూమిని దున్నడం లేదా పొలాన్ని దున్నడం లాంటిది చేయకూడదంట.

(నోట్ : పైవార్త నిపుణులు, ఇంటర్నెట్‌లోని సమాచారం మేరకు మాత్రమే ఇవ్వబడినది. దిశ దీనిని ధృవీకరించలేదు.)

Tags:    

Similar News