నెల రోజుల పాటు అన్నం తినకపోతే ఏమౌతుందో తెలుసా..?
అన్నం అనేది మన ఆహారంలో ముఖ్య భాగం. ఇండియాలో చాలా మంది మూడు పూటలా అన్నాన్నే తింటారు.
దిశ, వెబ్‌డెస్క్: అన్నం అనేది మన ఆహారంలో ముఖ్య భాగం. ఇండియాలో చాలా మంది మూడు పూటలా అన్నాన్నే తింటారు. బియ్యంలో కేలరీలు, కార్బోహైడ్రేట్లు అధికంగా ఉంటాయి. రోజు అన్నం తినడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మంచిది. కానీ రైస్‌ను పాలిష్ చేయడం వల్ల అవి మరింత తెల్లగా మారి పోషకాలు తగ్గుతాయి. దీంతో బియ్యంలో కార్బోహైడ్రేట్ల పరిమాణం ఎక్కువగా ఉంటుంది. దీని కారణంగా రక్తంలో చక్కెర స్థాయిలు వేగంగా పెరుగుతాయి. అయితే ఒక నెల పాటు అన్నం తినకపోతే, మీ శరీర బరువు తగ్గవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఒక నెల రోజుల పాటు రైస్‌ను పూర్తిగా వదులుకోవడం కొంతవరకు బరువు తగ్గే అవకాశాలున్నాయని అంటున్నరు. బియ్యం వినియోగాన్ని ఆపడం వల్ల రక్తంలో షుగర్ లెవల్స్‌ను తగ్గించడంలో మేలు చేస్తుందట. రైస్ తీసుకోవడం వల్ల మీ ఊబకాయం, రక్తంలో చక్కెర స్థాయిలు రెండూ పెరుగుతాయి. ఒక నెల పాటు అన్నం తినకపోతే, మీ రక్తంలో చక్కెర స్థాయి సాధారణంగా ఉంటుంది. మీ బరువు కూడా తగ్గుతుంది. అలాగే రైస్‌ను లిమిట్స్‌లో కొద్ది మొత్తంలో తీసుకుంటే శరీరానికి ఎలాంటి హాని జరగదంటున్నారు.
మన బాడీకి శక్తి ఉత్పత్తికి కార్బోహైడ్రేట్లు ఎంతో అవసరం. అయితే అన్నాన్ని పూర్తిగా మానేస్తే వారు బలహీనంగా మారిపోతారు. అంతేకాదు చాలా విటమిన్లు, ఖనిజాల లోపం కూడా ఏర్పడుతుందని చెబుతున్నారు. అలాగే హోల్ గ్రెయిన్ బియ్యం మన ఆరోగ్యానికి చాలా మంచివి. ఇవి గుండె ఆరోగ్యానికి ఎంతో సహాయపడుతాయి. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ కూడా తృణధాన్యాలు రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలను మెరుగుపరుస్తాయని, గుండె జబ్బులు, స్ట్రోక్ ప్రమాదాన్ని మరింత తగ్గిస్తాయని వెల్లడించింది.
Read more : వానకాలంలో ఇమ్యూనిటినీ పెంచుకోవడానికి అద్భుతమైన చిట్కాలు ఇవే?