వయసు ఎక్కువున్న మహిళలతో రిలేషన్‌షిప్.. అబ్బాయిలు తెలుసుకోవాల్సింది ఇదే!
యువకుల టేస్ట్ ఒక్కొక్కరిది ఒక్కో విధంగా ఉంటుంది. అది పెళ్లి, ఉద్యోగం, జీవితాన్ని అనుభవించే విషయంలోనూ కావచ్చు.
దిశ, వెబ్‌డెస్క్ : యువకుల టేస్ట్ ఒక్కొక్కరిది ఒక్కో విధంగా ఉంటుంది. అది పెళ్లి, ఉద్యోగం, జీవితాన్ని అనుభవించే విషయంలోనూ కావచ్చు. ఈ క్రమంలోనే కొంతమంది మగవారు తనకన్నా చిన్న వయస్సు ఉన్న అమ్మాయితో జీవనం సాగించాలనుకుంటారు. మరి కొంతమంది మగవారు తనకన్నా ఎక్కువ వయస్సున్న మహిళతో కాలం గడపాలనుకుంటారు. తనకన్నా ఎక్కువ వయస్సున్న మహిళల్లో ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుందని మగవారు నమ్ముతారు. అలాగే వారి తెలివితేటలకు, లైంగిక పరిపక్వతకి ఫిదా అవుతారు. అలాగే ఎక్కువ వయస్సున్న మహిళలు మగవారిపై చూపించే కేరింగ్‌కు కూడా వారు ఆకర్షితులవుతారు. అయితే ఎక్కువ వయస్సున్న మహిళతో జీవనం సాగించాలనుకుంటే కొన్ని లాభాలు ఉన్నాయి కొన్ని నష్టాలు ఉన్నాయి. మరి అవి ఏంటో చూద్దాం..
లాభాలు..
వయసు ఎక్కువ ఉన్న మహిళలు ఎవరితోనైనా రిలేషన్‌షిప్‌లో ఉంటే వారు ఏం కావాలనుకుంటున్నారో అనే విషయం పై క్లారిటీతో ఉంటారు. వారు చాలా ఓపెన్ మైండెడ్‌గా ఉంటారు. అలాగే తన ఎదుట ఉన్న వ్యక్తి మనస్తత్వాన్ని కూడా సులువుగా తెలుసుకుంటారు. అలాగే వారికి కాస్తో కూస్తో లైంగికంగా అనుభవం ఉండే ఉంటుంది. వారు తరచూ స్వీయ స్పృహను అనుభవించే దశను దాటి ఉంటారు కాబట్టి వారు లైంగికంగా చాలా ఎంజాయ్ చేస్తారు. అందుకే వారు శృంగారం చేసే సమయంలో సరదాగా గడుపుతారట. అలాగే వారు శృగారం చేసే సమయంలో కొత్తకొత్త పొజిషన్స్‌ను ట్రై చేసి ఆనందాన్ని పొందాలనుకుంటారు.
నష్టాలు..
ఇక నష్టాల విషయానికొస్తే ఏజ్ ఎక్కువగా ఉన్నవారితో డేటింగ్ చేసినా, వారిని వివాహం చేసుకున్నా వారిని సమాజం చిన్న చూపు చూస్తుంది. అబ్బాయి కన్నా మహిళ ఎక్కువ వయస్సుంటే అన్నీ తనకే తెలుసు అని అహంతో మెదులుతారు. అంతే కాదు వారు ఎదుటివారిపై అజమాయిషి చేస్తారు. అది ఏ విషయంలోనైనా కావొచ్చు. ఇకపోతే వయసు ఎక్కువగా ఉన్న మహిళలకు స్టామినా కాస్త తక్కువగా ఉంటుంది. శృంగారం చేసే సమయంలో వారు త్వరగా అలసిపోవడంతో పురుషులకి కాస్త ఇబ్బందిగా ఉంటుంది.